ఒకప్పుడు నూడిల్స్, చేపలు, కూరగాయలు అమ్మిన శాంసంగ్ కంపెనీ ఈరోజు ఫైటర్ జెట్స్, షిప్స్, వార్ టాంక్స్, కన్స్యూమర్స్ వాడే ఎలక్ట్రానిక్స్ వస్తువులతో పాటు ఇన్సూరెన్స్, ఫైనాన్స్, కెమికల్స్ వంటి ఎన్నో రంగాల్లో విస్తరించింది. కానీ మనకు తెలిసినంతవరకు శాంసంగ్ అంటే కేవలం మొబైల్స్, టీవీలు, ఫ్రిజ్, ల్యాప్ టాప్ లాంటి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మ్యాన్ ఫ్యాక్చర్ చేసే కంపెనీగా మాత్రమే అనుకున్నాం. ఎప్పుడైతే మన దేశంలో షోమి, రియల్ మీ లాంటి చైనా బ్రాండ్లు అడుగుపెట్టాయో అప్పుడు చాలామంది ఈ శాంసంగ్ పని అయిపోయిందనుకున్నారు. ఇంకొంతమంది అయితే నోకియాలాగానే అంతరించిపోయిదనుకున్నారు.
కానీ నేడు ఆండ్రాయిడ్ ని గూగుల్ తరువాత శాంసంగే ఎక్కువగా కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు దీని సాయం లేకుండా ఏ కంపెనీ స్మార్ట్ ఫోన్ ని తయారు చేయలేదంటే నమ్ముతారా… అది మీరు ఏ కంపెనీ అయిన సరే.. గూగుల్ ఫిక్సెల్ నుంచి ఆపిల్ ఫోన్ అయినా సరే.. ఇలా ఏ కంపెనీ అయినా శాంసంగ్ సపోర్ట్ ఉండాల్సిందే. మొదట్లో కేవలం ఫుడ్ రిలేటెడ్ నూడిల్స్, ఫిష్(చేపలు), వెజిటేబుల్స్ వ్యాపారం చేసినా.. నేడు ఈ కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెటింగ్ బిజినెస్ వరల్డ్ ఎదిగింది.. ఇతర పోటీ కంపెనీల ధాటిని ఎలా తట్టుకొని నిలబడగలిగింది.. అప్పట్లో సౌత్ కొరియా ఎకానమిని ఎలా ప్రభావితం చేయగలిగింది..
వంటి ఆసక్తికర విషయాల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం…
1938లో లీ చుల్ అనే ఒక సౌత్ కొరియన్ వ్యాపారవేత్త ఒక ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించాడు.
కొరియాలో శాంసంగ్ అంటే 3 స్టార్ అని అర్థం. 3 అనేది కొరియాలో అత్యంత పవర్ ఫుల్ మీనింగ్ ను రిప్రజెంట్ చేస్తుంది. పేరుకు తగ్గట్లుగానే
నేడు శాంసంగ్ బిగ్ అండ్ పవర్ ఫుల్ వ్యాపార దిగ్గజంగా కొనసాగుతుంది. ఈ కంపెనీ స్థాపించిన మొదట్లో ఫామ్ తక్కువగా ఉన్నా.. మెల్ల మెల్లగా బిజినెస్ ని సౌత్ కొరియా అంతటా విస్తరించింది. ఆ తరువాత పొరుగు దేశాల్లో కూడా తన బిజినెస్ ని ఎక్స్ పాండ్ చేసింది.1950లో నార్త్ కొరియాలో యుద్ధం మొదలయ్యే సమయానికి శాంసంగ్ సౌత్ కొరియాలోని టాప్10 ట్రేడింగ్ కంపెనీల్లో ఒకటిగా ఉండేది. అయితే ఈ యుద్ధం ముగిసిన తరువాత ఈ బిజినెస్ అసలు కథ స్టార్ట్ అయ్యిందని చెప్పాలి.
