Telugu News

ఒకే ఒక్క సంతకం.. అమెరికా-ఇరాన్ యుద్ధానికి ఎండ్ కార్డ్

అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా టెన్షన్ పడుతున్న టైమ్‌లో.. ఒక మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ వచ్చింది. అవును, అమెరికా-ఇరాన్ మధ్య నడుస్తున్న యుద్ధం అధికారికంగా ముగిసిపోయింది. ఇరుదేశాల మధ్య గొడవలను ఆపేస్తూ ఒక హిస్టారికల్ శాంతి ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ ఒక అగ్రిమెంట్ (MoU) మీద సంతకాలు చేసేశారు. ఇంకేముంది.. ఈ డీల్ తక్షణమే అమల్లోకి వచ్చేసింది.

ఏంటి ఈ ‘ఇస్లామాబాద్’ ముచ్చట?

మొత్తం 14 పాయింట్లతో రెడీ అయిన ఈ అగ్రిమెంట్‌కు ‘ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్’ అని పేరు పెట్టారు. నిజానికి, రెండు రోజుల క్రితమే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ కూడా దీనిపై సైన్ చేశారు. ఇప్పుడు ఇద్దరు మెయిన్ బాస్‌లు కూడా సంతకాలు పెట్టేయడంతో కథ క్లియర్ అయిపోయింది.

ఫ్రాన్స్‌లో విందు.. అక్కడే ట్రంప్ సైన్!

ఈ సంతకాల వెనుక ఒక ఆసక్తికరమైన సీన్ జరిగింది. జీ7 మీటింగ్ అయిపోయాక ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అందరికీ ఒక గ్రాండ్ డిన్నర్ ఇచ్చారు. ఆ పార్టీలోనే మన ట్రంప్ ఈ పేపర్ల మీద సంతకం చేసేశారు. దీనికి సంబంధించిన వీడియోను వైట్‌హౌస్ రిలీజ్ చేసింది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ కూడా ఖుషీ అవుతూ.. “ట్రంప్ సంతకం పెట్టేశారు. ఇక హర్మూజ్ జలసంధి ఓపెన్ అయిపోతుంది.. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి” అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిజానికి ఈ మీటింగ్ స్విట్జర్లాండ్‌లో జరగాల్సి ఉంది. కానీ అంతకంటే ముందే ఫ్రాన్స్‌లోనే పనైపోయింది.

ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఏంటంటే..

ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఈ డీల్ గురించి మాట్లాడుతూ కొన్ని కండిషన్స్ పెట్టారు. “ఈ ఒప్పందం 60 రోజుల పాటు ఉంటుంది. ఈ లోపు అమెరికా మమ్మల్ని కదపకూడదు. మాపై కొత్తగా ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదు, మా ఏరియాలోకి అమెరికా మిలిటరీని పంపకూడదు” అని చెప్పారు. అంతేకాదు, “మా దగ్గరున్న యురేనియం మా దేశంలోనే ఉంటుంది. ఎవరికీ ఇచ్చే ప్రసక్తే లేదు. అలాగే హర్మూజ్ జలసంధి ఏరియా మాదే, మేమే చూసుకుంటాం” అని ఇరాన్ క్లియర్ కట్‌గా చెప్పేసింది.

మధ్యవర్తిగా పాకిస్తాన్.. సీన్ లోకి షెహబాజ్ షరీఫ్!

ఈ పంచాయితీని దగ్గరుండి సెటిల్ చేసింది మన పక్కింటి పాకిస్తాన్. అందుకే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీన్ని ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ అని గర్వంగా ప్రకటించుకున్నారు. ఈ డీల్ ప్రకారం.. ఇరాన్ వెంటనే హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తుంది. దానికి రిటర్న్ గిఫ్ట్‌గా అమెరికా కూడా ఇరాన్ షిప్పులపై పెట్టిన బ్యాన్‌ను ఎత్తేస్తుంది. మొత్తానికి ఈ దెబ్బతో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు తొలగిపోయి అంతా హ్యాపీ.

Show More
Back to top button