
సాధారణంగా భూ గురుత్వాకర్షణ మన శరీరంపై పని చేస్తుంది. తలపై ఎక్కువ గ్రావిటీ ఫోర్స్ పని చేస్తుంది. దీని వల్ల తల కిందకు వాలినట్లు ఉంటుంది. దీని వల్ల కొందరిలో గూని వస్తుంది. ఇది పొడవుగా ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా, ప్రస్తుత రోజుల్లో టివి, మొబైల్, కంప్యూటర్లు వంటి స్క్రీన్స్ ఎక్కువగా చూస్తున్నారు. ఆ సమయంలో వారికి తెలియకుండా వాళ్ల మెడ కిందకు వాలిపోతుంది.
ఇది భవిషత్తులో వెన్ను నొప్పికి కారణం అవుతుంది. గూనిని వాంచ్‌బ్యాక్ అని కూడా అంటారు. ఎక్కువగా ఆఫీస్‌లో కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసే వారిని ఈ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసే వారు సరైన భంగిమలో కూర్చోవడమే దీనికి మంచి పరిష్కారం.
* ఎలా కూర్చోవాలి?
రోజులో ఎక్కువ సేపు కుర్చీలో కూర్చున్నప్పుడు మీ పాదాలు గాలిలో ఉంచకుండా నేలపై సమాంతరంగా ముందుకు ఉండాలి. వెన్నును వంచకుండా నిటారుగా ఉంచాలి. మీ కంటి చూపు ఎదురుగా ఉన్న స్క్రీన్‌కు సమాంతరంగా ఉండాలి. వెన్నును కుర్చీ వెనుక 30 నిమిషాలకు ఒకసారి కుర్చీలోంచి లేచి నడవడం మంచిది. భుజాలు, చేతులకు విశ్రాంతి ఇవ్వాలి