మనం ఎక్కువ భయపడే, అసహ్యించుకునే జంతువుల్లో బల్లి ముందు వరుసలో ఉంటుంది. బల్లి ఎదురైనా, మీద పడినా కీడు జరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. ఆహారంలో పడితే ఆలస్యం చేయకుండా.. మరో ఆలోచన లేకుండా వెంటనే ఆ ఆహారాన్ని పడేస్తారు.
అయితే బల్లి నిజంగా అంత ప్రమాదమా..? బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా..? నిజానికి బల్లి విషయంలో మనకున్నవన్నీ అపోహలేనట. బల్లి పడితే ఆహారం విషపూరితం కాదని, మనిషిని చంపేంత విషం బల్లిలో ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి.
నిజానికి బల్లులు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇంట్లో ఉండే చిన్నచిన్న కీటకాలను తినడం వల్ల వాటి నుంచి మనకు రక్షణ కల్పిస్తున్నాయి. బల్లులు ఎక్కువగా దోమలు, ఈగలు, ఇతర పురుగులను తింటాయి. దాని వల్ల మన ఇంట్లో వాటి బెడద తగ్గుతుంది.
ఒకవేళ బల్లులే లేకపోతే ఈ భూమి మీద కీటకాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి మనకు రకరకాల ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కీటక నాశనులు వాడితే అవి కూడా మనకు ప్రమాదమే.