
ప్రస్తుతం దేశం అంతా వర్షాకాలంగా మారిపోయింది. ఇటువంటి సందర్భాల్లో పచ్చటి ప్రకృతి, తడి గాలి, పొగమంచుతో నదులు గుర్తొస్తాయి కదా? అలాంటివే చూడాలంటే బెంగాల్‌లోని మడ అడవులు చాలా స్పెషల్. మాన్‌సూన్ టైంలో ఈ అడవుల అందం ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. పడవల మీద నెమ్మదిగా నదిలో ప్రయాణిస్తూ.. చుట్టూ అడవి అందాలను చూడడం అసలెప్పుడూ మర్చిపోలేని అనుభవం. ఇక్కడి సుందర్‌బన్స్ అడవులు ప్రపంచంలోనే పెద్ద మాంగ్రూవ్ అడవులు. రాయల్ బెంగాల్ టైగర్ నుంచి మొదలుకుని అరుదైన పక్షులు, మరెన్నో జంతువులు ఇక్కడ కనిపిస్తాయి. అడవిలోని నిశ్శబ్దం, అకాలంగా వచ్చే చినుకులు, పొగమంచు కలిసిన నీటి దృశ్యాలు ఇవన్నీ ఈ ట్రిప్ చాలా రిలాక్సింగ్‌గా ఉండేలా చేస్తుంది. అయితే ఇక్కడికి ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చవుతుంది? అక్కడ ఏమేమి చూడొచ్చు? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
విమాన మార్గం:
సికింద్రాబాద్ లేదా విశాఖపట్నం నుంచి నేరుగా కోల్‌కతా వరకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. రేట్లు సీజన్‌కు అనుగుణంగా మారుతుంటాయి. ముందుగానే బుక్ చేస్తే రూ.3000–రూ.5000 రేంజ్‌లో టికెట్లు లభించవచ్చు.
రైలు మార్గం :
సికింద్రాబాద్ హౌరా (కోల్‌కతా) వరకు ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్లు ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి అయితే ట్రావెల్ టైం సుమారుగా 26–30 గంటలు పడుతుంది. టికెట్ ధరలు ₹800 (స్లీపర్), ₹2000 (3AC) చుట్టూ ఉంటాయి.
కోల్‌కతా నుంచి మడ అడవులకు:
కోల్‌కతా నుంచి సుందర్‌బన్స్ (మడ అడవులు)కి ప్రయాణించాలంటే గోద్కాల్ లేదా కానింగ్ స్టేషన్ నుంచి బోటు సర్వీసులు, టూరిజం ప్యాకేజీలు ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కన్నా టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవడం బెటర్.
మొత్తం బడ్జెట్ ఎంత అవుతుంది?
విమానం లేదా రైలు చార్జీలు – ₹3000–₹6000 (రౌండ్ ట్రిప్)
బోటు క్రూజ్ ప్యాకేజీ (1–2 డేస్) – ₹2500–₹4000
అకమోడేషన్ (హౌస్‌బోట్స్/రెసార్ట్స్) – ₹1500–₹3000 (ఒక రాత్రికి)
ఫుడ్ & ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ – ₹1000–₹2000
మొత్తం: ₹8000 – ₹15,000 బడ్జెట్‌లో సుందర్‌బన్స్ మడ అడవుల ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.
అక్కడ చూడదగ్గ ముఖ్యమైన ప్రదేశాలు
సుందర్‌బన్ నేషనల్ పార్క్ – రాయల్ బెంగాల్ టైగర్, మగరూకొండలు, డీయర్, పక్షులు చూస్తారు.
షాజేఖాలి వాచ్ టవర్ – అడవి అంతటినీ పర్యవేక్షించడానికి బెస్ట్ స్పాట్.
సుదన్యఖాలి క్యాంప్ – టైగర్, మొసళ్లను దగ్గరగా గమనించవచ్చు.
గోసాబా గ్రామం – స్థానిక జీవనశైలిని చూడవచ్చు.
బోటు రైడ్ & రివర్ క్రూజ్ – మబ్బుల మధ్య అడవిని దాటి వెళ్లే అనుభూతి వర్ణించలేం