HEALTH & LIFESTYLE

ముడుతలా?అయితే ఇవి పాటించవల్సిందే

వయసు మీద పడుతున్న కొద్దీ ముఖంపై ముడతలు రావడం చాలా సహజం. అయితే ఈ ముడతలు కొంతమందికి చాలా తొందరగా వస్తుంటాయి. అవి పోయి.. యవ్వనంగా కనిపించాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. ఏజ్ మీద పడుతున్న కొద్దీ ముఖంపై ముడతలు కనిపించడం సర్వ సాధారణం. ఇవి ముప్పై ఏండ్లు పైబడిన వారికి అప్పుడప్పుడే మొదలవుతుంటాయి.

కానీ కొందరికి ఈ ముడుతలు చాలా తొందరగా అంటే 27,28 వయస్సులోనే కనిపిస్తూ ఉంటాయి.డానికి కారణం లేకపోలేదు.జంక్ పుడ్,మసాలాలు,వేపుళ్ళు,తింటూ తమ అందం పై పెద్దగా శ్రద్ద పెట్టలేని వారికి ఇవి రావడం సహజం. అయితే ఇవి ఎవరైనా చెప్తే కానీ తెలియదు, అప్పుడు వాళ్ళు బ్యూటి పార్లర్ కి వెళ్ళి రకరకాల ప్రయోగాలు చేస్తారు.అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మనం ఇప్పుడు తెల్సుకుందాం..

ఈ  ముడతలు కనిపించిన వెంటనే చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ముడతలు తగ్గించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయినా ఈ ముడతలు అంత సాధారణంగా వదిలిపోవు.అయితే రెగ్యులర్ గా కొన్ని చిట్కాలను పాటిస్తే ఈజీగా వదిలిపోతాయి.దాంతో మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు. ఇందుకోసం ఏం చేయాలంటే.. సన్ స్క్రీన్ లోషన్: ముఖం పై ముడతలు వస్తున్నట్టు అనిపిస్తే.. నిత్యం సన్ స్క్రీన్ లోషన్ ను ఖచ్చితంగా వాడాలి.

ఈ ముఖంపై ముడతలు 90 శాతం యువీ కిరణాల ప్రభావం వల్లే వస్తుంటాయి. ఈ యువీకిరణాల వల్ల స్కిన్ సాగే గుణాన్ని కోల్పోతుంది. దీనివల్ల స్కిన్ కాంతం తగ్గుతుంది. అలాగే ముడతలు కూడా వస్తుంటాయినీళ్లు తాగుతూ ఉండాలి:   నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నీళ్లతోనే ఎన్నో రోగాలు మటుమాయం అవుతుంటాయి. అందుకే రోజుకు 8 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. ఒకవేళ మీరు నీళ్లను తాగకపోతే.. మీరు డీహైడ్రేషన్ బారిన పడి.. మీ స్కిన్ కాంతిని కోల్పోతుంది. డల్ గా కూడా మారుతుంది. దాంతో ముఖంపై ముడతలు కూడా వస్తుంటాయి. అదే నీళ్లు తాగితే ఈ సమస్యలేవీ రావు. మీ ఆరోగ్యం, మీ చర్మ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.

 నిద్ర తప్పనిసరి: మనిషికి నిద్ర ఎంతో అవసరం. నిద్రతో ఎన్నో రోగాలు రావు. మీకు తెలుసా.. నిద్రపోతున్నప్పుడే చర్మకణాలు పునరుత్తేజం అవుతాయి. అంతేకాదు కొత్త కణాలు కూడా తయారవుతాయి. కాబట్టి రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.

ఆకుకూరలు:  తాజా ఆకు కూరలు, తాజా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లు, ఆకు కూరగాయలల్లో ఫైటోన్యూట్రియెంట్లు  పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ వల్ల ఎలాంటి హానీ కలగకుండా చేస్తాయి.

ఎత్తుకు తగ్గ బరువు:  ఎత్తుకు తగ్గ బరువుంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. ఇది చాలా ముఖ్యం కూడా . నిత్య యవ్వనంగా కనిపించాలంటే మాత్రం మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండాల్సిందే. అప్పుడే మీరు అన్నివిధాల బాగుంటారు.

వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు నిత్యం  High Intensity Interval Training ఎక్సర్ సైజెస్ చేయాలి. వీటివల్ల వయసు మీద పడుతున్నా యువ్వనంగానే ఉంటారని పలు పరిశోధనలో తేలింది.

ఆల్కహాల్: ఆల్కహాల్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కానీ నేడు చాలా మంది దీనికి బానిసలుగా మారారు. దీనివల్ల వారి ఆరోగ్యంతో పాటుగా చాలా తొందరగా ముసలివాళ్లుగా కనిపిస్తారు. దీనికి కారణం వీటిని ఎక్కువగా సేవిస్తే డీహైడ్రేట్ బారిన పడతారు. అంతేకాదు వీటివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా లభించవు.

