
కార్తీక మాసం ప్రారంభం కానుంది. చాలామంది జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకుంటారు. ఇందులో భాగంగా సోమ్‌నాథ్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల నుంచి సోమ్‌నాథ్‌కు చేరుకోవడానికి డైరెక్ట్ బస్సులు గాని, రైలు గాని లేవు. కాబట్టి, ముందుగా రాజ్‌కోట్ చేరుకోవాలి. ఇక్కడికి వెళ్లడానికి విమానం, రైలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి బస్సులో లేదా క్యాబ్‌లో సోమ్‌నాథ్ చేరుకోవచ్చు. సోమ్‌నాథ్ ద్వారకాకు దగ్గరగా ఉండడం వల్ల చాలామంది ద్వారకాను కూడా సందర్శిస్తారు. పురాణాల ప్రకారం సోమ్‌నాథ్ ఆలయం చంద్రుడు కట్టాడట. అంతేకాదు, మన భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగం కూడా ఇదే.
సోమ్‌నాథ్ చేరుకున్న తర్వాత ఆలయానికి దగ్గరలో హోటల్ రూం తీసుకోండి. లేదా అక్కడ ట్రస్ట్ రూంలను కూడా బుక్ చేసుకోవచ్చు. సోమ్‌నాథ్ జ్యోతిర్లింగం దర్శించుకున్న తర్వాత అక్కడ ఉండే ఇతర ప్రదేశాలను కూడా దర్శించుకోవచ్చు. అవేంటంటే.. పూరాతణ సోమ్‌నాథ్ ఆలయం, బల్క తిర్థం, సోమ్‌నాథ్ బీచ్, పాంచ్ పాండువుల గుహ, సూరజ్ మందిర్, పర్శురామ్ ఆలయం, కామ్‌నాథ్ మహాదేవ్ ఆలయాలను కూడా దర్శించవచ్చు.
ఈ టూర్‌కు అయ్యే ఖర్చు..
సోమ్‌నాథ్ టూర్‌కు దాదాపు 3-4 రోజులు పడుతుంది. ప్రయాణానికి అయ్యే ఖర్చు.. మీరు ఎంచుకునే రవాణా మీద ఆధారపడి ఉంటుంది. భోజనానికి ఒక్కరికి ఒకరోజకు దాదాపు రూ.400-రూ.500 వరకు అవుతుంది. ట్రాన్స్‌పోర్ట్ రోజుకు సుమారు రూ.500 నుంచి రూ.800 అవ్వొచ్చు. హోటల్ రూం రోజుకు రూ.1200 నుంచి రూ.1500 ఉంటుంది. మొత్తం కలిపి టూర్‌కు దాదాపు రూ.4,500 నుంచి రూ.8,500 వరకు ఖర్చు అవుతుంది.