Telugu News

ట్రేడింగ్ చేయాలా? వద్దా? అని అనుకునేవారు ఇవి తెలుసుకోండి..

చాలా టైంలోనే అధిక లాభాలు పొందేందుకు ఎక్కువమంది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటారు. అయితే మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి ఎలాంటి అవగాహన లేనివారు కూడా ట్రేడింగ్ చేయొచ్చా? ఇంతకీ దీనివల్ల లాభమా? నష్టమా? అసలు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. స్టాక్‌ని ఒక రోజులో కొనుగోలు చేసి, తిరిగి అదే రోజు నిక్రయించడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అని అంటారు. ఇది ఇన్వెస్ట్మెంట్ కన్నా భిన్నంగా ఉంటుంది.

అందులో షేర్లను చాలారోజుల పాటు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంట్రాడేలో అలా కాదు. షేర్లను కొన్న రోజే అమ్మేయాలి. తర్వాత రోజుకు కొనసాగించడానికి వీలు ఉండదు. సాధారణంగా సగటు ఇన్వెస్టర్లు షేర్లను కొని వాటి ధర పెరిగాక అమ్మేస్తుంటారు. అయితే ట్రేడింగ్లో మరో ఆప్షన్ కూడా ఉంటుంది. పడిపోతాయనుకున్న షేర్లను ముందుగానే అమ్మేసి వాటి ధర తగ్గగానే కొనుగోలు చేయొచ్చు. అయితే షేర్ ధర పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది మనం ముందుగానే అర్ధం చేసుకొని.. దాని ప్రకారం ట్రేడింగ్ చేయాలి.

ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఓ వెసులుబాటు ఉంటుంది. అదే లెవరేజ్, అంటే మనం పెట్టే పెట్టుబడికి బ్రోకరేజ్ సంస్థలు కొంచెం డబ్బును కలిపి ఇన్వెస్ట్ చేస్తాయి. సెబీ నిబంధనల ప్రకారం.. ఒక స్టాక్ మీద గరిష్ఠంగా 5రెట్లు లెవరేజు ఇస్తాయి. ఉదాహరణకు రూ.10000లో ట్రేడ్ అవుతున్న 1000 స్టాక్స్ ను కొనుగోలు చేయాలంటే సాధారణంగా 10 లక్షల రూపాయలు కావాలి. కానీ ఇంట్రాడేలో రూ.లక్షలు ఉంటే సరిపోతుంది. ట్రేడింగ్ చేయడానికి స్టాక్ మార్కెట్ సైకాలజీని నేర్చుకోవాలి. అలాగే మార్కెట్ గురించి తెలిసి ఉండాలి.

ఒడిదొడుకులను సరిగ్గా అంచనా వేయగలగాలి. కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. వాటిని నేర్చుకోవాలి. ఇది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ఇందులో నష్టాలు చవిచూస్తుంటారు. కాబట్టి డైరెక్ట్ గా ట్రేడింగ్ చేయకూడదు. పేపర్ వర్క్ చేయండి మీరు డైరెక్ట్ గా ట్రేడింగ్ చేస్తే నష్టపోయే అవకాశం ఉంటుంది.

అందుకే అవగాహన కోసం కొన్నిరోజులు పేపర్ వర్క్ చేయండి. డబ్బులు పెట్టకుండా.. మీ ఉపాయాలను పేపర్పై రాసుకొని ఫలితాలను చెక్ చేసుకోండి. మీ ఉపాయం వర్క్ అవుట్ అవుతుందా? లేదా? గమనించండి. ఇలా చేస్తే ట్రేడింగ్లో మీ సామర్థ్యం ఎంతో మీకే తెలుస్తుంది. కొందరు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ట్రేడింగ్ చేసి నష్టపోతారు. మీరు ఎట్టిపరిస్థితుల్లో అలా చేయకూడదు. అలాగే.. ట్రేడింగ్ కి ఛార్జెస్ కూడా ఉంటాయని గమనించాలి.

నష్టపోయేవారే ఎక్కువ

2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23లో ట్రేడింగ్ చేసేవారి సంఖ్య 3 రెట్లు పెరిగిందట. ఇందులో 48% మంది 30 ఏళ్ల లోపు వారే ఉన్నారట. అయితే ఇలా ట్రేడ్ చేసేవారిలో కేవలం 30% మందికే లాభాలు వస్తున్నాయని సెబీ అధ్యయనం వెల్లడించింది. పదిలో ఏడుగురు నష్టపోతున్నారని నివేదిక తెలిపింది. ఇక రోజుకు 10 మంది ట్రేడ్ చేస్తుంటే అందులో 8 మంది నష్టపోతున్నారట. యువకులు ఎలాంటి అవగాహన లేకుండా ట్రేడ్ చేయడం వల్లే నష్టపోతున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇంట్రాడే ట్రేడింగ్ లో కళ్లు చెదిరేంత లాభాలు వస్తాయని చెబుతుంటారు. అది నిజమే. కానీ నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని మర్చిపోకూడదు. రిస్క్ చేయాలనుకునేవారు, నష్టపోయినా ఫర్వాలేదు అనుకునేవారు మాత్రమే ట్రేడింగ్ చేయాలి. లేదా షేర్ మార్కెట్ పై లోతైన అవగాహన ఉండాలి. చూడ్డానికి ఆకర్షణీయంగా అనిపించినా.. రియల్ టైమ్లో లాభాలు పొందడం అనుకున్నంత సులువు కాదు.

Show More
Back to top button