TRAVEL

సమ్మర్‌లో లడఖ్ టూర్ వెళ్తే.. ఇక స్వర్గమే 

ఈ కాలంలో ఎండలకు దూరంగా చల్లని ప్రదేశాలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నారా..? అయితే, లడఖ్ మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఈ సుందరమైన ప్రదేశాన్ని జీవితంలో ఒక్కసారైన సందర్శించాలని చాలామంది అనుకుంటారు. మీరు అందులో ఒకరైతే పదండి లడఖ్‌ టూర్ ప్లాన్ చేద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి అంటే హైదరాబాద్, తిరుపతి, విజయవాడ నుంచి జమ్ము తవికి రైళ్లు ఉన్నాయి. జమ్మూ తవి నుంచి లడఖ్‌కు దాదాపు 673 కి.మీ దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి లడఖ్‌కు ట్రెయిన్లు అందుబాటులో ఉంటాయి. కానీ, ఇలా రైలు మార్గంలో వెళ్తే దాదాపు 45 గంటలకు పైగా సమయం పడుతుంది. ఎక్కువ ఖర్చు తట్టుకోగలిగితే విమాన మార్గం బెస్ట్ అని చెప్పవచ్చు. హైదరాబాద్ నుంచి లడఖ్‌కు విమానం అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రయాణం దాదాపు 12 గంటల నుంచి 18 గంటల వరకు ఉంటుంది. మీ బడ్జెట్ బట్టి మీ రవాణా మార్గాన్ని ఎంచుకోండి.

లడఖ్‌లో చూడవలసిన ప్రదేశాలివే..!

* సీమో గొంపా

*డ్రాంగ్-డ్రంగ్ గ్లేసియర్

*నుబ్రా లోయ

*పంగ్‌గొంగ్ లేక్(pangong lake)

*లమయురు

*కార్గిల్

ఈ టూర్ మొత్తం పూర్తి చేయడానికి దాదాపు 6 నుంచి 7 రోజుల సమయం పడుతుంది. దీనికి అనుగుణంగా మీరు మీ లగేజ్ ప్యాక్ చేసుకోండి. మీరు ఒకవేళ టూరిస్ట్ ఏజెన్సీ ద్వారా వెళ్లాలనుకుంటే.. ఈ ప్రదేశాలు ఆ ప్లాన్‌లో ఉన్నాయా..? లేవా..? అనే విషయాలు ముందుగానే చూసుకోండి. 

టూర్ బడ్జెట్ ఎంత..?

*మీరు ఎంచుకునే రవాణా ప్రకారం ప్రయాణ ఖర్చు ఉంటుంది. 

*రూమ్‌కు దాదాపు రూ.1200 నుంచి రూ.3000 వరకు ఖర్చు అవుతుంది. ఇంకా లగ్జరీగా కావాలనుకుంటే రోజుకు దాదాపు రూ.10,000 వరకు ఖర్చు అవుతుంది.

*ఒకరికి భోజనానికి రోజుకు దాదాపు రూ.500 నుంచి రూ.700 వరకు అవుతుంది. 

*లడఖ్‌లో ప్రదేశాలను సందర్శించడానికి రోజుకు ప్రయాణ ఖర్చుకు దాదాపు రూ.400 నుంచి రూ.500 వరకు అవుతుంది.

*మీరు షాపింగ్ చేయాలనుకుంటే మరికొంత డబ్బు ఎక్కువగా తీసుకుని వెళ్లడం మంచిది. 

*వివిధ ఎంట్రీ టికెట్‌లకు దాదాపు రూ.1000 నుంచి రూ.2000 వరకు అవుతుంది.

*దీనిబట్టి మీరు మీ టూర్‌ని ప్లాన్ చేసుకోండి.

Show More
Back to top button