HEALTH & LIFESTYLE

వయసుకు తగ్గ బరువు లేరా?

సాధారణంగా బరువు తగ్గాలంటే కష్టం.. కానీ, పెరగటం కష్టమే కాదనుకుంటారు. కొందరు వారి ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండరు. దీంతో వారు బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తుంటారు. తక్కువ బరువు సమస్య అధిగమించడానికి ప్రయత్నిస్తారు. వయసును బట్టి ఎత్తుండాలి. ఎత్తుకు సరిపడా శరీర బరువుండాలి. కానీ, ఈ జనరేషన్ వారు తీసుకొనే ఆహారంలో పోషకలోపం, హార్మోన్లలో సమతుల్యత లేకపోవటం వల్లే తక్కువ బరువు ఉంటారు. సమయానికి తినకపోవడం, మానసిక, ఆరోగ్య సమస్యలు తక్కువ బరువుకు మరో కారణం. రక్తహీనత, దీర్ఘకాలిక జబ్బుల కారణంగా  వెయిట్ పెరగలేరు. ముందుగా బరువు పెరుగుదలకు అడ్డంకి ఏంటో తెలుసుకోవాలి. డాక్టర్ను సంప్రదించి, వారి సూచనలు పాటించాలి. ఆరోగ్యపరంగా శరీరంలో ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకొని, తినే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. బరువు తగ్గడానికే కాదు. పెరగాలన్నా వ్యాయామం చేస్తే మంచిది.

ఇవి తినండి..!

కొంతమంది బరువు పెరగడం కోసం స్థానికంగా దొరికే పౌడర్లు, ట్యాబ్లెట్లు వాడేస్తుంటారు. మరికొందరు జంక్ ఫుడ్స్ తింటుంటారు. కానీ వాటివల్ల బరువు పెరగడం మాట పక్కన పెడితే, సైడ్ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. కావున బరువు పెరగడానికి ఎప్పుడూ హెల్దీ డైట్‌‌నే ఫాలో అవ్వాలి. అప్పుడే బరువుతోపాటు శారీరక ఆరోగ్యం బాగుంటుంది.
చీజ్ (పన్నీర్): రెండు గ్రాముల చీజ్‌లో దాదాపు 9 కేలరీల శక్తి ఉంటుంది. దీనిలో కొవ్వుశాతం ఎక్కువ. బరువు పెరగాలనుకునే వాళ్లు రోజువారీ ఆహారం పన్నీరును చేర్చుకోవాలి.
అన్నం: బరువు పెరగాలనుకునే వారు అన్నం తినడం మంచిది. 150 గ్రాముల రైస్‌తో 40 గ్రాముల పిండిపదార్థాలు, 190 కేలరీల శక్తి వస్తుంది. తక్కువ బరువుతో బాధపడేవారు రోజూ మూడు పూటలా అన్నం తినాలి. అలాగే మొక్కజొన్న, గోధుమ, రాగులు, సజ్జలతో చేసిన రొట్టెలు తింటే మంచిది.
ఇక రోజూ డ్రైఫ్రూట్స్‌‌, వేరుశనగలు,‌ ఖర్జూరాలు తినాలి. అలాగే పాలు, పెరుగు, బంగాళదుంప, పప్పు ధాన్యాలు, ఎక్కువగా తీసుకుంటే బరువు త్వరగా పెరగొచ్చు. అలాగే ఉదయం రెండు అరటిపండ్లు తినాలి. చేపలు,  గుడ్లు, పాలు, మాంసాహారంతో ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి.

Show More
Back to top button