కెఫిన్: టీ, కాఫీలో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ కెఫిన్ తక్కువ మొత్తంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి ఏ ప్రమాదం ఉండదు కానీ.. ఎక్కువగా తీసుకుంటేనే చిక్కొస్తుంది. వీటిని ఎక్కువగా తాగితే బాడీ డీహైడ్రేషన్ బారిన పడటంతో పాటుగా.. నిద్రను కూడా దూరం చేస్తుంది. వీటిని ఎక్కువగా తాగితే శరీరానికి పోషకాలు కూడా అందవు.

చర్మం యవ్వనంగా కనిపించడం మంచి ఆరోగ్యానికి సంకేతం. అయితే చర్మ సంరక్షణ కోసం కొన్ని పద్దతులు పాటించాలి. మాయిశ్చరైజింగ్, టోనింగ్ (CMT) క్రమం తప్పకుండా చేయాలి. ఆరోగ్యకరమైన చర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటించాల్సిన కొన్ని విషయాల గురంచి ఇప్పుడు తెలుసుకుందాం.

1. చర్మ రకం ఆధారంగా ఉత్పత్తులను వాడితే మంచిది. ఎండలో వెళ్లేటప్పుడు మంచి సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. మేకప్ వేసుకుని పడుకోవద్దు. పూర్తిగా తీసివేసి ఫేస్ వాష్‌ చేసుకొని నైట్ క్రీమ్ అప్లై చేసి నిద్రించాలి. చర్మానికి హాని కలిగించే రసాయనాలకు దూరంగా ఉంటే మంచిది.

2. ముఖం, శరీరం కోసం వివిధ మాయిశ్చరైజర్‌లు, ఎక్స్‌ఫోలియేటింగ్ క్రీమ్‌లను తప్పక ఉపయోగించాలి. చర్మం రకం ప్రకారం ఎల్లప్పుడూ మంచి ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడగాలి. మొటిమల సమస్య ఉంటే ప్రత్యేక టవల్ ఉపయోగించాలి. అలాగే కచ్చితమైన డైట్ కూడా ఫాలో కావాలి.

3.ప్రతిరోజు సమృద్ధిగా నీరు తాగాలి. కనీసం రోజూ 3-4 లీటర్ల నీరు తాగాలి. నీరు చెమట ద్వారా చాలా విషాన్ని బయటకు పంపుతుంది. ఫైబర్ అధికంగా ఉండే పండ్లను ఎక్కువగా తినాలి.

4. వేయించిన, జిడ్డుగల వస్తువులను నివారించాలి. ఎక్కువ కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు చర్మ ఆరోగ్యానికి హానికరం.

5. చక్కెర, స్వీట్లు మానుకోండి. ఎందుకంటే చక్కెర కొల్లాజెన్‌ను తగ్గిస్తుంది. అకాల వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. గ్లూకోజ్ గ్లైకేషన్ అనే ప్రక్రియను ప్రేరేపిస్తుంది. ఇది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది.

6. పొద్దుతిరుగుడు, గుమ్మడి, అవిసె గింజల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా, రిఫ్రెష్‌గా ఉంచుతుంది.

7. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తినాలి. నారింజ, ద్రాక్ష, బెర్రీలు, సీజనల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

8. నట్స్, డ్రై ఫ్రూట్స్ తినాలి. వేరుశెనగ, వాల్‌నట్స్, హాజెల్ నట్స్, బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, అత్తి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

9. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. మీరు శాఖాహారులు అయితే పప్పులు, చిక్కుళ్ళు, పనీర్, టోఫు ఎక్కువగా తినాలి. మీరు మాంసాహారి అయితే గుడ్లు, చేపలు తినాలి. ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల చర్మం బిగుతుగా ఉంటుంది.వయస్సు పెరిగే కొద్ది 10.ముఖం మీద ముడతలు రావటం అనేది సహజమే.ఈ ముడతలు అనేవి ముఖం,నుదురు,నోటికి ఇరువైపుల వస్తూ ఉంటాయి.

మొదట సన్నని ముడతలుగా ప్రారంభం అయ్యి క్రమేణా పెద్దగా పెరిగిపోతాయి.అయితే ముడతలను ఇంటిలో మనకు అందుబాటులో ఉండే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.

*వాటి గురించి వివరంగా తెలుసుకుందాం*

గుడ్డు గుడ్డులోని తెల్లసొనను ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

గ్లిజరిన్ ఒక స్పూన్ రోజ్ వాటర్ లో ఒక స్పూన్ గ్లిజరిన్, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాయాలి.

అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.కొబ్బరి నూనె కొంచెం కొబ్బరి నూనెను ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.

