HEALTH & LIFESTYLE

మెడిటరేనియన్‌ డైట్‌‌తో లాభాలు.!

డైట్ అంటే కేవలం బరువు తగ్గడానికి మాత్రమే అని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన బరువుని మెయిన్‌టెయిన్ చేయడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి డైట్ చాలా అవసరం. అయితే, డైట్‌లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతం బాగా పాపులర్ అవుతున్న డైట్ మెడిటరేనియన్‌ డైట్‌. ఈ డైట్‌లో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు, విత్తనాలు తినాల్సి ఉంటుంది.

దీంతోపాటు డైట్ సమయంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలను ఎక్కువగా తీసుకుంటారు. చక్కెర చాలా తక్కువగా తీసుకుంటారు. ఎర్ర మాంసం, గుడ్లు, చికెన్, టర్కీ చికెన్‌, పాల ఉత్పత్తులు కూడా తక్కువగా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల తీవ్రమైన వ్యాధులు కూడా నివారణ అవుతాయని పలు పరిశోధనలలో తేలింది. అంతేకాదు, ఈ డైట్ చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చని డాక్టర్లు కూడా చెబుతున్నారు. 

మెడిటరేనియన్‌ డైట్‌ ప్రయోజనాలు..

* గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది

* మనస్సు యవ్వనంగా, ఉత్సహంగా మారుతుంది

* ఎముకలు దృఢంగా అవుతాయి

* బరువు వేగంగా తగ్గడంలో సహాయపడుతుంది

* జీవణ ప్రమాణం ఎక్కువ కాలం ఉంటుంది

Show More
Back to top button