Telugu Special Stories

వినలేడు, మాట్లాడలేడు… మొదటిసారే IAS

వినలేడు కానీ.. ప్రపంచం అంతా తన విజయం గురించి వింటుంది. మాట్లాడలేడు కానీ ప్రజలంతా అతని ఉత్తీర్ణత గురించే మాట్లాడుతుంది. అతనే చెన్నైకి చెందిన డి.రంజిత్. ఇలాంటి చరిత్ర సృష్టించిన రంజిత్ మాట్లాడలేరు, వినలేడు. తన తల్లి అమృత B.Ed చదువుకున్నారు. రంజిత్‌కు లిప్‌ రీడింగ్ నేర్పిచారు. ఇది తనకు చాలా ఉపయోగపడింది. దీని వల్ల తన క్లాస్‌లో ముందు బెంచీలో కూర్చుని లిప్‌ రీడింగ్‌తో పాఠాలను అర్థం చేసుకునేవారు. ఇలా ఇంటర్ పరీక్షల్లో వినికిడి లోపం ఉన్న వారి విభాగంలో తమిళనాడు రాష్ట్రంలో అగ్ర స్థానంలో నిలిచారు. డిగ్రీలో 80 శాతం మార్కులు సాధించారు.

కంపెనీలో పని చేసే సామర్థ్యం తనకు ఉన్నా ఏ కంపెనీలో తనకు ఉద్యోగం రాలేదు. అయినా నిరాశ చెందలేదు. దీంతో UPSCకి ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకుని కోచింగ్‌ సెంటర్‌లో చేరాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి IAS అవ్వాలని నిర్ణయించుకున్నారు. దానికి తగినంత కష్టపడ్డాడు.. తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి అల్ ఇండియా 750 ర్యాంక్ సాధించాడు. ఇంతటి ఘన విజయం సాధించడానికి తన కుటుంబం చాలా సహకరించిందని ఈయన తెలిపారు. తన ఈ ప్రయత్నంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా లక్ష్య సాధన కోసం ముందుకు సాగిపోతూ ఉండాలని ఆయన తెలిపారు.

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.. మహా పురుషులవుతారు అనడానికి నిదర్శనం రంజిత్.

అభ్యర్థులకు రంజిత్ సలహా..


మీరు ఏ పోటీ పరీక్షలకైనా సిద్ధమౌవుతుంటే.. మొదటగా గుర్తుంచుకోవాల్సింది దృఢ సంకల్పం, పట్టుదల. ఇవి మీకు ఉంటే ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదని తెలిపారు.

ముఖ్యంగా సివిల్స్‌ అభ్యర్థులు ముందుగానే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. వచ్చే సమస్యల్ని అధిగమిస్తూ పరీక్షలకు సిద్ధం కావాలి.

అభ్యర్థులు ముందు సిలబస్‌ని ఒకటికి రెండుసార్లు చదువుకొని దానిపై పట్టు సాధించాలి. అప్పుడే ప్రిపరేషన్‌ సులభం అవుతుంది.

ప్రతిరోజూ కరెంట్ ఆఫైర్స్ నోట్స్ రాసుకొని వాటిని నెలవారీగా మళ్లీ రివిజన్‌ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రశ్నల సరళిపై అవగాహన పెంచుకోవాడానికి సాధ్యమైనంత వరకు మాక్‌ టెస్టులు రాయాలి.

గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే వాటి స్థాయి ఎంటనేది, మన సామర్థ్యం ఏమిటనేది మనకు తెలుస్తుందని సలహా ఇస్తున్నారు.

Show More
Back to top button