ఈ విధంగా చేయటం వలన ముఖంలో రక్తప్రసరణ పెరిగి ముడతలు తొలగి తాజాగా, కాంతివంతంగా మారుతుంది.అరటి పండు బాగా పండిన ఒక అరటి పండును  గుజ్జులా చేసి దానిలో ఒక స్పూన్ తేనే, ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి.బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెరుగు రెండు స్పూన్ల పెరుగులో అర స్పూన్ తేనే, నిమ్మరసం, విటమిన్ E ఆయిల్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

అలాగే బియ్యం పిండి లో కాస్త పచ్చి పాలు కలిపి రాసుకుంటూ ఉంటుంటే ముడతలు తగ్గుతాయి.

కాస్త పసుపు లో తేనే వేసుకుని దాన్ని మొహానికి ఫ్యాక్ లా వేసుకుని అరగంట తర్వాత చన్నీళ్ళతో కడిగేసి, మెత్తని గుడ్డతో తుడుచుకుంటూ ఉండడం వల్ల ముడతలు క్రమేణా తగ్గుతాయి.

బయట దొరికే  ఫేస్ మాస్క్ ల వల్ల అప్పటికి ఫలితం కనిపించినా రెండు రోజుల తర్వాత మళ్ళి మాములుగా కనిపిస్తాయి. కాబట్టి ఇంట్లో ఉండే పదార్ధాల ద్వారా తక్కువ సమయంలో ముడుతలు తగ్గించుకోవచ్చు,

 ఇంకా ఇలా కూడా చేయవచ్చు..

ఒక టామటా మధ్యకు కోసి దాన్ని మొహానికి, ముడుతలు ఉన్న చోట రాయండి,కాసేపటికి అది గట్టిగా అవుతుంది. తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది, దీని వల్ల ఇంకొక లాభం ఏమిటంటే నల్లుపు దనం తగ్గిపోయి,తెల్లగా కూడా అవుతారు.

ఇవన్నీ చేస్తూనే మీరు మీ అందమైన చర్మం కోసం ఒక పొడిని తయారు చేసి పెట్టుకుంటే చాలు,అది మీకు ఎప్పుడూ కావాలంటే అప్పుడు వాడుతూ ఉండొచ్చు, దీనికి కావాల్సిన పదార్ధాలు. నారింజ తొక్కలు,దానిమ్మ తొక్కలు, నిమ్మ తొక్కలు,అలాగే కాస్త మినపప్పు,కొన్ని బియ్యం.

ముందుగా తొక్కలను నీడలో పెట్టి బాగా ఎండనివ్వాలి, తర్వాత ఈ తొక్కలతో పాటూ బియ్యాన్ని,మినపప్పుని వేసి కాస్త బరకగా మిక్సి పట్టుకోవాలి.దీనిని కాస్త చల్లార్చిన తర్వాత ఒక గాజు సీసా లేదా డబ్బాలో పోసి పెట్టుకుంటే మొహనికే కాకుండా శరీరానికి కూడా రాసుకుని స్నానం చేయడం వల్ల మీ చర్మం లో ఉన్న మచ్చలు అన్ని పోయి,అందంగా తయారు అవుతారు.

ఇదే కాకుండా రాత్రి పడుకునే ముందు ఆముదం నూనే ని మొహానికి అప్లయ్ చేసి,పొద్దున్నే చన్నీళ్ళతో కడగడం వల్ల కూడా ముడుతలను ప్రార ద్రోలవచ్చు.

మరొక చిట్కా బాగా కాచిన పాలలో వచ్చిన మీగడను తీసుకుని దానికి కాస్త పసుపు కలిపి ఫేస్ ఫ్యాక్ లా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకుంటే చాలు.

మరొక చిట్కా;బాగా పండిన అరటి పండుని తీసుకుని గుజ్జుగా చేసుకుని ఫ్యాక్ వేసుకుని ఆరిన తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోవచ్చు.

మరొక చిట్కా: అరటి కాయని తీసుకుని దానిని ముక్కలుగా చేసి, ఎండ బెట్టాలి,తర్వాత దాన్ని మిక్సీలో వేసుకుని,పొడి లాగా చేసుకోవాలి.తర్వాత ఆ పొడిని కొద్దిగా తీసుకుని దానికి నిమ్మరసం,తేనే కలిపి మొహానికి పెట్టుకోండి.అద్దగంట తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకుంటే మీ అందం రెట్టింపు అవుతుంది. చివరగా…ఇవన్నీ ఒక్క రోజులో కావు,కొన్ని బ్యూటి పార్లర్ లు ముడుతల్ని పోగోడతామని చెప్పి కెమికల్స్ ఉన్న క్రీమ్స్ ఇస్తారు.దాని వల్ల కొందరికి పడక దద్దుర్లు వచ్చే అవకాశం ఎక్కువ, పైగా డబ్బులు దండగ. కాబట్టి ఇంట్లో ఉన్న పదార్ధాలతో చిన్న,చిన్న చిట్కాలతో పాటు ఆహార నియమాలు పాటిస్తూ, నీళ్ళు తాగుతూ ఉంటె ముడతల్ని తగ్గించి, మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

Show More
Back to top button