
ఈరోజుల్లో అమ్మాయిలైన, అబ్బాయిలైన ఎవరైనా సరే… అందం అంటే.. హెయిర్ గురుంచే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు. అయితే మీ కేశాలు పదికాలాలపాటు పట్టులా ఉండాలంటే మాత్రం ఈ టిప్స్ ను డైలీ రొటీన్ లో భాగం చేయండి మరీ…
పొడవైన జుట్టు కావాలని ఎవరికి ఉండదు… ఇందుకోసం నిత్యం క్రమం తప్పకుండా తలపై నూనెతో మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ కేశాలు కుదుళ్ల నుంచి పటిష్ఠం అవుతాయి. ఎదుగుదలకు వీలవుతుంది. వారానికి కనీసం రెండుసార్లైన ఇలా చేయాలి.
జుట్టు చివర్లను ప్రతి 2-3 నెలలకోసారి సమానంగా కత్తిరించండి. చిట్లడం తగ్గుతుంది.
పట్టులాంటి కురులకోసం.. కొన్ని ఎర్ర(ఆరెంజ్) గుమ్మడికాయ ముక్కల్ని తీసుకొని, అందులో రెండు టీస్పూన్ల తేనె వేసి, పేస్టులాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్లవరకు అప్లై చేసుకోవాలి. పడుకునే ముందు షవర్ క్యాప్ పెట్టుకొని… ఉదయాన్నే తలస్నానం చేస్తే సరిపోతుంది.
జుట్టు ఆరోగ్యంగా ఉండటం కోసం… పాలు, ఆకుకూరలు, క్యారెట్, బీన్స్, జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం వంటివి రోజులో భాగం చేసుకోవాలి.
అలాగే సీజనల్ పండ్లు… ఆపిల్, ఆరెంజ్, దానిమ్మ, బెర్రీ, అవకాడో, అరటి, చిలగడదుంపలాంటివి నేరుగా తినొచ్చు లేదా జ్యూస్ రూపంలోనైనా తీసుకోవచ్చు.
మాంసాహారులైతే గుడ్లు, చేపలకు ప్రాధ్యాన్యమిస్తే సరి! వీటన్నిటితో పాటు రోజు నీరు ఎక్కువ(7-8 గ్లాసులు)గా తాగడం ఉత్తమం.
తగినంత నిద్ర లేకపోతే కూడా ఒత్తిడి, చిరాకు అనిపిస్తుంది. దీంతో స్ట్రెస్ ఎక్కువై జుట్టు రాలడానికి దారి తీయవచ్చు. రోజులో కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ముఖ్యమని గుర్తుంచుకోండి.
చేయకూడనివి… సోడా వంటి పానీయాలు తాగొద్దు. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు.
తక్కువ గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేశాక, పూర్తిగా ఆరనివ్వాలి. లేదంటే జుట్టు జీవం కోల్పోతుంది.
తలస్నానం చేసిన తర్వాత కురులను సహజంగా టవల్‌తో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి లేదా బ్లో డ్రయర్‌ని చాలా తక్కువ లెవల్‌లో ఉపయోగించి ఆరబెట్టుకోవడం మంచిది.
పైన తెలిపిన ఈ చిట్కాలను, జాగ్రత్తలను పాటిస్తూ.. మీ కేశాలను సంరక్షించుకోండి.