Telugu NewsTelugu Politics

దేశంలో అసలు ఏం జరుగుతుంది?

దేశ ప్రజల్లో ఈ ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది.అసలు పాలకులు ఏం చేస్తున్నారు, దేశం లో జరగాల్సిన అభివృద్ధి ఏంటి, సామాన్య ప్రజలు, పేద, మధ్యతరగతి మనుషులకు అసలేం కావాలి అనేది ఏ ప్రభుత్వాలు ఆలోచించడం లేదు.

ఒకరిపై ఒకరు నిందలు, విమర్శలు వ్యక్తిగత ఆరోపణలు చేయడం, చేసుకోవడం తప్ప ప్రజల అవసరాల గురించి ఆలోచించలేకపొతున్నారు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు ఎదో చేస్తారని ఆశిస్తున్న ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది.

కేవలం 50 రోజుల పాలనలో హామీల అమలు చేయడం అసలు సాధ్యం అవుతుందా? ఏ ఏ శాఖల్లో ఏమున్నాయి,అసలు ఆర్ధికంగా ఆ శాఖలు ఎలా ఉన్నాయో ఒక అవగాహనకు రావడానికే సమయం పడుతుంది.అని చదువుకున్న వారికంటే గ్రామాలలో చదువు రాని పెద్దలు అభిప్రాయపడుతున్నారు.గిప్పుడే అచ్చిండు,గప్పుడే ఏం తెలుస్తది,అంత సూసుకోవాలి,గప్పుడు ఏమైనా సొంచయిస్తాడు,పిల్లగానికి ఏం తెలుస్తది, అన్ని సుడాలే,అనుభవం రావలె అంటున్ర్రు.గ్రామాల్లోని వారే ఇలా అంటే మరి చదువుకున్న వారు ఇంకెంత ఆలోచించాలి చెప్పండి. ఇక ప్రతి పక్షం వాళ్ళు అసలు నోరు మూసుకుని ఉండాలి వాళ్ళు చేసిన పనులకు, అంతే తప్ప నోరు జారితే ఎమౌతుందో అనేది ముందు ముందు వారికే తెలుస్తుంది. ఏమంటారు?.  

అలాంటప్పుడు గత ప్రభుత్వం ఇప్పుడే హామీలు అమలు చేయడం లేదు.మహిళలకు డబ్బులు ఇవ్వాలి, ఎగ్జామ్స్ పెట్టాలి, రైతు రుణమాఫీ చేయాలంటూ హోరెత్తి విమర్శలు చేయడం, కాంగ్రెస్ ను దుష్ప్రచారం చేయడం ఇవన్ని డిప్రెషన్ తో మాట్లాడుతున్నారా అనిపిస్తుంది.

ఎందుకంటే పదేళ్ళ పాలన చేసిన వారికీ ఓటమి అనేది తెలియదు, ఇప్పుడు ఒక్కసారే ఓడిపోవడం వల్ల ఇలా మాట్లాడుతున్నారు అనేది అర్ధం అవుతుంది. అయితే ఇవన్నీ ఆలోచించే ఓపిక సహనలు ప్రజలకు లేవు.వారికీ కావాల్సిన అభివృద్ధి కావాలి, వారికీ మిరాకిల్స్ కావాలి కాబట్టి దావోస్ వెళ్ళిన రేవంత్ అదే చేశాడు.

ప్రధానితో వైరం పెట్టుకున్న మోడీని కలిసి రావాల్సిన నిధుల గురించి మాట్లాడాడు, దావోస్ వెళ్ళి అక్కడ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని పెట్టుబడులు తెచ్చాడు.ఇక్కడ సంస్థలు పెట్టడం వల్ల యువతకు కనీస ఉద్యోగం కల్పించవచ్చు అనే ఉద్దేశ్యం తో ఒప్పందాలు చేసుకుని రావడం మంచిదే, కాని అవే విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చినట్లు అయ్యింది.అయినా భయపడకుండా రేవంత్ తన పని తానూ చేసుకుంటూ వెళ్తున్నాడు.

