Telugu Featured NewsTelugu Politics

పనికిరాని అసెంబ్లీ సమావేశాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అయిదేళ్లుగా నుంచి సాగిన అసెంబ్లీ సమావేశాలు కేవలం మొక్కుబడిలాగా జరిగాయి. ఆరునెలలకు ఒకసారి అసెంబ్లీ నిర్వహించాలి కాబట్టి బడ్జెట్ పద్దులు, వివిధ బిల్లులు ఆమోదించుకునేందుక మాత్రమే అసెంబ్లీ నిర్వహించారు తప్ప ప్రజాసమస్యలు చర్చించి పరిష్కారచూపేందుకు అసెంబ్లీ సమావేశాలు జరపలేదు. ఈ 5 సంవత్సరాల్లో 54 రోజుల మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. కనీసం ఏడాదికి సగటు 30 రోజులైనా సమావేశం కానీ శాసన వ్యవస్థ పై అలుముకొన్న చీకట్లకు అద్దం పడుతుంది. రాష్ట్రాల చట్టసభలు ఏడాదికి కనీసం 45 నుంచి 50 రోజులు సమావేశం కావాలని జాతీయ రాజ్యాంగ సమీక్షా సంఘం ఎప్పుడో సూచించింది. 

కానీ దీని అమలకు వైసీపీ ప్రభుత్వం నోచుకోలేదు. సభా సమయం తగ్గించడమే కాదు, చర్చలు లేకుండానే చట్టా రూపొందిస్తున్నారు. కోట్లాది ప్రజలకు సంబంధించిన కీలక బిల్లులపై కూడా ఎటువంటి చర్చ లేకుండా మందబలంతో ఆమోదించుకొని అసెంబ్లీని ఉత్సవా విగ్రహంగా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. అన్ని వ్యవస్థలను బలహీనం పరచడంతోపాటు ప్రజాస్వామ్య వ్యవస్థైన అసెంబ్లీని నిర్వీర్యం చేస్తున్నారు.  అసెంబ్లీ సమావేశాలు జరిగే కొద్దీ అబద్దాలు, సస్పెన్షన్లు తప్ప ప్రజలకు సమస్యల పరిష్కారాలపై చర్చలకు మాత్రం నోచుకోవడం లేదు.

ప్రస్తుతం శాసనసభను కేవలం చట్టాలు చేసే సభగానే, బడ్జెట్ పద్దులను ఆమోదించుకోవడానికే వినియోగిస్తున్నారు. కానీ సగటు ప్రజల బాధలపై అసెంబ్లీలో చర్చజరగలేదు. ప్రజా సమస్యలు చర్చించి పరిష్కారం చూపడానికి, ప్రజల అవసరాలు తెలియ చెప్పడానికి ఒక అవకాశంగా ఉండాల్సిన శాసనసభను అమీ, తుమీ తేల్చుకునే బరిలామార్చారు. అంతేకాదు ప్రతిపక్షం లేవనెత్తిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రాథమిక హక్కును కాలరాచి తన నియంతృత్వ అధికారాన్ని చలాయించారు. వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు, రైతాంగం సమస్యలు, ఆకాశాన్ని అంటిన నిత్యావసరాల ధరలు, పన్నులు భారం, యువతను చుట్టుముట్టిన నిరుద్యోగం, ఎయిడెడ్ విద్యాసంస్థలు మూసివేత, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ సబ్ కాంపోనెంట్ నిధుల మళ్లింపు, విద్యుత్ చార్జీల పెంపు, అప్పులు, తీవ్ర ఆర్థిక సంక్షోభం వంటి అనేక అంశాలన్నింటిపై సమగ్ర చర్చ జరగాల్సి వుంది. 

కానీ ప్రభుత్వం సమస్యలు వదిలేసి స్వోత్కర్షకాలు వినిపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎంకి భజన చేస్తున్నారే తప్ప సమస్యలపై చర్చించేందుకు ముందుకు రాలేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీలో ప్రతీకారం, ద్వేషం వికృతరూపం దాల్చింది. ప్రతిపక్ష నాయకుడుని లక్ష్యంగా చేసి ప్రతి అంశంపై విమర్శలతో, వెక్కిరింతలతో హేళన చేస్తూ అవమానించారు. అలాంటి ఎమ్మెల్యేలను ప్రస్తుతం మనం శాసన సభల్లో కూర్చో పెట్టడం టీడీపీ శ్రేణుల నుంచి బలమైన వాదన వస్తుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో అయినా ప్రజలు సరైన నాయుకులను ఎన్నుకోవాలని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Show More
Back to top button