
కాస్త ఆరోగ్యం బాగోపోతే చాలు.. మనకు వెంటనే గుర్తొచ్చేది ‘ట్యాబ్లెట్’. కాస్త తలనొప్పిగా ఉన్నా. జ్వరంగా ఉన్నా, ఒళ్లు నొప్పిగా అనిపించినా వెంటనే ఇంట్లో ఉండే ట్యాబ్లెట్ లేదా దగ్గరలో ఉన్న మెడికల్ షాప్సికో వెళ్లి మాత్రలు తెచ్చుకుని వేసుకుంటాం. అయితే వీటిని ఏదైనా తిన్నాకే ఎందుకు వేసుకోమంటారు? అనే సందేహం మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. అలాగే టాబ్లెట్ వేసుకున్నాక ఏవి తినకూడదు? ఏని తినాలి? ఇలా అనేక సందేహాలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
* మాత్రలు వేసుకోవడానికి ముందు తినకూడనివి
ద్రాక్ష: కొన్ని ఆహార పదార్థాలు కొన్ని మందుల ప్రభావాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని సార్లు దుష్ప్రభావాలకూ కారణమవుతాయి. ద్రాక్ష పండ్లు లేదా ద్రాక్ష జ్యూస్ తీసుకున్న వెంటనే మందులు వేసుకోవడం మంచిది కాదు. రక్తపోటుకు సంబంధించిన, యాంటీ యాంగ్జెటీ, కొలెస్ట్రాల్ తగ్గించే మందుల పనితీరుపై ఇది ప్రభావం చూపిస్తుంది.
పాల ఉత్పత్తులు: పాల ఉత్పత్తులు కూడా మాత్రల శోషణకు ఆటంకం కలిగిస్తాయి. టెట్రాసైక్లిన్, డాక్సీసైక్లిస్ వంటి కొన్ని యాంటీబయాటిక్స్ట్ మందులు తీసుకున్న 2 గంటలలోపు పాల ఉత్పత్తులను తీసుకోకపోవడం ఉత్తమం.
అధిక ఫైబర్ ఆహారాలు: తృణధాన్యాలు, చిక్కుళ్లు, పచ్చి పండ్లు వంటి అధిక-ఫైబర్ ఆహారాలు.. చైరాయిడ్ మెడిసిన్, కొన్ని యాంటిడిప్రెసెంట్స్ తో సహా కొన్ని మందుల శోషణకు ఆటంకం కలిగిస్తాయి.
కొవ్వు పదార్థాలు: మాంసాహారం వంటి కొవ్వు పదార్థాలు కొన్ని ఔషధాల పనితీరును నెమ్మదింపజేస్తాయి. వాటి ప్రభావాన్ని తగ్గిస్తాయి. త్వరగా శోషించాల్సిన మందులు తీసుకునే ముందు కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది.
ఆల్కహాల్: నొప్పి నివారణ, మత్తుమందులు, కొన్ని యాంటీబయాటిక్ లతో సహా అనేక మందులు తీసుకోవాల్సి ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది. మద్యం తాగిన తర్వాత మాత్రలు వేసుకుంటే కాలేయం దెబ్బతినే ప్రమాదం కూడా పెరుగుతుంట.
కెఫిన్: కెప్టెన్ కూడిన పదార్థాలు ఔషధాల పనితీరును ప్రభావితం చేస్తాయి.
* ట్యాబ్లెట్స్‌కు ముందు ఇవి తినొచ్చు
-తేలికపాటి బ్రెడ్, బిస్కెట్లు, అరటిపండ్లు, యాపిల్స్ వంటి ఆమ్ల రహిత పండ్లు తీసుకోవడం సురక్షితం.
-తేలికపాటి, కొవ్వు లేని ఆహార పదార్థాలు తీసుకోవాలి. కూరగాయలు, లీన్ ప్రోటీన్ మరియు తృణధాన్యాలు వంటి ఆహారాలను ఎంచుకోండి. భారీ లేదా కొవ్వు భోజనం కొన్ని ఔషధాల శోషణను ప్రభావితం చేయవచ్చు మరియు వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు.