Telugu Politics

స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొత్త ట్విస్ట్..! చంద్రబాబు నేరస్తుడు కాదు ..?

స్కిల్ ఇండియా డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కేసు రోజుకోసారి కొత్త మలుపులు తిరుగుతోంది. అయితే, దీనిని కొందరు కక్ష పూరిత చర్యగా చెబుతుంటే, మరికొందరు చంద్రబాబు నిజంగానే స్కాం చేసి ఉంటారని చెబుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో చంద్రబాబు నాయుడు హయాంలో ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన పీవీ రమేష్, డీజైన్‌టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ సంచలన విషయాలు బయటపెట్టారు.

అంతేకాదు 2019లో అంతర్జాతీయ నైపుణ్య సదస్సులో విడుదల చేసిన ఇండియా స్కిల్స్ రిపోర్ట్స్‌లో కొన్ని అంశాలు కూడా ఇప్పడు వైరల్‌ అవుతున్నాయి. అసలు అవేంటో వివరంగా చర్చిద్దాం పదండి.

పీవీ రమేశ్

చంద్రబాబు నాయుడు హయాంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన పీవీ రమేశ్ తాజాగా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే..

కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో చట్టపరమైన విధానాలు పాటించారని.. చట్టసభ, కేబినెట్‌, అనుమతితోనే వనరులు ఏర్పాటు చేశారని వెల్లడించారు.

అన్నీ ఫైనల్ అయ్యాకే.. నిర్ణయం తీసుకున్న నాటి సీఎం చంద్రబాబు మీద కేసు పెట్టడం దారుణమని రమేశ్ పేర్కొన్నారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. తాను అప్రూవర్‌గా మారాననే ప్రచారం అవాస్తవమని చెప్తూ.. పోయిన నోట్‌ ఫైల్స్‌ మీద సీఐడీ  (CID) దృష్టి పెట్టాలని హితవు పలికారు.

సీఎంగా ఉండేవారు అనేక అంశాలను పర్యవేక్షిస్తారని, వాటికి సంబంధించిన శాఖల అధికారులే ప్రధాన బాధ్యత వహించాలని రమేశ్ స్పష్టం చేశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫైల్స్‌ పరిశీలిస్తే అన్నీ స్పష్టంగా అర్థమవుతాయని చెప్పారు.

తన వాంగ్మూలం ఆధారంగానే మాజీ సీఎంను అరెస్ట్ చేశారనటం హాస్యాస్పదమంటూ.. తీవ్రంగా ఖండించారు.


ఎండీ ఖాన్ విల్కర్

అయితే, తాజాగా ఈ కేసుకు సంబంధిచి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఒప్పందంపై, డిజైన్‌టెక్ ఎండీ ఖాన్ విల్కర్ వీడియో ద్వారా స్పందిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. అసలు ఇందులో ఎలాంటి స్కాం జరగలేదని, దీనికి చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమని అన్నారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రూ.371 కోట్ల విలువైన మొత్తం సామగ్రిని సరఫరా చేశాం.

సరఫరా చేసిన మొత్తం ఎక్విప్‍మెంట్‍కు సంబంధించిన డేటాను ఆ వీడియోలో తెలిపారు.

ముఖ్యంగా  GST కుంభకోణం పై వస్తున్న ఆరోపణలు అస్సలు నిజం కాదని ఆయన వివరించారు.

దర్యాప్తు సంస్థలు తపమని సంప్రదించడం లేదని, దీనికి సంబంధించి ఆడిటర్లను తమ దగ్గరకు పంపితే పూర్తి లెక్కలు చూపించి అసలు నిజాలు తేల్చుతానని ఆయన పేర్కొన్నారు.

ఇండియా స్కిల్స్ రిపోర్ట్స్

టీడీపీ హయాంలో నారా చంద్రబాబు చేసిన కృషిగాను.. దేశంలో ఉద్యోగార్హ నైపుణ్యాలున్న యువతను అత్యధికంగా సరఫరా చేసే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. 2016, 2018, 2019 నివేదికల్లోను ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో, 2017లో రెండో స్థానంలోనూ నిలిచింది. అత్యంత ఉద్యోగార్హత నైపుణ్యాలున్న వివిధ రాష్ట్రాల్లో ఏడో స్థానంలో నిలిచిన ఏపీని స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ఆయన చేసిన కృషికిగాను మొదటి స్థానం దక్కించుకుంన్నట్లు రిపోర్టులను టీడీపీ నేతలు పోస్టు చేస్తున్నారు. అలాంటి గ్రోత్‌ను తీసుకోచ్చిన మాజీ ముఖ్యమంత్రిని తప్పుడు కేసులు పెట్టడం ప్రజాసౌమ్య వ్యవస్థకే మంచిది కాదని తీవ్రంగా ధ్వజం ఎత్తుతున్నారు.

అయితే, ఇదిలా ఉండాగా స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడో ఉన్న రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన టీడీపీ 2019లో పార్టీ మారింది.

అప్పుడే 2019 సంవత్సరానికి గాను స్కిల్ ఇండియా రిపోర్టు విడుదల అయ్యింది. ఆ రిపోర్టులో ఆంధ్రప్రదేశ్ మళ్లీ మొదటి స్థానంలోకి రావడంతో..

అప్పుడే వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ క్రిడెట్స్ మొత్తం సీఎం జగన్ వల్లే సాధ్యపడిందని చెప్పుకున్నట్లు తెలుస్తోంది.

కానీ, అది ముందు ప్రభుత్వం చేసిన కృషి వల్లనే వచ్చిందని పెద్దగా జనాల్లోకి వెల్లలేదు. దీనిని టీడీపీ ఎంత ప్రచారం చేసిన ఫలితం లేకుండా పోయింది.

ఏది ఏమైనప్పటికీ.. ఇందులో నిజ నిజాలు తెలుసుకుని మాత్రమే ప్రజలు ఉండాలని కొన్ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

Show More
Back to top button