శుభకార్యాలకు బాగా ఉపయోగించే వక్క తినడం వల్ల కొన్ని దుష్పరిణామాలతో పాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిపుణుల సూచనలతో తక్కువ మోతాదులో వక్క తింటే, మంచే జరుగుతుంది. వక్క తిన్నప్పుడు కొంచెం కళ్ళు తిరగడం సహజం. వక్కలలో ఆల్కలాయిడ్స్, టానిన్లు శాతం ఎక్కువ కాబట్టి.. ఇవి అనారోగ్యం కలిగిస్తాయి.
తరచూ వక్కలు, ఆకులు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని , క్యాన్సర్లు రావడానికి అవకాశం ఉందని నిపుణులు చెబుతారు. అదేపనిగా నమలడం వల్ల మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వక్కలు, వక్కపొడిని గర్భిణులు, బాలింతలు తీసుకోకూడదు. బిడ్డకు, తల్లికి ఇద్దరికి మంచిది కాదు. 18 సం.లు లోపు వారు వీటిని ఎక్కువగా తినకూడదు. రక్తం విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇవి ఒక రకమైన మత్తును, హాయిని కలిగిస్తాయి. కాబట్టి వీటికి బానిసలయ్యే ప్రమాదం ఎక్కువ.
అందరూ భయపడినట్లు వక్కలు ఆరోగ్యానికి అంత హానికరం ఏమీ కాదు. మితంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వక్క తినడం వల్ల పొట్టలో చేరిన లద్దెపురుగులు, నులిపురుగులను నాశనం చేస్తాయి. నోటి దుర్వాసన పోగొడతాయి. దీనిలోని ఎరికోలిన్ అనే పదార్ధం మెదడును ప్రభావితం చేసి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. గుండె జబ్బులతో బాధపడేవారికి దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కొంతవరకు మేలు చేస్తాయి. మత్స్యకారులు ఆక్టోపస్ వల్ల కలిగే పుండ్లకి వక్కను మందుగా వాడుతారు.
సెల్యులార్ డీజనరేషన్ అడ్డుకునే శక్తి వక్కలోని యాంటీఆక్లిడెంట్లకు ఉంది. స్కిజోఫ్రినియా అనే మానసిక వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి వక్కలు బాగా పనిచేస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. చాలామందికి ఇప్పటికి టిఫిన్, భోజనం చేసిన వెంటనే వక్కపొడి తినడం అలవాటు. దీనివల్ల జీర్ణక్రియ ఉత్సాహంగా పని చేస్తుంది. అదే పనిగా రోజంతా తింటే మెదడుపై కొంత చెడు ప్రభావం చూపుతుంది.