HEALTH & LIFESTYLE

ఏ విటమిన్ తగ్గితే ఏం జరుగుతుంది..!

మన శరీరంలో విటమిన్లు తగ్గడం వల్ల పలు వ్యాధులు వస్తుంటాయి. మీకు ఈ లక్షణాలు కనిపిస్తే దానికి సంబంధించిన విటమిన్లు మీ శరీరంలో తగ్గాయని గుర్తించండి. 

చలికాలం కాకపోయినా పెదవులు పగిలితే విటమిన్ B తక్కువగా ఉందని అర్థం. దీనికోసం చేపలు, గుడ్లు, పాలు తీసుకోవాలి.

నడుము నొప్పి తరచూ వస్తుంటే విటమిన్ D తక్కువగా ఉందని అర్థం. దీనికి చేపలు, గుడ్లు, మాంసం మంచివి. దానితో పాటు సూర్యరశ్మిలో కొంత సేపు ఉండండి.

హెయిర్ ఫాల్ విపరీతంగా కావడానికి కారణం శరీరంలో బీటా కెరోటిన్ తగ్గిందని అర్థం. దీనికోసం పాలకూర, బ్రోకలి, కాలిఫ్లవర్ ఎక్కువ తీసుకోండి.

పింపుల్స్ ఎక్కువగా వస్తున్నాయి అంటే విటమిన్ E తగ్గిందనమాట. దీనికోసం పండ్లు, ఆకుకూరలు, గుడ్లు, నట్స్ ఎక్కువ తీసుకోవాలి.

రోజంతా బద్ధకంగా ఉంటే.. విటమిన్ B2,C, IRON తగ్గాయని అర్థం. దీనికోసం బ్రోకలి, కాలిఫ్లవర్, స్ట్రాబెర్రీ, కివి పండ్లు, నట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తినండి.

విటమిన్ K ఇంకా E తగ్గినప్పుడు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఎక్కువగా వస్తాయి. సోయా బీన్స్, చికెన్, ధాన్యాలు, కూరగాయలు ఎక్కువగా తినండి.

ఈ మధ్య కాలంలో చాలామంది ఈ విటమిన్ల కోసం సప్లమెంట్స్ వాడుతున్నారు. అలా కాకుండా పండ్లు ఇలా ఆహారం ద్వారా తీసుకోవడం ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.

Show More
Back to top button