Telugu Special Stories

నేడు ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం

అసలు మీకు ఇలాంటి రోజు ఒకటి ఉందని తెలుసా,అవును దాదాపు ఎవరికీ ఈ రోజు గురించి తెలియక పోవచ్చు,కానీ చాలా మంది టూర్స్ పేరిట రకరాల ప్రదేశాలకు వెళ్తుంటారు. కానీ ఆ ప్రదేశం ఎలా ఏర్పడింది?దానిని ఏమంటారు?ఇలాంటివి ఇక్కడే ఎందుకు ఉన్నాయి?ఈ పర్యాటక నేల గురించి తెలుసుకోవాలని ఎవరూ అనుకోరు.కానీ ఈ నేలలో పర్యటిస్తున్నప్పుడు వీటి గురించి తెల్సుకోవడం ముఖ్యం. అలాగే వీటి గురించి ముందు తరాలకు చెప్పడం కూడా మనందరి బాధ్యత. కాబట్టి ఈ నేలల గురించి,అసలు చిత్తడి నేలలు అంటే ఏమిటి?వాటిని ఎలా గుర్తించాలి , అవి ఎక్కడెక్కడ ఉన్నాయి. అసలు ఈ దినోత్సవాన్ని కనిపెట్టింది ఎవరు?ఎందుకు కనిపెట్టారు? వీటి వలన ఉపయోగాలు ఏమిటి? ఇవి భవిష్యత్ తరాలకు ఎలా ఉపయోగ పడతాయి. మనం వీటి కోసం చేయాల్సిన బాధ్యతలు ఏమిటి? వీటిని కాపాడుకోవడం ఎలా అనేది మనం తెల్సుకుందాం..

*విషయం*

నేడు ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం. భూగోళంపై జీవరాశి మనుగడకు చిత్తడి నేలలు అత్యంత కీలకము భూమికి ఉపరిత ఊపిరితిత్తులుగా పనిచేస్తూ ప్రకృతి సమతుల్యతకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. దురదృష్టవశాత్తు చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని శతాబ్దాలుగా గుర్తించకపోవడం వల్ల అవి శరవేగంగా అంతరించిపోతున్నాయి.మార్గదర్శకాలని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు పొందిన చిత్తడి నేలల సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉంచాలి.

పర్యావరణ అటవీ వన్యప్రాణి కోస్తా నియంత్రణ చట్టాలను వర్తింప చేయడంతో పాటు వ్యర్థ రసాయన విషపూరిత జలాలను చిత్తడి నేలల్లో పారబోయకుండా నిఘాను తీవ్రతరం చేయాలి.

కఠిన శిక్షలు భారీ జరిమాణాలు విధించడం ద్వారా ఈ నేలల ఆక్రమణలను విద్వంశాన్ని అడ్డుకోవాలి చిత్తడి నేలల పరిరక్షణ కోసం నీరుడు కేంద్రం ప్రకటించిన అమృత్ ధారోవార్ పథకాన్ని రాం సార్ గుర్తింపు ఉన్న ప్రదేశాలకే పరిమితం చేశారు. దాన్ని మిగతా చిత్తడి నేలలకు వర్తింప చేయాలి.

పర్యాటక అటవీ పర్యావరణ శాఖలు సంయుక్తంగా చిత్తడి నేల పరిరక్షణకు జిల్లా స్థాయి ప్రణాళికను రూపొందించి స్థానిక సమూహాలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమర్ధంగా అమలుపరచాలి. ఇటువంటి చర్యలు కోరవడితే చిత్తడి నేలల విధ్వంసం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంది.

చిత్తడి నేలల విధ్వంసం మూలంగా పర్యావరణ మార్పులు దుష్పరిమాణాలు అధికమవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి పరిరక్షణకు పటిష్ట కార్యాచరణ రూపొందించి అమలు పరచాలని కోపన్ హగెన్ వంటి ప్రపంచ స్థాయి సమావేశాలలో తీర్మానాలు చేశాయి.

అందుకు గట్టి సంకల్పం లేకపోవడం దురదృష్టకరం. జనాభా పెరుగుదలకు తోడు పారిశ్రామిక అవసరాల కోసం చిత్తడి నేలలను మట్టితో కప్పి ఆక్రమించేస్తున్నారు. పంటల సాగు కోసం రసాయన ఎరువులు పురుగు మందులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఆ ప్రభావం వల్ల చిత్తడి నేలలు సహజ స్వభావాన్ని కోల్పోతున్నాయి.

సముద్రం,నది, ఇతర నీటి వనరుల తీర ప్రాంతాలలో లోతు తక్కువ వుండి ఎక్కువ కాలం నీటి నిల్వ వుండే భూములను చిత్తడి నేలలు అంటారు. మంచి నీటి సరస్సులు, ఉప్పునీటి సరస్సులు, మడ అడవులున్న తీర ప్రాంతాలన్నీ చిత్తడి నేలలే.

