
ఇప్పటివరకు ఎన్నో రకాల ఫేస్ ప్యాక్ లు.. ఫేస్ క్రీములు వాడి ఉంటారు. కానీ ఎంతకాలం వాడిన బయట పొల్యూషన్, తీసుకునే ఆహారం వల్ల ఈ ప్రొడక్ట్ లు.. మీ నిగారింపును ఎక్కువ సమయం ఉంచలేకపోవచ్చు. ఇందుకోసమే కాస్త రొటీన్ కు భిన్నంగా.. ఎంతో ఈజీగా, ఇంట్లోనే మీకు నచ్చిన, కావాల్సిన ఫేస్ ప్యాక్ లను మీరే తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే…
తేనె, దాల్చిన చెక్క పొడి.. మూడువంతుల తేనె తీసుకుంటే, ఒక వంతు దాల్చినచెక్క పొడినీ కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, నైట్ అంతా అలానే ఉంచి ఉదయానే కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల ఆక్నే, మొటిమలు తగ్గి, నిగారింపు వస్తుంది.
నెయ్యి, గ్లిజరిన్.. నెయ్యి సహజ క్లెన్సర్ లా పని చేస్తుంది. ఇందులో గ్లిజరిన్ ను కొద్దిగా కలిపి, అవసరమయ్యేంత మేర ఫేస్ ప్యాక్ గా వేసుకొని, కడిగేసుకుంటే చాలు.. మంచి రిజల్ట్ ఉంటుంది.
ఆప్రికాట్, పెరుగు.. ఆప్రికాట్ ను మెత్తని పేస్ట్ లా చేసి, అందులో కొద్దిగా పెరుగు వేసి, బాగా మిక్స్ చేయాలి. ఇది చర్మానికి ఫ్రెష్ లుక్ ను అందిస్తుంది. కొద్దిగా తేనె చేర్చినా.. మరింత ఫ్రెష్ గా కనపడతారు.
గంధము, పసుపు, పాలు..
తగినంత గంధం పొడిలో కొద్దిగా పసుపు, పాలు కలిపి పేస్ట్ లా బాగా కలపాలి. ముఖానికి పట్టించి, పావుగంటయ్యాక చల్లని నీటితో కడిగేసుకుంటే సరి.. తాజాదనంతో పాటు గ్లోనెస్ కూడా పెరుగుతుంది.
టమోటో జ్యూస్… తాజా ఎర్రని టమోటో జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం పిండి, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం సాప్ట్ గా, కాంతివంతంగా మారుతుంది.
క్లియర్ అండ్ గ్లోయింగ్ ఫేస్ కోసం ఈ కాంబినేషన్ లతో కూడిన ఫేస్ ప్యాక్ లను.. మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మరీ…