ఇది మంచి పనే కానీ హుందాగా వ్యవహరించడం లేదంటూ కొందరి మాటలు ఉన్నాయి, నిజమే ఊరికే అంటుంటే ఎవరికీ మాత్రం కోపం రాకుండా ఉంటుంది చెప్పండీ, అందువల్లే అప్పుడప్పుడు రేవంత్ కూడా మాటలు అనడం మాములే.

కానీ దీన్ని అవకాశంగా తీసుకుని బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ వేయడం ఇవన్నీ రాజకీయాల్లో కామన్ అనేది అందరికీ తెల్సు, తర్వాత అందరూ ఒక్కటే అనేది కూడా బహిరంగ రహస్యం కూడా.

కానీ ఇప్పుడు మనం మాట్లాడేది వీటి గురించి కాదు.సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అనేది ఆల్రెడీ ధరలన్నీ పెరిగి కొట్టుకుంటున్నారు, ఇప్పుడు ఉపాధి లేక తంటాలు పడుతున్నారు.కాంగ్రెస్ రాగానే బియ్యం ధరలు పెరిగాయి అని మరో వాదన, పంటలు వర్షానికి పాడైపోతే కాంగ్రెస్ ఏం చేస్తుంది,వీళ్ళు మాత్రం ధాన్యం కొనుగోలు చేశారా నీతులు చెప్పడానికి, ఎవరైనా ఏదైనా పని నేర్చుకోవాలి అన్నా చేయాలి అన్నా ముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఆ మాత్రం తెలివి లేని వారు ఇవన్నీ మాట్లాడడం దండగ అన్నమాటే కదా, ఊరికే నోరు పారేసుకోవడం తప్ప జరిగేది ఏంటి? ఏది ఎప్పుడూ ఎలా చేయాలో అనేది వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు అందుకే అలా ముందుకు వెళ్తూ ఒక్కో శాఖలో జరిగిన అవినీతిని అంతా బయటకు తెస్తున్నారు.

ఈ విషయాలు అన్ని పక్కన పెడితే సామాన్య ప్రజల్లో అనుమానాలు రేకేత్తిస్తూ అసలు రేషన్ కార్డులు ఇస్తారా,ఇందిరమ్మ ఇల్లు వస్తాయా అంటూ సందేహాలు నింపుతున్నారు. దాంతో ప్రజలు కూడా ఒక రకమైన నిసృహకు లోనవుతున్నారు అనేది మాటల్ని బట్టి చెప్పవచ్చు.

చిన్న కుగ్రామంలో ఉన్న తాత కూడా ఇప్పుడే వచ్చాడు గా చూద్దాం ఏం చేస్తాడో అని అనండంలోనే రేవంత్ రెడ్డి సామర్ధ్యం అర్ధం అవుతుంది.

అయితే బీజేపి వాళ్ళు మాత్రం ఒక సంవత్సరం సమయం ఇద్దమంటూ మాట్లాడడం మంచిదే, అయినా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇలా అయితే ఆయా శాఖల్లో పనులు,లోపాలు చూసూకోవలా,లేదా విమర్శలకు సమాధానం చెప్తూ కూర్చోవాలా అనేది పెద్ద ప్రశ్న.

పదవిలోకి వచ్చి కొన్నాళ్ళు కూడా కాకుండానే అన్ని శాఖల పై సమీక్షలు చేస్తూ,ప్రక్షాళన చేస్తూ బిజీ గా ఉన్న రేవంత్ ఇవన్నీ పట్టించుకోడు అనేది స్పష్టం అయ్యింది.

ఎందుకంటే ఇన్నాళ్ళకు అధికారం చేతిలోకి వచ్చాక, ఇన్నేళ్ళ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి,వారికీ మేలు చేయాలనే భావంతో,కుల,మత ప్రాంతీయ భేధాలు లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ,సామజిక న్యాయం చేయాలన్నదే సీఎం లక్ష్యం, నిరుద్యోగులకు ఉద్యగాలు కల్పించడం,ఇల్లు,రుణ సాయం అందించడమే సామజిక న్యాయానికి తొలిమెట్టు కులగణన అనేది మనకు తెలుసు. అలాగే అవినీతి పరులైన వారిని దండించడంలో ముందుంటారని మనకు దాడులు,సొదాల వల్ల తెలుస్తూనే ఉంది.