ఎగువ ప్రాంతంలోని భూములు అలల తాకిడికి దెబ్బ తినకుండా ఈ చిత్తడి నేలలు అడ్డు కట్ట వేస్తాయి. అరుదైన మొక్కలకు, పక్షులకు, జంతువులకు, చేపలు గుడ్లు పెట్టడానికి ఈ చిత్తడి నేలలు చాల అనుకూలం.

సమీప నీటి నాణ్యతను పెంచడంలోను, కాలుష్య కారకాలను గ్రహించడంలోను ఈ చిత్తడి నేలలు ప్రాధాన్యతను పొషిస్తాయి. మానవుల తప్పిదాలతో పర్యావరణానికి చాల హాని జరుగుతున్నది. ఆ పరంపరలో ఈ చిత్తడి నేలలకు గూడా పెద్ద హాని జరుగు తున్నది.

ప్రజలు వ్యవసాయ అవసరాలకు ఈ భూములను ఆక్రమించు కొని రసాయన ఎరువులకు వాడడం వల్లనూ,నివాస యోగ్యానికి ఈ నేలలను పూడ్చడంతోను, చిత్తడి నేలలు విధ్వంసానికి గురవుతున్నాయి. ప్రభుత్వం పరిశ్రమల కొరకు ఈ చిత్తడి నేలలను కేటాయిచడంలో అవి మరింత విధ్వంసానికి గురవుతున్నాయి.

ఈ చిత్తడి నేలల పరిరక్షణకు 1971, ఫిబ్రవరి రెండవ తారీఖున ఇరాన్ లోని రామ్ సార్ లో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. అప్పుడు తీసుకున్న ఉమ్మడి ఒప్పందం పై 164 దేశాలు సంతకం చేశాయి. దానినే రామ్ సార్ ఒప్పందం అంటారు. చిత్తడి నేలల పరిరక్షణకు ఈ ఒప్పందంలో కొన్ని ప్రమాణాలను నిర్దేశించారు.భారతదేశం కూడా ఈ ఒప్పందం పై సంతకం చేసింది.

చిత్తడి నేలల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు 1971లో అంతర్జాతీయ ఒప్పందంగా ఆమోదించబడిన చిత్తడి నేలలపై కన్వెన్షన్ యొక్క వార్షికోత్సవాన్ని కూడా సూచిస్తుంది.

30 ఆగస్టు 2021న UN జనరల్ అసెంబ్లీ తీర్మానం 75/317ను ఆమోదించింది, దాని ప్రకారం ఫిబ్రవరి 2ని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా ఏర్పాటు చేసింది.

ప్రపంచంలోని దాదాపు 90% చిత్తడి నేలలు 1700ల నుండి క్షీణించబడ్డాయి మరియు అడవుల కంటే మూడు రెట్లు వేగంగా చిత్తడి నేలలను కోల్పోతున్నాము. అయినప్పటికీ, చిత్తడి నేలలు జీవవైవిధ్యం, వాతావరణ ఉపశమనం మరియు అనుసరణ, మంచినీటి లభ్యత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మరియు మరిన్నింటికి దోహదపడే కీలకమైన ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థలు.

చిత్తడి నేలల వేగవంతమైన నష్టాన్ని తిప్పికొట్టడానికి మరియు వాటిని పరిరక్షించడానికి మరియు పునరుద్ధరించడానికి చర్యలను ప్రోత్సహించడానికి మేము వాటి గురించి జాతీయ మరియు ప్రపంచవ్యాప్త అవగాహనను పెంచడం అత్యవసరం.

ఈ క్లిష్టమైన ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థలపై ప్రజల అవగాహనను పెంచడానికి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అనువైన సమయం.

ఈ ఉత్పాదక పర్యావరణ వ్యవస్థల నుండి జీవనోపాధి,స్థితిస్థాపకతను పొందే వ్యక్తులతో – చిత్తడి నేలలు మరియు మానవ జీవితం ఎలా పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయో ఈ సంవత్సరం ప్రచారం స్పాట్‌లైట్ చేస్తుంది.

ముఖ్యంగా, 2024 యొక్క థీమ్ మానవ శ్రేయస్సు యొక్క అన్ని అంశాలు ప్రపంచంలోని చిత్తడి నేలల ఆరోగ్యంతో ఎలా ముడిపడి ఉన్నాయో నొక్కి చెబుతుంది. ఇది మన చిత్తడి నేలలకు విలువనివ్వాలని మరియు పరిరక్షించాలని మనలో ప్రతి ఒక్కరికి పిలుపునిస్తుంది.ప్రతి చిత్తడి నేల ముఖ్యం.

వరల్డ్ వెట్ ల్యాండ్స్ డే అవగాహన ప్రచారాన్ని చిత్తడి నేలలపై కన్వెన్షన్ సెక్రటేరియట్ నిర్వహిస్తుంది. చిత్తడి నేలలపై కన్వెన్షన్ యొక్క కాంట్రాక్టింగ్ పార్టీలు 1997లో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని మొదటిసారిగా స్థాపించినప్పటి నుండి జరుపుకుంటున్నాయి.

