పెళ్లి అయిన ప్రతి స్త్రీ కోరుకునేది తల్లి కావాలని. దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తారు. గర్భం దాల్చినా తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే, క్రింది లక్షణాల ద్వారా, శరీరంలో జరిగే మార్పుల ద్వారా గర్భం దాల్చారో లేదో..! అనే విషయాలు తెలుసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
*పీరియడ్స్ ఆగిపోవడం
*మాటిమాటికీ నీరసించిపోవడం
*ఆకలి ఎక్కువగా వేయడం
*రొమ్ము సైజ్ పెరగడం
*తరచూ మూత్రవిసర్జన చేయడం
*ఎక్కువగా తిమ్మిర్లు రావడం
*వికారంగా ఉండడం, వాంతులు రావడం
*హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల తలనొప్పి ఎక్కువగా రావడం
*శరీర ఉష్ణోగ్రత పెరగడం
*శ్వాసలో ఇబ్బంది కలగడం
*ఆహార అలవాట్లలో మార్పులు
పై లక్షణాలు మీలో ఉంటే.. గర్భం దాల్చిన అవకాశాలు ఉన్నట్లు. కానీ, గర్భం దాల్చారని కచ్చితం కాదు. కాబట్టి, వైద్య పరీక్షలు చేయించుకుని నిర్ధారణకు రండి.