Telugu News

కొత్త ఏడాదిలో వచ్చిన మార్పులివే

కొన్ని రోజుల క్రితమే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేశాం. ఈ క్రమంలో గతేడాదిలాగే ఈసారి కూడా ఆర్థిక విషయాల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. మరి ఆ మార్పులేంటో ఇప్పుడు చూసేద్దామా? 

* రైతులకు గుడ్ న్యూస్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు తనఖా లేకుండా ఇచ్చే రుణ పరిమితిని రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచింది. 

* కార్ల ధరలు

దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు అయిన మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్స్, మహేంద్రా అండ్ మహీంద్రా, ఎంజ్ మోటార్ ఇండియా, స్కోడా, కియా ఇండియా, ఆడి, మెర్సిడెస్ బెంజ్ వంటివి తమ కార్ల ధరలను జనవరి 1 నుంచి పెంచాయి. దీంతో కొత్తగా కార్లను కొనుగోలు చేసేవారు కొద్ది రోజుల వ్యవధిలోనే అదనంగా మరింత డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో భారతీయ వాహన పరిశ్రమ మంచి వృద్ధిని కనబరుస్తోంది.

* EPFOలో

పెన్షనర్లు ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేకుండా ఏదైనా బ్యాంకు నుంచి నేరుగా పెన్షను ఉపసంహరించుకోవడానికి EPFO అనుమతి ఇచ్చింది. PF ఖాతాలోని డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి ATM కార్డును అందుబాటులోకి తీసుకొస్తామని EPFO ప్రకటించింది.

* యూపీఐ 123పే

డిజిటల్ పేమెంట్స్ కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (R- BI) గతేడాది అక్టోబర్ 9వ తేదీన కీలక నిర్ణయాలను ప్రకటించింది. ‘యూపీని 123 పే'(UPI 123Pay)ను పరిచయం చేస్తూ.. లావాదేవీల పరిమితులను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచింది. ఈ నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

* RBI FD నియమాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హోమ్ ఫైనాన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లను నియంత్రించే నిబంధనలను సవరించింది. ఇందులో ప్రజల నుంచి డిపాజిట్లను తీసుకునే నియమాలు, డిపాజిట్ల బీమాకు సంబంధించిన వియమాలు ఉన్నాయి.

* రూపే కార్డు 

రూప్ క్రెడిట్ కార్డ్ హోల్డర్ల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో కొన్ని నియమాలను మార్చేసింది. ఈ నియమాల ఆధారంగా.. రూప్ క్రెడిట్ కార్డు హోల్డర్లు జనవరి 1 నుంచి ఎయిర్పోర్ట్ లాంజ్ సర్వీస్లను ఫ్రీగా పొందవచ్చు.

Show More
Back to top button