TRAVEL ATTRACTIONS

ఉత్తరాఖండ్‌లో ఉల్లాసమైన ప్రదేశాలు చూసేయండి..!

కొత్త సంవత్సరం రానే వచ్చింది. కాలం కూడా మారనుంది. ఈ సమయంలో ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నారా..? అయితే ముస్సోరిని ఎంచుకోండి. కాలుష్యం లేని స్వచ్చమైన ప్రకృతిని ఆశ్వాదించడానికి ఇది మంచి ప్రదేశం. అన్ని కాలాల్లోనూ ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జిల్లాలో ఉంది. హరిద్వార్ నుంచి ముస్సోరి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సముద్ర మట్టానికి సుమారు 6,170 అడుగుల ఎత్తున ఉండడంతో ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. పర్వత ప్రాంతం కావడంతో అందమైన ప్రకృతితో పాటు మేఘాల మధ్య నడిచే అనుభూతి కూడా మీ సొంతం అవుతుంది. ఈ ప్రదేశానికి చేరకోడానికి తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా ఢిల్లీకి రైలులో చేరుకుని అక్కడి నుంచి డెహ్రాడూన్‌కి రైలులో వెళ్లి, అక్కడి నుంచి బస్సులో వెళ్లవచ్చు. లేదా విమానంలో నేరుగా డెహ్రాడూన్ వెళ్లి అక్కడి నుంచి వెళ్లవచ్చు. లేదా మీ వాహనంలో కూడా వెళ్లవచ్చు. 

ముస్సోరిలో చూడవలసిన ప్రదేశాలు..

* లాల్ టిబ్బా

* గన్ హిల్

* క్యామెల్ బ్యాక్ రోడ్

* కెంప్టీ ఫాల్స్

* హేపి వేలీ

టూర్ బడ్జెట్..

*మీరు ఎంచుకునే రవాణా ప్రకారం మీ ట్రావెలింగ్ ఖర్చు ఉంటుంది.

*ఆహారానికి రోజుకు ఒక్కరికీ రూ.300 నుంచి రూ.500 వరకు అవుతుంది. ఒకవేళ రెస్టారెంట్స్‌కి వెళ్తే ఇంకొంచెం ఎక్కువగా అవుతుంది. 

*వివిధ ఎంట్రీ టికెట్లకు రూ.2000 వరకు అవుతుంది.

*నివసించడానికి రూంకు ఒకరోజుకు రూ.1200 నుంచి రూ.3000 వరకు ఖర్చవుతుంది.

*చివరగా అనుకోని ఖర్చు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, మరికొంత డబ్బు తీసుకెళ్లండి.

Show More
Back to top button