HEALTH & LIFESTYLE

వైద్య పరీక్షల ముందు ఇవి పాటించండి

ఈ టెస్ట్ చేయడానికి ముందు 12గంటల పాటు ఉపవాసం(పరగడుపు)తో ఉండాలి.

పీరియడ్స్‌లో ఉన్నప్పుడు చెకప్ చేయించుకోవద్దు.

మద్యపానం, పొగ తాగే అలవాటు ఉంటే టెస్ట్ చేయించుకోవడానికి ముందు రోజు పూర్తిగా మానేయాలి. 

కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్ ముందు రోజు తినకూడదు.

CBP(కంప్లీట్ బ్లడ్ పిక్చర్)

ఇందులో రక్తంలో రక్తకణాల సంఖ్య, షుగర్ లెవల్స్ ఎంత ఉన్నాయని తెలుస్తుంది. బ్లడ్‌లో ఇన్‌ఫెక్షన్ ఉందా? బ్లడ్ ఎంత ఉందనేవి ఇందులో తెలుస్తాయి.

లిపిడ్ ప్రొఫైల్:

ఈ టెస్ట్‌లో శరీరంలో కొలెస్ట్రాల్ ఎంత ఉంది? మంచి, చెడు కొవ్వులు ఎంత శాతం ఉన్నాయని తెలుసుకోవచ్చు. భవిష్యత్‌లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అని కూడా తెలుసుకోవచ్చు.

బీపీ, BMI(బాడీ మాస్ ఇండెక్స్)లను కొలుస్తారు.

విటమిన్-D, B 12 వంటి విటమిన్ల లోపం ఉందా? అని కూడా టెస్ట్ చేస్తారు.

ఊపిరితిత్తుల పరిస్థితి తెలుసుకోవడం కోసం ఛాతి ఎక్స్‌రే తీస్తారు.

కాలేయానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు.

గుండెకు ECG(ఎలక్ట్రో కార్డియో గ్రామ్), TMD(థ్రెడ్ మిల్ టెస్ట్)లు చేస్తారు.

పొట్టలో ఏమైనా అసాధారణంగా ఉందా అని తెలుసుకోవడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేస్తారు.

మూత్రపిండాల పనితీరును తెలుసుకోవడం కోసం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు.

Show More
Back to top button