TRAVEL

కోయంబత్తూర్ టూర్ ప్లాన్ చేద్దామా..?

సంవత్సరం చివర ఏదైనా మంచి టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే కోయంబత్తూర్‌కి వెళ్లడానికి ఇది మంచి సమయం ప్రయాణికులు చెబుతున్నారు. కోయంబత్తూర్ తమిళనాడులో చెన్నై తర్వాత డెవలప్ అయిన సిటీ కూడా. అలాంటి సిటీకి వెళ్లడానికి ప్లాన్ చేద్దామా మరి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లాలనుకుంటే సికింద్రాబాద్, వైజాగ్, విజయనగరం నుంచి వెళ్లవచ్చు. లేదా తిరుపతి నుంచి కూడా వెళ్లవచ్చు. లేదా విమానం, సొంత వాహనాలు ద్వారా కూడా వెళ్లవచ్చు.

*హైదరబాద్ నుంచి కోయంబత్తూర్‌‌కి వెళ్లే ట్రెయిన్ శబరీ ఎక్స్‌ప్రెస్
*విజయవాడ, తిరుపతి నుంచి కోయంబత్తూర్‌‌కి వెళ్లే బెస్ట్ ట్రెయిన్ కేరళ ఎక్స్‌ప్రెస్.
*వైజాగ్ నుంచి కోయంబత్తూర్‌‌కి వెళ్లే బెస్ట్ ట్రెయిన్ టాటా అలపి ఎక్స్‌ప్రెస్.

రైలులో ప్రయాణం చేస్తే 24 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. కోయంబత్తూర్ చేరుకున్న తర్వాత అక్కడ బస చేయడానికి రైల్వే స్టేషన్ ఏరియా, గాంధీపురం ఏరియా బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రదేశాల నుంచి కోయంబత్తూర్ తిరగడానికి సులభంగా ఉంటుంది.

కోయంబత్తూర్ చూడాల్సిన ప్రదేశాలివే

ఆదియోగి శివుని విగ్రహం
మరుధమలై కొండ దేవాలయం
శ్రీ అయ్యప్పన్ ఆలయం
GD నాయుడు మ్యూజియం
వెల్లియంగిరి పర్వతాలు
కోవై కుట్రాలం జలపాతం
పట్టీశ్వర దేవాలయం పేరూరు
బ్లాక్ థండర్ వినోద ఉద్యానవనం
నెహ్రూ పార్క్
మంకీ ఫాల్స్
కోయంబత్తూరులో షాపింగ్
స్థానిక వంటకాలు

కోయంబత్తూర్ లోకల్ ప్రదేశాలను ఒక రోజులో కవర్ చేవయచ్చు. దీనికోసం లోకల్ బస్సులు అందుబాటులో ఉంటాయి. లేదా ఆటోలో కూడా ఈ ప్రదేశాలను కవర్ చేయవచ్చు. ఈ టూర్‌కు గాను దాదాపు 5 నుంచి 6 రోజుల సమయం పడుతుంది.

టూర్ బడ్జెట్ ఎంతంటే

*మీరు ఎంచుకునే రవాణా బట్టి మీ ప్రయాణం ఖర్చు ఉంటుంది.
*రూంకు రోజుకు దాదాపు రూ.750 నుంచి రూ.1200 వరకు అవుతుంది. ఎక్కువ సౌకర్యాలు ఉన్న రూం అయితే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది.
*రోజుకు భోజనానికి దాదాపు రూ.300 నుంచి రూ.500 వరకు అవుతుంది.
*లోకల్‌లో తిరగడానికి రోజుకు రూ.500 వరకు అవుతుంది.
* వివిధ ప్రదేశాల ఏంట్రి టిక్కెట్లు దాదాపు రూ.600 వరకు అవుతుంది.
* ఇతర ఖర్చు రూ.1500 వరకు అవుతుంది.
దీనిబట్టి మీరు మీ టూర్‌ను ప్లాన్ చేసుకోండి.

Show More
Back to top button