యుద్ధం కారణంగా శాంసంగ్ తన హెడ్ క్వాటర్స్ ని సియల్ నుంచి బుసన్ కి తరలించాల్సి వచ్చింది. బుసన్ కి షిఫ్ట్ అయిన తరువాత శాంసంగ్ బిజినెస్ అమ్మకాలు తగ్గాయి. కొందరైతే ఇక బిజినెస్ మొత్తం పోయిందని అనుకున్నారు. ఎందుకంటే యుద్ధం కారణంగా దేశంలో ప్రొడక్షన్ నిలిచిపోయింది.
దీంతో ఎటువంటి ఎగుమతులు జరగలేదు. అందువల్ల దేశ ప్రజలంతా ఇతర దేశాల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ పైన ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ఆ సమయంలో కంపెనీ ఫౌండర్ అయిన లీ యుద్ధం ముగిసిన వెంటనే తన బిజినెస్ ని అనేక సెక్టార్లకు విస్తరించాలని భావించాడు. దేశ ప్రజలకు తక్కువ ధరలకే వస్తువులను అందించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. కొరియాలో చెరకు భారీ మొత్తంలో ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే శాంసంగ్ తమ బిజినెస్ ను ముందుగా ఎక్స్ పాన్షన్ ని ఒక షుగర్ రిఫైండ్ తో స్టార్ట్ చేసింది. తరువాత లీ తక్కువ ధరలకే బట్టలు అందించాలని భావించి, షుగర్ రిఫైనరీలో వచ్చిన లాభాలతో టెక్స్ట్ టైల్స్ ఇండస్ట్రీని మొదలుపెట్టింది. ఇందుకోసం ఏకంగా కొరియాలోని అతిపెద్ద ఉలెన్ మిల్ ని ఓపెన్ చేసి తానే బట్టలు తయారుచేయడం మొదలు పెట్టింది. ఈ విధంగా లీ వివిధ సెక్టార్లలో బిజినెస్ ని పెంచుతూ పోవడం వల్ల మునిగిపోయింది అనుకున్న శాంసంగ్ ను తన ముందుచూపుతో ఒడ్డున చేర్చాడు.
అంతేకాదు లీ తనకి వచ్చిన ప్రాఫిట్ ని వివిధ సెక్టార్లలో ఇన్వెస్ట్ చేసి, డిపార్ట్ మెంటల్ స్టోర్స్, ఇన్సూరెన్స్ బిజినెస్ లను సైతం స్టార్ట్ చేశాడు. ఇప్పటికీ శాంసంగ్ సౌత్ కొరియాలో ది బిగ్గెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీగా కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా బిజినెస్ ఎక్స్ పాన్షన్ ద్వారా వచ్చిన డబ్బులతో లీ సౌత్ కొరియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా ఎదిగాడు.
ఆ తరువాత 1968 ప్రాంతంలో శాంసంగ్ ఎలక్ట్రానిక్ రంగంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. 1969లో తన మొదటి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ ని మార్కెట్ లో లాంఛ్ చేసింది. అదే 12 ఇంచుల బ్లాక్ అండ్ వైట్ టీవీ అన్నమాట. ఇది జనాల్లో సూపర్ హిట్ అవ్వడంతో కేవలం కొన్ని సంవత్సరాల్లోనే, ప్రపంచంలోనే నెంబర్.1 మ్యానిఫాక్చర్ గా ఎదిగింది. అయితే ఈ సక్సెస్ మరిన్ని ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ లను తయారు చేసేందుకు ఊతమిచ్చింది. ఈ మోటివేషన్ తో 1979లో మైక్రోవేవ్,1980లో ఏసీ, 1981లో కలర్ టీవీ,1983లో పోస్టల్ కంప్యూటర్ లను లాంఛ్ చేసి, అంచలంచెలుగా పైకి ఎదిగింది. అయితే మొదట్లో ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటికీ ఉపయోగపడే
చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కోసం శాంసంగ్ ఇతర కంపెనీల మీద ఆధారపడాల్సి వచ్చేది. అలా కాకుండా ఉండేందుకు, శాంసంగ్ ఒక సెమీ కండక్టర్ కంపెనీని కొనుక్కొని, అవసరమైన తమ సొంత భాగాలను స్వయంగా మ్యాన్ ఫాక్చర్ చెయ్యడానికి పూనుకుంది. అంతేకాదు ఈ సెమీ కండక్టర్ మ్యానిఫ్యాక్చర్ కెపాసిటీని పెంచి, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ పోర్ట్ చేసింది. నేడు ఆపిల్ కూడా శాంసంగ్ తయారుచేసిన మెమోరి చిప్ ను యూస్ చేస్తుంది. ఇలా కేవలం ఎలక్ట్రానిక్స్ మాత్రమే కాకుండా ఇతర బిజినెస్ లలో సైతం విస్తరించింది.
ఇదేకాక శాంసంగ్ అనేది హెవీ ఇండ్రస్టీ.. ఇది ప్రపంచంలోని అతి పెద్ద షిప్ బిల్డర్స్ లో ఒకటిగా పేరుగాంచింది. అలాగే శాంసంగ్ కాంట్రాక్షన్ అండ్ ట్రేడింగ్ లో భాగంగా రోడ్లు, టన్నెల్స్, రోడ్స్, బ్రిడ్జ్ లు వంటి పెద్ద ప్రాజెక్ట్స్ ను నిర్మిస్తుంది. సౌత్ కొరియాలో అతి పెద్ద థీమ్ పార్క్ అయిన ఓవర్ ల్యాండ్ థీమ్ పార్క్, అనేక లగ్జరీ హోటల్స్ తో కొరియాలోని ఒక పూర్తి టౌన్ నే నిర్మించింది. ఆ టౌన్ పేరు శాంసంగ్ టౌన్. మనకు తెలిసిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పోలిస్తే నాన్ ఫ్రొఫిట్ ఫౌండేషన్ ని కూడా జత చేస్తే, శాంసంగ్ వ్యాపార జాబితా మరింత పెద్దది అవుతుంది. ఎందుకంటే శాంసంగ్ అనేక యూనివర్సిటీలు, చాలా మెడికల్ సెంటర్ లను కూడా ఎస్టాబ్లిష్ చేసింది.
సక్సెస్ ఫుల్ గా ఎలా రాన్ అయ్యింది అంటే..
శాంసంగ్ నార్త్ కొరియాతో యుద్ధం తరువాత సౌత్ కొరియా ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దేశంలో ప్రొడక్షన్ అండ్ ఎక్స్ పోర్ట్ గూడ్స్ పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. దీంతో అప్పటి కొరియన్ ప్రెసిడెంట్ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా గాడిలోకి తెచ్చేందుకు, ఇన్ కమ్ పెంచేందుకు దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలను ఒక గ్రూప్ గా చేసి, వాటిని సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇంతవరకు అతడి ఆలోచన మంచిదే అయినప్పటికీ, ఇతడు సపోర్ట్ చేసిన విధానం పూర్తిగా అనెథికల్ గా ఉంది.
ఇందులో అతడు శాంసంగ్, ఎల్ జి, హ్యుండాయ్
లాంటి పెద్ద కంపెనీలకు చాలా సులువుగా బిజినెస్ లోన్లు అందించాడు. అంతేకాదు ఈ కంపెనీలు చేసే బిజినెస్ మరింత పెరిగి, దేశ ఎకానమీ త్వరగా పెరిగేందుకు, ట్యాక్స్ లు సైతం తగ్గించింది. ఇకపోతే శాంసంగ్ కంపెనీ కోసమైతే ప్రత్యేకంగా కొరియా ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వస్తువుల పైన విధించే పన్నుని 50% వరకు తగ్గించింది. ఇక్కడ శాంసంగ్ కు మరింత ప్లస్ అయిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎలక్ట్రానిక్ సెక్టార్ లో ఈ శాంసంగ్ కంపెనీ మరింత ఎదగడం కోసం అక్కడి గవర్నమెంట్ తన దేశానికి ఇంపోర్ట్ అయ్యే జపాన్ ఎలక్ట్రానిక్ వస్తువులను బ్యాన్ చేసింది. దీంతో ప్రజలకి వేరే ప్రత్యామ్నాయం లేక శాంసంగ్ ప్రొడక్టులను కొనేవారు. ఇటువంటి బెనిఫిట్స్ ఆ కంపెనీకి ఇవ్వడం వల్లనే ఆ కంపెనీ చాలా వేగంగా వృద్ధి చెందింది. మరో షాకింగ్ విషయం ఏంటంటే, యుద్ధం తరువాత సౌత్ కొరియాకి, అమెరికా ఇచ్చిన రిలీఫ్ ఫండ్ ని కూడా అక్కడి ప్రభుత్వం శాంసంగ్ ఎక్స్ ప్యాన్షన్ కోసమే ఉపయోగించింది. అయితే ఇవన్నీ తమకు అనుకూలంగా జరగడానికి ప్రధాన కారణం శాంసంగ్ ఫౌండర్ అయిన లీ.
ఇతడికి దేశంలోని అన్ని పొలిటికల్ పార్టీలతో మంచి సంబంధాలు ఉండేవి. సౌత్ కొరియా ప్రెసిడెంట్ కి బెస్ట్ ఫ్రెండ్ కూడా.. అందుకే శాంసంగ్ ని అక్కడ ప్రభుత్వం అంత ప్రత్యేకంగా ట్రీట్ చేసేది. అలాగే అప్పట్లో సౌత్ కొరియాలో శాంసంగ్ మినహా ఇతర అన్ని కంపెనీలకు ఎక్స్ పోర్ట్ లిమిట్ అనేది ఉండేది. అలాగే ఈ శాంసంగ్ ఎక్స్ పాన్షన్ లో భాగంగా ఫండ్ కొరత ఎప్పుడు ఏర్పడలేదు.
శాంసంగ్ బిజినెస్ ఫాస్ట్ గ్రోత్ అనేది కొరియా ఎకనామిక్ కి చాలా హెల్ప్ అయ్యింది. మరి ముఖ్యంగా ఎంప్లామెంట్ రూపంలో చాలా మందికి ఉద్యోగాలు దక్కాయి. కానీ చిన్నతరహా కొరియన్ బిజినెస్ లు మాత్రం ఘోరంగా నష్టపోయాయి. సౌత్ కొరియా ఎకానమీ సిస్టమ్ మొత్తం కూడా ఈ శాంసంగ్ కంపెనీపైనే ఆధారపడే పరిస్థితికి చేరుకుంది. 2014 వచ్చేసరికి, సౌత్ కొరియాకు సంబంధించి పూర్తి జీడీపీలో దాదాపు 17% జీడీపీని ఈ శాంసంగ్ కంట్రిబ్యూట్ చేసింది. ఎల్ జీ, హ్యుండాయ్ కంపెనీల గ్రాఫ్ ఇంచుమించు ఒకేలా ఉంది. కానీ వీటన్నిటిలో శాంసంగ్ పెద్దది. ఎలా అయితే కొన్ని సెలెక్టెడ్ కంపెనీలు కొరియన్ బిజినెస్ ను శాసిస్తున్నాయో, అలాగే సౌత్ కొరియాకి చెందిన పూర్తి డబ్బు, పవర్ అనేది కేవలం రెండు, మూడు బిజినెస్ కుటుంబాల చేతుల్లోకి వెళ్ళిపోయింది.
1987లో లీ మరణం తరువాత అతడి కొడుకు లీకున్హి కంపెనీ బాధ్యతలు స్వీకరించాడు. ఇతడు వచ్చాక కంపెనీ గ్రోత్ అండ్ గవర్నమెంట్ తో ఉన్న రిలేషన్ రెండూ బెడిసికొట్టాయి. కాంట్రవర్సీకి దారి తీశాయి. మాజీ ప్రెసిడెంట్ కి లంచం ఇచ్చాడని ఇతడిపై 1996లో ఆరోపణలు వచ్చాయి. కానీ గవర్నమెంట్ తో ఉన్న మంచి రిలేషన్ కారణంగా అప్పటి ప్రెసిడెంట్ ఇతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2008లో అతిపెద్ద అవినీతి కుంభకోణంలో తానొక దోషిగా తేలాడు. దీంతో అతడ్ని పదవి నుంచి తొలగించడంతోపాటు 3 సంవత్సరాలు జైల్లో ఉంచారు. కానీ సంవత్సరంలోనే అక్కడి ప్రెసిడెంట్ అతడి శిక్షను రద్దు చేశాడు.
నేడు సౌత్ కొరియాలో శాంసంగ్ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడే సాహసం చెయ్యరు. ఎందుకంటే శాంసంగ్ కి వ్యతిరేకంగా మాట్లాడితే అది గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడినట్లే అవుతుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఆ సాహసం చెయ్యరు. అయితే శాంసంగ్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల మార్కెట్ షేర్ ఘోరంగా పడిపోయి, కంపెనీ రిప్యూటేషన్ ను పూర్తిగా దెబ్బతీసింది.
2016లో శాంసంగ్ నోట్ 7 సిరీస్ మొబైల్ ఫోన్స్ బ్లాస్ట్ అవ్వడం అనేది వరల్డ్ వైడ్ గా పెద్ద న్యూస్
అయ్యింది. చాలా ఎయిర్ లైన్స్ ఈ ఫోన్లను బ్యాన్ చేసింది. దీంతో చేసేదేమి లేక శాంసంగ్ తన ఫోన్ ప్రొడక్షన్ ను ఆపేసి, అప్పటిదాకా మార్కెట్లో ఉన్న ఫోన్లను తిరిగి వాపసు తెచ్చుకుంది. దీనివల్ల వాళ్లకు దాదాపు 5 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. అయితే ఈ కంపెనీ మొబైల్ ఫోన్స్ బ్లాస్ట్ అవ్వడానికి కారణం మాత్రం బ్యాటరీ అని చెప్పింది. కానీ అసలు కారణం.. మార్కెట్ లో ఆపిల్ తో పోటీ పడటానికి మంచి ఫీచర్స్ కలిగిన మొబైల్ ఫోన్ అవసరం పడింది. అందుకోసం శాంసంగ్ తన డిజైన్ టీమ్ ఇంజినీర్స్ తో కలిసి హడావిడిగా ఒక మొబైల్ ఫోన్ ను చేయించింది. ఎటువంటి ప్రాపర్ టెస్టింగ్ క్వాలిటీ కంట్రోల్ చేయకుండా ఒక డేంజరస్ ఫోన్ ని మార్కెట్ లో కి లాంఛ్ చేశారు. చివరికి అది బెడిసికొట్టింది. ఈ విధంగా ఎన్ని కాంట్రవర్సీలు వచ్చిన ఎన్ని అవినీతి ఆరోపణల వార్తలు వచ్చిన శాంసంగ్ సక్సెస్ అవుతూనే వచ్చింది.
అంతేకాదు ఇది ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో ప్రొడక్ట్ లను లాంఛ్ చేస్తూ వస్తూ మార్కెట్లో తన ఆధిక్యాన్ని చూపిస్తుంది. ఈ విధంగా శాంసంగ్ తన మార్కెట్ ను, రెవిన్యూను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన రిప్యూటిషన్ ను పెంచుకుంటూ వస్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో చాలా తక్కువ ధరకే మంచి ఫీచర్స్ గల చైనా మొబైల్ ఫోన్ లు అందుబాటులోకి రావడంతో శాంసంగ్ మొబైల్ ఫోన్ మార్కెటింగ్ తగ్గిందనే చెప్పాలి. కానీ వాస్తవానికి జనాలకు చైనా ఫోన్లపై క్రేజ్, నమ్మకం అంతకంతకు తగ్గి, మళ్లీ శాంసంగ్ కంపెనీపైనే మొగ్గు చూపేలా క్రేజ్ పెరిగింది. ప్రపంచంలో అతి పెద్దదైన బూర్జుఖలీఫా, అలాగే మలేషియాలోని 450 మీటర్ల ఎత్తైన మలేషియన్ ట్విన్ టవర్స్ ను సైతం శాంసంగ్ కన్స్ స్ట్రక్షన్స్ నిర్మించడం విశేషం.