TRAVEL

వైజాగ్ అందాలు చూసొద్దామా..!

మణీయమైన ప్రకృతి సోయగాలను చూడడానికి ఎవరికి మాత్రం మనసు పులకరించదు. ఈ బిజీ లైఫ్‌లో నాలుగు రోజులు సెలవు తీసుకుని హాయిగా అలా అందాలను విరజిల్లే వైజాగ్ వెళ్తే అంతకంటే భాగ్యం ఏం ఉంటుంది. వైజాగ్ అందాలను వర్ణించాలంటే మాటలు సరిపోవు. ఆంధ్రప్రదేశ్‌లో బంగాళాఖాతం తీరాన్ని తాకుతున్న ఈ నగరాన్ని సందర్శించడానికి ప్లాన్ వేసేద్దామా మరి..

వైజాగ్‌కి శీతాకాలంలో వెళ్తే స్వర్గాన్ని చూసిన అనుభూతి సొంతం చేసుకోవచ్చు. ఇది స్మార్ట్‌సిటీ పేరుకు తగ్గట్టే చాలా అందంగా ఉంటుంది. సుందరమైన బీచ్‌లు, ప్రఖ్యాత టూరిస్ట్ ప్రదేశాలతో నిత్యం ఆకట్టుకునేలా ఉంటుంది. వైజాగ్ పూర్తి అందాలను చూడాలంటే కనీసం 3-4 రోజుల సమయం పడుతుంది. కాబట్టి మీరు మీ టైంను బట్టి టూర్‌ని ప్లాన్ చేసుకోండి.

వైజాగ్‌కి ఎలా వెళ్లాలి..?

వైజాగ్ నగరానికి చేరుకోవడానికి హైదరాబాద్, తిరుపతి నుంచి ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి డైరెక్ట్‌గా వైజాగ్‌ వద్దనే ఆగుతాయి. లేదా బస్సులో, విమానంలో, ప్రైవేట్ వెహికల్‌లో వెళ్లవచ్చు. వైజాగ్‌ చేరిన తర్వాత ఆర్కే బీచ్‌‌ దగ్గరలో రూం తీసుకుని ఉంటే బెటర్ అని అంటున్నారు సందర్శకులు. అక్కడి నుంచి ఇతర ప్రదేశాలకు తిరగడానికి టూ వీలర్ రెంట్‌కి తీసుకోవచ్చు లేదా టాక్సి, బస్సు లాంటివి ఉపయోగించుకోవచ్చు.

వైజాగ్‌లో చూడాల్సిన ప్రదేశాలు..?

రామకృష్ణ బీచ్
తొట్ల కొండ బీచ్
కైలాసగిరి
సింహాచలం
తెన్నేటి పార్క్
వుడా పార్క్
ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం
ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్
సబ్ మెరైన్ మ్యూజియం
లైట్ హౌస్
కటిక వాటర్ ఫాల్స్
రుషికొండ బీచ్
యారాడ బీచ్

టూర్ బడ్జెట్‌

ఒకరోజుకు గాను ఒకరికి ఆహారానికి రూ.300 నుంచి రూ.500 వరకు ఖర్చవుతుంది. ట్రావెలింగ్ ఖర్చు మీరు ఎంచుకున్న రవాణాను బట్టి ఉంటుంది. రూంకి రూ.800 నుంచి రూ.1200 వరకు అవుతుంది. ప్రదేశాల ఎంట్రీ టిక్కెట్‌, ఇతర ఖర్చులన్ని దాదాపు రూ.1500 నుంచి రూ.2000 వరకు అవుతాయి. 3 రోజుల ట్రిప్పుకు ఒకరికి దాదాపు రూ.5000 నుంచి రూ.8000 వరకు అవుతుంది. ఎక్కువ మంది కలిసి వెళ్తే ఖర్చు తగ్గుతుంది.

Show More
Back to top button