Telugu News

ఏమిటీ ఏఐ డీప్‌సీక్?

చైనా స్టార్టప్ కంపెనీ అయిన ‘డీప్ స్టిక్’ ఎఫెక్ట్ తో అమెరికా టెక్ కంపెనీల షేర్లు ఒక్కరోజులో భారీ నష్టాన్ని చవిచూశాయి. లక్షల కోట్ల రూపాయలు మైక్రోసాఫ్ట్ షేర్లు 2%, గూగుల్ మాతృసంస్థ అయిన అల్ట్రాబిట్ షేర్లు 4.2% కుంగాయి.

డీప్ సేక్ అనేది ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ మోడళ్లను అభివృద్ధి చేసే చైనీస్ AJ కంపెనీ(స్టార్టప్స్), దీన్ని 2023 జులైలో లియాంగ్ వెన్ఫెంగ్ స్థాపించారు. కానీ, అమెరికా మార్కెట్లోకి ఈ ఏడాది జనవరి 10న విడుదలైంది. అయితే ఇది చాటికన్ టీ వంటిరే. కానీ, దీన్ని అతి తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలనందించే విధంగా రూపొందించారు. 

ఇది పూర్తిగా ఫ్రీ కావడంతో వార్తల్లో నిలిచి జనాల దృష్టిని ఆకర్షించింది. అందుకే డౌన్లోడ్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే అమెరికా కంపెనీలు చేస్తున్న ఖర్చు కంటే అతి తక్కువ ఖర్చుతో దీన్ని రూపొందించినట్లు తెలియడంతో జనవరి 27న స్టాక్ మార్కెట్ ప్రభావితమైంది. ప్రాంప్ట్కి సమాధానం ఇచ్చే ముందు రీజనింగ్ కూడా ఇస్తుండటం.. ఇతర మోడల్స్కి డీప్సీక్ ఆర్1కి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం. సక్సెస్ఫుల్ ఓపెన్ఏఐ టెక్నాలజీతో ఇది సమానంగా పనిచేస్తుందని సంస్థ చెబుతోంది.

ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. మోస్ట్ సక్సెస్ఫుల్ ఏఐ మోడల్స్ని రన్ చేసేందుకు సంస్థలు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంటే, వాటిల్లో సగం కూడా ఖర్చు చేయకుండానే ఏఐ మోడల్స్ని తీసుకొచ్చింది డీప్సీక్.

Show More
Back to top button