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అందరికీ తెరిచి ఉంటుంది – అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు, చిత్తడి నేల అభ్యాసకులు, పిల్లలు, యువత, మీడియా, కమ్యూనిటీ గ్రూపులు, నిర్ణయాధికారులు, వ్యక్తులందరికీ – ఈ పర్యావరణ వ్యవస్థలు మనందరికీ ముఖ్యమైనవి.

సముద్ర నదీతీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా నీటి వనరులతో నిండి ఉండే ప్రదేశాలను చిత్తడి నేలగా పరిగణిస్తారు. మంచినీటితో పాటు ఉప్పు నీటి సరస్సులు పంపరా బీల భూములు పడగడప దిబ్బలు అడవులు తదితర 19 రకాల ప్రాంతాలు చిత్తడి నేలల కిందకు వస్తాయి. నదీ తీరాలోని చిత్తడి నేలలు ప్రవాహ ఉధృతిని అడ్డుకొని తుఫానులు వరదల ప్రభావాన్ని తగ్గిస్తాయి. పర్యావరణ మార్పుల కారణంగా వాటిల్లే దుష్ప్రభావాలను ఘనవియంగా నియంతిస్తాయి.

అరుదైన మత్స్య వృక్షజాతుల జీవనానికి దోహదపడటంతో పాటు దేశ విదేశీ వలస పక్షులకు ఆశ్రమిస్తాయి ఈ నేలలు పరిసర ప్రాంతాల్లోని నీటి నాణ్యతను పెంచడమే కాదు. కాలుష్య తీవ్రతలు తగ్గించడంలోనూ కీలకమౌతున్నాయి. చిత్తడి నేలలు సాగు, తాగునీరు అందిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది ఆహార భద్రతకు భరోసా కల్పిస్తున్నాయి.

ఈ నేలలో లభించే చేపల్లో పోషకాలు అధికంగా ఉంటున్నాయని పలు పరిశోధనలు తేల్చాయి. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్న చిత్తడినిలో పర్యాటక ఆదాయాన్ని గణనీయంగా పెంచుతున్నాయి.

 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2400 ప్రదేశాలను రామస్ ప్రమాణాల ప్రకారం చిత్తడి నేలలుగా గుర్తించారు. వీటిలో అత్యధికంగా 175 వరకు యూకే లోనే ఉన్నాయి. 142 ప్రదేశాలలతో మెక్సికో రెండో స్థానాన్ని ఆక్రమించింది భారత్ 1982లో రామస్ ఒప్పందంలో చేరి చిత్తడి నేలల గుర్తింపును మొదటి పెట్టింది 1982 2013 మధ్యకాలంలో 26 ప్రదేశాలను 2014 2023 మధ్య మరో 49 క్షేత్రాలను చిత్తడి నేలలుగా గుర్తించారు.

 ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75 చోట్ల 13.30 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రామస్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు విస్తరించి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు పులికాట్ సరస్సులు ఇలా గుర్తింపు పొందినవే. ఈ ఒప్పంద ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ దేశంలోని అనేక చిత్తడి నేలలను గుర్తించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కోయంబత్తూర్ కు చెందిన సలీం అలీ సెంటర్ ఫర్ నేచురల్ హిస్టరీ శాఖను సంస్థ రెండు దశాబ్దాలకు ఇంతమే దేశంలోని 700 ప్రదేశాలకు చిత్తడి నేలలుగా గుర్తింపు నుంచి పరిరక్షించాలని సూచించింది. వాటిలో 200 ప్రాంతాలను రా మార్స్ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది.

కోరింగ అభయారణ్యం పాకాల చెరువు కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలను ఆ జాబితాలో చేర్చాల్సినవిగా సాగాన్ పేర్కొంది. సోంపేట నౌపడ వాకాలపుడి బద్వేలు కంభం విశాఖపట్నం జిల్లాలోని కొండకర్ల ఆవ తిమ్మరాజు చెరువు ప్రాంతాలు చిత్తడి నేలలేనని వాటి పరిరక్షణకు చర్యలు అత్యవసరమని సూచించింది.

కొల్లేరు కొండకర్ల ఆవతోపాటు మరికొన్ని ప్రదేశాలను అటవీశాఖ చిత్తడి నేలలుగా గుర్తించినప్పటికీ వాటి సంరక్షణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందిన కొల్లేరు పరిధిలో వేల ఎకరాల చిత్తడి నేలలు ఆక్రమణలకు విధ్వంసానికి గురయ్యాయి. దాన్ని అడ్డుకుని అక్కడి నేలను పునరుద్ధరించడంలో ప్రభుత్వ వ్యవస్థలు ఘోరంగా విఫలమవుతున్నాయి.

*ముగింపు*

ప్రభుత్వం దృష్టి సారించి పర్యాటక కేంద్రాలను పునరుద్ధరిస్తే పర్యాటక కేంద్రంగా విదేశీయులను ఆకర్షించడానికి  ఇది ఒక మంచి అవకాశం గా భావించవచ్చు. అలాగే వీటిని పర్యాటక కేంద్రాలుగా మలచడం వల్ల మన రాష్ట్రానికి ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ విషయం గురించి ప్రభుత్వం చర్చించి తగు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవ శుభాకాంక్షలు.

Show More
Back to top button