
మనకు ఎలా అయితే స్టాక్ మార్కెట్, ఇండెక్స్‌లు ఉన్నాయో.. USAలో కూడా స్టాక్ మార్కెట్, ఇండెక్స్‌లు ఉన్నాయి. ఇలా ఇతర దేశాల్లో పెట్టబడులు పెట్టడాన్ని ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అని అంటారు. ఇలా విదేశీ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చే లాభాలు బోలేడు. అందులో మొదటిది, డైవర్సిఫికేషన్. అంటే మన పెట్టుబడులన్నీ ఒకే దానిలో పెట్టకూడదు. వాటిని వివిధ వాటిలో పెట్టాలి. అప్పుడే మనకు ఒకదానిలో నష్టం వచ్చినా మరో దానిలో లాభం వస్తుంది. అంటే, మీ దగ్గర రూ.లక్ష ఉన్నాయనుకోండి.
అందులో కొంత శాతం డబ్బుని స్టాక్ మార్కెట్‌లో, కొంత శాతం డబ్బుని మ్యూచువల్ ఫండ్‌లో, కొంత శాతం డబ్బుని గరవ్నమెంట్ బాండ్స్‌లో, కొంత శాతం డబ్బుని బంగారంలో, కొంత శాతం డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టాలి. దీనివల్ల స్టాక్ మార్కెట్ దెబ్బ తింటే ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ తగ్గితే గరవ్నమెంట్ బాండ్స్ మంచి రాబడి ఇవ్వవచ్చు. కాబట్టి మీ పెట్టుబడులను డైవర్సిఫికేషన్ చేసి వివిధ వాటిలో పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం.
USA షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మరో లాభం ఏంటంటే.. డాలర్ కలిసి వస్తుంది. రూపాయికి, డాలర్‌కి ఉన్న సంబంధం మనందరికీ తెలుసు. పలు సార్లు రూపాయి బలహీనపడడం మనం వింటూనే ఉన్నాం. ప్రస్తుతం చూస్తే ఒక డాలర్ విలువ రూ. 86.51గా ఉంది. అదే 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఒక డాలర్ విలువ కేవలం రూ.43 ఉండేది. 2005లో USA స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అయిన నాస్డాక్(NASDAQ)విలువ 2100 డాలర్లు ఉండే.
అంటే రూ.90,300కి ఒక నాస్డాక్ పాయింట్ వస్తుంది. దాని విలువ ఇప్పుడు 19,511 డాలర్లు అయింది. దీనికి తోడు డాలర్ విలువ పెరగడంతో ఇండియన్ రూపితో పోల్చితే ఆ ఒక నాస్డాక్ పాయింట్ విలువ రూ.1,677,946 ఉంది. అంటే మీకు ప్రాఫిట్‌తో పాటు, డాలర్ అప్రిసియేషన్ ప్రాఫిట్ కూడా దొరికింది. ఇలా మీరు డబల్ ప్రాఫిట్ పొందాలంటే విదేశీ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. మరి ఏ కంపెనీని ఎంచుకోవాలి..? ఎలా ఇన్వెస్ట్ చేయాలి..? అని అనుకుంటున్నారా..? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఎందులో పెట్టుబడి పెట్టాలనుకున్న ముందుగా దాని గురించి సరైన రీసెర్చ్ చేయడం తప్పనిసరి. అలాగే USA షేర్ మార్కెట్‌లో ఉన్న కంపెనీ గురించి కూడా బాగా రీసెర్చ్ చేయండి. దాని టెక్నికల్ పరంగా, ఫైనాన్స్ పరిస్థితులు చూడడం వల్ల కంపెనీ బలబలహీనాలు తెలుస్తుంది. అలాగే కంపెనీ స్థాపకుడు, CEO ఎవరో కూడా తెలుసుకోండి. ఎందుకంటే వారి మీద ఆధారపడి కూడా స్టాక్ విలువ మారుతుంది. ఇలా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయడానికి డిమాట్ అకౌంట్ కావాలి.
మన స్టాక్ మీర్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించే డిమాట్ అకౌంట్ పనికి రాదు. దీనికోసం వేరే ఖాతా తెరవాలి. ఈ పని చేయడానికి పలు ప్రత్యేక బ్రోకర్లు ఉన్నాయి. వాటిలో మీరు రిజిస్టర్ అయ్యి మీ పెట్టుబడి ప్రయాణం ప్రారంభించవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కసారి ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిస్తే అక్కడి రాజకీయాలు, వార్తలు కూడా తెలుసుకోవాలి. అప్పుడే అప్‌డేట్‌గా ఉంటారు.