సామాన్య ప్రజలు మాత్రం దేశ్ కీ నేత ఏం చేస్తాడో చూద్దామని ఎదురు చూస్తున్నారు.   

మరోకటి ఏమిటంటే ఎటూ దిక్కు తోచని స్థితిలో ఉన్నది మాత్రం మధ్యతరగతి వారే అటూ పైకి వెళ్ళలేక,ఇటూ రాలేక ,మధ్యలో సతమతం అయ్యేది,మధ్య,పేద తరగతి మనుషులే,ఏ ప్రభుత్వం వస్తే ఏమిస్తుందో, మాకేం లాభాలు వస్తాయో అని ఆశగా ప్రతి ఐదేళ్ళ కు ఒకసారి ఓటేసి ప్రతి ఏడాది ఎదురుచూస్తూ ఉంటారు.

తమ పట్టణాలకు,తమ గ్రామాలకు ,మంచి సౌకర్యాలు రాకపోతాయా? అనే ఆశ వారిలో ఓటేయడానికి,నమ్మి గెలిపించడానికి కారణం అవుతున్నాయి.

ఇక ఇప్పుడు మన కొత్త సీఎం ఇంద్రవెల్లి నుండి పార్లమెంట్ లో గెలవడానికి శంఖం పూరిస్తున్నారు.

ఇక్కడ కొత్తగా గోండులకు భూములు ఇస్తామని,మంచి నీటి కష్టాలు తీరుస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడ నుండి పోటి చేస్తే గెలుస్తామనే ఒక నమ్మకం రాజకీయ నాయకులలో ఉంది. గతంలో రేవంత్ రెడ్డి ఇక్కడ నుండే తన రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టారని ఒక అభిప్రాయం ఉంది.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక కేసీఆర్ ఫాం హౌస్ లో ఉండాల్సిందే,నిత్యానందలా దాన్నోక దివీ చేసుకోవాలని, అతను మళ్ళి అధికారం లోకి వచ్చే అవకాశం లేదని అన్నారు.

కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం మళ్ళి గెలుస్తామనే నమ్మకంతో అనేక సభలు పెడుతూ అందరి అభిప్రాయాలూ,సూచనలు సేకరిస్తున్నారు.ఇప్పుడు వారికీ జ్ఞానోదయం అయింది కాబోలు.

ఇక కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చూసుకుంటే ట్యాక్స్ ధరలు అలాగే ఉంచేసి సామాన్యులకు మాత్రం భారత రైస్ పేరిట రూపాయలు 29కే కిలో బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఈరోజు నుంచే అది అమల్లోకి వస్తుందని అన్నారు.

అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ వాళ్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటున్నారు.

ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ధరలు మాత్రం మండిపోతున్నాయి, మరోవైపు సాఫ్ట్వేర్ పడిపోతూ,ఉద్యోగస్తుల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే అది వివక్ష అని మగవారు ఓవైపు నిరసన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు సగం టికెట్ అయినా ఇవ్వాలని ప్రతిపక్షం వాళ్లు కోరుతున్నారు. అలాగే మగవాళ్లకు వివక్ష లేకుండా వారికి కూడా ఉచిత ప్రయాణం అమలు చేయాలని కొంతమంది వాదిస్తున్నారు.

ఇవన్నీ పక్కనుంచితే ఇప్పటి ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే మంచి పథకాలు అమలు చేసింది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇకముందు కూడా ఇలాగే ప్రభుత్వం మరిన్ని మంచి పనులు చేస్తారని నమ్ముతున్నారు అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నిరుద్యోగులు ఉద్యోగాలు లేక గత పదేళ్ళ నుండి అవస్థలు పడుతున్నారు. చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కనీసం ఈ ప్రభుత్వమైనా నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు వేయడం లాంటివి చేస్తే యువతలో ఆశలు నింపిన వారు అవుతారు. అలాగే కొన్ని జీవితాలను నిలబెట్టిన వారు కూడా అవుతారు. అన్ని శాఖల్లోనూ చాలా సిబ్బంది కొరత ఉంది. కాబట్టి ఏ ఏ శాఖల్లో ఎంత సిబ్బంది అవసర పడతారు అనేది సమీక్షలు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే, అలాగే పెట్టుబడులు పెట్టిన కంపెనీ లోనూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా పదేళ్లు కూడా అధికారంలో ఉండే అవకాశం ఉంది అని సామాన్యుల అభిప్రాయం.

