Telugu Politics

ఆంధ్రా రాజకీయ లెక్కలు తెలబోతున్నాయా.?

తెలంగాణ,ఆంధ్రా రాజకీయ పరిస్థితులను చూస్తుంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

ఆంధ్రప్రదేశ్ లో చాలావరకు జగన్ పై చాలా వ్యతిరేకత ఉంది.ఒకవైపు నారాలోకేష్ శంఖారావం పేరిట యాత్రలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతూ పార్టీకి బలం చేకూరుస్తున్నారు. మరోవైపు వైసీపీ వాళ్లు టీడీపీకి నామరూపాలు లేకుండా చేస్తామంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. జనసేన గుర్తు అయినా గ్లాస్ ను సింక్ లో  ఉంచాలని, ఫ్యానును తలపై పెట్టుకోవాలని, సైకిల్ ను మూలకు పారేయాలని మాటల పందాలు విసురుతూ ఎద్దేవా చేస్తున్నారు.

కానీ వైసీపీ వాళ్లు ఎంత బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న కూడా చంద్రబాబు గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా, తన పని తాను చేసుకుంటూ తన పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సభలను అడ్డుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా వైసీపి  ప్రయత్నిస్తున్నా కూడా అవన్నీ అధిగమించి పవన్ కళ్యాణ్ తాను అనుకున్న విధంగా ముందుకు వెళ్తూ, పార్టీ నేతలలో, కార్యకర్తలలో విశ్వాసం నింపుతున్నారు.

సభలకు అంతరాయం కలిగించినా,అనుమతులు ఇవ్వకపోయినా తాను అనుకున్న విధంగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

చంద్రబాబు గారి ఫ్యామిలీ మొత్తం పార్టీని బలోపేతం చేయడానికి తమ తమ కృషి చేస్తూ శంఖారావం, నిజం గెలవాలి పేరిట బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని,ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు.

నిజానికి వైసీపీ అంటే జగన్ పాలనలో ప్రజలు చాలావరకు అసంతృప్తితో ఉన్నారు అనడంలో సందేహం లేదు.చాలా వరకు టీడీపి రావాలని కోరుకునే వారే ఎక్కువగా ఉన్నారు.

కానీ వైసీపీ వాళ్ళు కొందర్ని బెదిరించి, లేదా కులం పేరుతో ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు అనేది బహిరంగ రహస్యం.

జగన్ వర్గం పవన్-చంద్రబాబు మధ్య ఉన్న అండర్ స్టాండ్ ను చూస్తూ పిచ్చెక్కి,పిచ్చి కూతలు కూస్తూ,జుట్టు పీక్కుంటున్నారు.అందువల్లనే నియోజక వర్గాలలో తిరుగుతూ బహిరంగ సభలు పెడుతూ సిద్దమా అంటూ ప్రజల మధ్యకు వెళ్ళడం చేస్తున్నారు,కానీ ఇన్నేళ్ళలో పెట్టిన నవరత్నాలు తప్ప ఏ ఒక్కరికి ఉపాధి లేదు,నవరత్నాలు తలకు రాసుకోవడానికే తప్ప ప్రజల్లో విశ్వాసాన్ని నింపలేక పోయారు.

రాజధాని లేకుండా,ప్రజలను పాలిస్తున్నా అనే జగన్ చెల్లి షర్మిల వేసిన ప్రశ్నలకు మిగిలిన వారిని ఉసిగొల్పారు తప్ప సమాధానం ఇవ్వలేదు. అటూ షర్మిల కాంగ్రెస్ లో చేరి బలాన్ని పెంచింది, కానీ అక్కడ అంతగా కాంగ్రెస్ హవా లేదనేది అందరికి తెలుసు.

జగన్ ఢిల్లీ పర్యటన కూడా ఎన్నికలలో ఒక భాగమే, అలాగే డీఎస్సీ వేయడం కొత్త నాటకం,కొత్త పథకాలను ,రంగులను మార్చడం కూడా ఇందులో ఒక ఎత్తుగడగా మారింది.చేపలకు ఎర వేసినట్టు వైసీపీ ప్రజలకు, యువతకు ఇదొక ఎరగా చూపించి ఓట్లు దండుకోవాలని చూస్తుంది తప్ప పెద్ద ప్రయోజనం లేదనీ వారికీ అర్ధం అయ్యింది.

ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ సైకిల్ పుంజుకుంటుంది అనేది నిజం.సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదం నిజం అవబోతుంది అనేది వందశాతం నిజం.

ఇక తెలంగాణ లో కొత్త ప్రభుత్వం కేబినెట్ విస్తరణ ఇంకా పూర్తి కాలేదు. అలాగే అన్ని శాఖలలో ప్రక్షాళన కూడా అవ్వలేదు 70 రోజుల పాలనలో రెండు హామీలు అమలు చేసి మరో రెండు పథకాలు ప్రారంభిస్తామని అంటున్నారు. ఇక పోతే కాంగ్రెస్ మాత్రం మేడిగడ్డ,కాళేశ్వరం ప్రాజెక్ట్ లను గుత్త తీసుకుని దాన్నే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ను ఏకిపారేస్తుంది.

అలాగే గ్రూప్ 1 ను రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఆ సంస్థను ప్రక్షాళన చేసి కొత్త వారితో 563 కొత్త పోస్టులను ప్రకటించే యోచనలో ఉంది.

ఇక బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు పరచాలని ప్రశ్నిస్తూనే ఉన్నారు.మహిళలకు అన్యాయం జరుగుతుంది అంటూ కవిత విమర్శలు చేస్తుంది. వీళ్లు ఇంకా ఏమి తెలుసుకోకుండానే కాంగ్రెస్ ను ఆడుకుంటున్నారు.

తప్ప వారు చేసిన తప్పులను మాత్రం ఒప్పుకోవడం లేదు. కవిత లిక్కరు కేసు లో ఎలాంటి దర్యాప్తు చేయడం లేదు. ఎంఐఎం సైలెంట్ గా ఉన్నా తర్వాత ఏం చేస్తుంది అనేది పెద్ద ప్రశ్న.

ఇకపోతే బీజేపీ విజయసంకల్పయాత్ర అని మొదలుపెట్టి లోక్ సభ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తూ అన్ని పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ లోక్ సభ  ఎన్నికల కోసం ఎత్తుగడలు అని అర్థమవుతూనే ఉంది.

ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపి రావడం ఖాయం అని తేల్చి చెప్పవచ్చు.ఇక తెలంగాణలో ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఇవి రాజకీయాలు ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి మారతారో, ఎప్పుడు ఎవరు తిట్టుకుంటారో, ఎప్పుడు ఎవరు కలిసిపోతారో, వారికే అర్థం కాని స్థితిలో ఉన్న రాజకీయ నాయకులు ఊసరవెల్లిలా రంగులు మార్చడం ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే.

అసలు విషయం తెలియాలంటే ఎన్నికల వరకు జరిగే ఆట చూడాల్సిందే.ఇటు తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో వేచి చూడాలి. అటు ఆంధ్రాలో మే లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొని ఉంది. అయితే మార్పు మంచిదే కదా, ఎక్కువ కాలం ఎవరైనా రాజకీయ పదవుల్లో ఉంటే వారికి అహంకారం పెరగడం సహజం.

అలాంటి అహంకారాన్ని అణిచివేయాలంటే కాస్త మార్పు అవసరం కాబట్టి ప్రజలు ఈసారి తమకు సరైన నాయకుడిని ఎన్నుకుంటారు అనడంలో సందేహం లేదు.

తమకు న్యాయం చేసే విజన్ ఉన్న నాయకుడిని ప్రజలు ఎన్నుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

కాకపోతే ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా తెలంగాణలో, ఆంధ్రాలో ప్రభుత్వాలు చేసిన పాలన ప్రజలకు నచ్చలేదని మాత్రం తెలంగాణ ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రాలో కూడా ప్రజల అసంతృప్తికి కారణమైన వైసీపీని మార్చి టీడీపీకి పట్టం కట్టబోతున్నారనేది జగమెరిగిన సత్యం.ఇవన్నీ ప్రజల అభిప్రాయాలూ తప్ప సంస్థకు, రచయితకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా నాడిని బయట పెట్టడం బాధ్యత కాబట్టి వారి మాటలను, అభిప్రాయాలను మీ ముందుంచాం,మేం చెప్పింది నిజం. అవునంటారా? కాదంటారా?

Show More
Back to top button