HEALTH & LIFESTYLE

గుండె నొప్పికి.. గ్యాస్ నొప్పికి తేడా ఏంటి?

కరోనా తర్వాత మనుషుల్లో గుండె పోటు సమస్యలు పెరిగిపోయాయి. గ్యాస్ నొప్పికి, గుండె పోటు నొప్పికి తేడా తెలియకపోవడంతో గుండె నొప్పిని లైట్ తీసుకుని చాలామంది తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి ఈ రెండిటి మధ్య తేడాలను తప్పకుండా తెలుసుకోవాలి. సాధారణంగా గ్యాస్‌కి కారణం అసిడిటీ. సరైన సమయానికి తినకపోవడం, ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం, బయటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. దీన్ని ఎదుర్కొంటున్న వారిలో తేన్పులు, పొత్తి కడుపులో నొప్పి, ఉబ్బరం, పొట్ట ఉబ్బడం, అజీర్ణం లాంటి లక్షణాలు ఉంటాయి. గ్యాస్ తీవ్రత ఎక్కువైతే గుండెలో నొప్పి వస్తుంది. ఇది అచ్చం గుండె నొప్పిగా ఉంటుంది. కానీ, ఈ రెండిటికీ తేడా ఏంటంటే..

గ్యాస్ నొప్పి వస్తే కడుపులో నొప్పి, తేన్పులు రావడం, ఒక్కోసారి కడుపు భాగంలో గుచ్చుతున్నట్లుగా ఉంటుంది. అదే గుండె నొప్పి అయితే.. ఛాతిలో ఎడ‌మ వైపు నొప్పి, క‌డుపు ఉబ్బ‌రంగా ఉండడం, పుల్ల‌ని తేన్పులు రావడం, గుండెలో మంట, విపరీతమైన చెమటలు పట్టడం లాంటివి జరుగుతాయి. కొంద‌రికి వాంతులు కూడా అవుతాయి. ముఖ్యంగా గుండె మధ్య భాగంలో చాలా బరువుగా ఉండటం. ఛాతి మీద ఏదో బ‌రువు పెట్టిన‌ట్లు అనిపించడం. ఎడమ చేయి బాగా లాగడం వంటివి జరుగుతాయి. ఏ నొప్పి అయిన అశ్ర‌ద్ధ చేయ‌కూడదు. వెంటనే ECG (ఎలక్ట్రో కార్డియోగ్రామ్) పరీక్ష చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.  

Show More
Back to top button