దేశంలో అవినీతి రహితంగా, విద్యా ఉద్యోగం ఆరోగ్యం, సొంతింటి కలలాంటివి ముఖ్యమైనవి. వీటన్నిటిని ఎవరైతే తీరుస్తారో, అర్హులైన పేదలకు వారి కలలను నిజంచేస్తారో ఆ దేశం బాగుంటుంది,అనేది వాస్తవం అని కూడా మనం చెప్పొచ్చు.

కూడు ,గూడు, గుడ్డ ,పని, ఆరోగ్యం ఈ ఐదింటిని అందించిన వారే పాలకులుగా ప్రజలు భావిస్తారు. అయితే ఇప్పటి నాయకులు వీటి గురించి ఆలోచించకుండా ఒకరిపై ఒకరు నిందలు, విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు, చేసుకోవడం చేస్తున్నారు తప్ప, తమకోసం ఓటు వేసిన ప్రజలకు కావాల్సిన సదుపాయాలను అందించడానికి ముందుకు రావడం లేదు అనేది నిజం.

కానీ పదేళ్ల విముక్తి తర్వాత, ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్ల తమ ఆశలు తీరుతాయనే ఆశతో ప్రజలు ఆసక్తిగా తమ నాయకుడు ఏం చేస్తాడా?తమకు ఎలాంటి లాభాలు అందిస్తాడా? అని ఎదురుచూస్తున్నారు. ప్రజలు ఆలోచనలకు తగినట్లుగా నాయకుడు కూడా ఆలోచించి, వారికి మంచి చేయడం కోసం ఎన్ని పాట్లు అయినా పడవచ్చు.

ఎందుకంటే ప్రజలు తనని నమ్మి తనకు ఓట్లు వేయడం ఒక కొత్త అనుభవాన్ని లేదా కొత్త తరాన్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ప్రజలు వారికి ఓట్లు వేసి గెలిపించారు. ముఖ్యంగా పదేళ్ల పాలనలో కనీస అవసరాలు కూడా తీర్చకుండా పేద మధ్యతరగతి మనుషులను ప్రజలను మభ్యపెట్టి, ఎంతో సంపదను దోచుకున్న వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో నోట్లోకి వెళ్ళేది 5 వేళ్ళు కాబట్టి ఆ వేళ్ళు ఉన్న చేతి గుర్తుకు ఓటేసి గెలిపించారు. మరి ఆ చెయ్యినీ అలాగే నిలబెడతారో, లేదా ప్రతిపక్షం అన్నట్లుగా రెండేళ్లలో చేతులు దించి సంకెళ్లు వేసుకుంటారో, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తారో, వేచి చూడాలి.అయితే.. ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు, ఎంతో శ్రమ, తర్వాత ఒక యంగ్ తరంగ్ మన నాయకుడు అయ్యారు.

ఇప్పుడు ఆ నాయకుడు ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారని, తీసుకోవాలని, ప్రజల్లో మంచి పేరును సంపాదించుకోవాలని, దేశ పేరును, ప్రతిష్టను నిలబెట్టాలని ప్రపంచం నలుమూలల తెలంగాణ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని, చెప్పుకునేలా యంగ్ డైనమిక్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చేస్తారని ఆశిస్తున్నాం.ఇది ప్రజల అభిప్రాయం. కొంత అసహనత ఉన్నా,ముందు ముందు ఇంకా సమయం ఉంది కాబట్టి, మంచే చేస్తారని నమ్మకంతో ముందడుగు వేద్దాం. మనం ఎంచుకున్న నాయకుడిని నమ్ముదాం..

Show More
Back to top button