మన శరీరాన్నంతా కంట్రోల్ చేసేది మన మెదడే. దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మనందరికీ అవసరం. కానీ, మనకు తెలియకుండా మనం చేసే పనుల వల్ల కావచ్చు, మనం తినే ఆహారం వల్ల కావచ్చు మెదడులో రక్తం గడ్డకడుతుంది. దీనివల్ల మరణించే ప్రమాదం కూడా ఉంది. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, కర్ణిక దడ లాంటి అనారోగ్య సమస్యల వల్ల మెదడులో రక్తం గడ్డకట్టవచ్చు.
అలాగే మనం ఎంచుకున్న జీవనశైలి కూడా కారణం కావచ్చు. ధూమపానం, మద్యం, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి లాంటివి మెదడులో రక్తం గడ్డకట్టడానికి పలు కారణాలు. డీహైడ్రేషన్, మెదడుకు గాయం కావడం, ఇన్ఫెక్షన్ మరికొన్ని కారణాలు. వీటితో పాటు వయసు పెరగడం, రక్త నాళాలు బలహీనంగా మారడం కూడా కారణాలు కావచ్చు. గర్భనిరోధక మాత్రలు, హార్మోన్ పునఃస్థాపన చికిత్స లాంటి కొన్ని మందుల వల్ల కూడా రక్తం గడ్డకడుతుంది.
నిరోధన ఇలా..
* ఆరోగ్యకరమైన పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి.
*కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినకూడదు.
*క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
*ధూమపానం, మద్యపానం చేయకూడదు.
*రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
*ఒత్తిడిని తగ్గించుకోడానికి ప్రయత్నించండి.
*శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోండి.