HEALTH & LIFESTYLE

తలనొప్పి నివారణకు సుప్తబద్ద కోణాసనం

తరచూ అందర్ని బాధపెట్టేది తలనొప్పి. తలనొప్పి వచ్చే కారణాలు బట్టి 350 రకాలుగా ఉన్నయట. అందులో శారీరక, మానసిక ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పులే ఎక్కువ. ఒత్తిడి తీవ్రత పెరిగినప్పుడు మొఖం, మెడ భాగాల్లోని రక్తనాళాలు వాపు, కుచించుకుపోడం జరుగుతుంది. అప్పుడు చాలా మంది వెంటనే కాఫీ లేదా టీ తాగుతారు. వాటితో నాళాల్లో ఏర్పడిన వాపు తగ్గిపోయి ఉపశమనం లభిస్తుంది. కానీ ఇది తాత్కాలికమే. టీ, కాఫీ ప్రభావం తగ్గగానే నాళాల్లో వాపు అంతకు ముందు కన్నా ఎక్కువౌతుంది. దీంతో తలనొప్పి కూడా అధికంమవుతుంది. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, నిద్రలేమి, వాతావరణ మార్పులు, కొన్ని రకాల ఆహారపు అలవాట్ల కారణంగా కూడా తలనొప్పి రావచ్చు. తలనొప్పి కలిగించే ఆహారపదార్ధాలేమిటో గుర్తించి వాటికి దూరంగా ఉంటే ఆ కారణంగా వచ్చే నొప్పిని నివారించొచ్చు. ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పికు సుప్త బద్ద కోణాసనంతో ఉపశమనం పొందవచ్చు.

ఆసనం వేసే విధానం

సుప్త బద్ద కోణాసనం చాలా సులభంగా వేయవచ్చు. ఈ చేయడానికి వెల్లెళకలా పడుకొని కాళ్లు బార్లా చాపండి.

తర్వాత రెండు అరిపాదాలు అభిముఖంగా చేసి ఫోటోలో చూపిన విధంగా ప్రయత్రించాలి. (అరిపాదాలు అభిముఖం చేసి వీలైనంతగా రెండు తొడ మధ్యకు తీసుకురండి) ఈ సమయంలో మీ తల, నడుము, మోకాళ్లు కొంచెం ఎత్తులో ఉంచడానికి మెత్తని దిండ్లు పెట్టంటి. 

అరికాళ్లు రెండూ తొడల మధ్యకు తీసుకురాడానికి.. నడుముకు, అరికాళ్లకు ఫోటోలో చూపినట్టు బెల్ట్ వేయండి. 

ఈ భంగిమలో ఉన్నప్పుడు మీ రెండు చేతులు దూరంగా చాచి.. ఫ్రీగా ఉంచండి.  

కొన్ని రోజులు చేసి అలవాటు అయ్యేంత వరకు బెల్ట్ ఉపయోగించండి.

సాధారణంగా శ్వాస తీసుకుంటూ  5-10 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వండి. ఇలా సుప్త బద్ద కోణాసనం రోజూ వేస్తే.. రెగ్యూలర్‌గా వచ్చే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Show More
Back to top button