జాతీయ ఓటరు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు,అసలెందుకు జరుపుకుంటారు అనేది మనం ఈ రోజు తెలుసుకుందాము.
భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కు పైన, ప్రజాస్వామ్య వ్యవస్థ పైన, ప్రజలకు విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
ఇదేలా ఏర్పాటయింది?
ఇది 2011 జనవరి 25 నుండి కమిషన్ ఫౌండేషన్ ఈ రోజును గుర్తించడానికి ప్రారంభమైంది. మాజీ ప్రధానమంత్రి మనుమోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన భారత కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభించిందని అప్పటి సమాచార ప్రసార శాఖామంత్రి అంబికా సోనీ తెలిపారు. అయితే అప్పుడు ఉన్న చట్ట సవరణల ప్రకారం 18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు ఎన్నికల రికార్డుల్లో పాల్గొనడానికి తక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని వారి నమోదు స్థాయి కొన్ని సందర్భాలలో 20 నుంచి 20 శాతానికి తగ్గిపోవడంతో సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఓటు హక్కును అందరూ వినియోగించుకునేందుకు దేశవ్యాప్తంగా చాలామంది తమ ఓటు హక్కును ఉపయోగించుకోకుండా అసలు కనీస అవగాహన లేకుండా ఉంటున్నారనే అభిప్రాయంతో అవగాహన కార్యక్రమాలను జరుపుతూ అన్ని నియోజకవర్గాలలో 18 ఏళ్ల వయసు ఉన్న వారందరినీ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ చట్టాన్ని తేవడం జరిగింది.
ఓటు హక్కు అనేది మనిషి కనీస ప్రాథమిక హక్కు , సమాజంలో తాను జీవిస్తున్నానని సంక్షేమ పథకాలలో తనకు కూడా చోటు ఉందని తెలుపుకోవడానికి ఇదొక హక్కుగా భావిస్తారు.. అయితే జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు వచ్చే అర్హత గల అన్ని ఓటర్లను గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చెప్పాలని చేపట్టాలని అప్పటి భారత ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
అలాగే 18 ఏళ్ల వయసు కలిగిన అర్హత కలిగిన ఓటర్లు సమయానికి తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు జరుపుకోవడానికి జనవరి 25వ తేదీని వాళ్లకు ఓటు హక్కును ఫోటో గుర్తింపు కార్డు అందజేయాలని దాంతో వారి బాధ్యత పెరుగుతుందని భావించి భారత ఎన్నికల కమిషన్ జనవరి 25వ తారీకు ను జాతీయ ఓటర్ల దినోత్సవం గా జరపడం మొదలుపెట్టింది.
అప్పటినుంచి యువత అంటే 18 ఏళ్ల వయసు కలిగిన వారంతా తమ గుర్తింపు కార్డు కోసం కనీస ప్రాథమిక హక్కు కోసం తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఓటర్ల జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవడం మొదలైంది.
అయితే ప్రజల్లో ఓటు హక్కు వల్ల తమకు వచ్చే సంక్షేమ పథకాలు ఏమిటి అనేది తెలియడానికి ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను చేపడుతూ వస్తుంది.
అందులో భాగంగానే జనవరి నెలలో ప్రతి చోటా ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు.
అలాగే యువత లో రాజకీయ ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు కూడా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుతూ ఉంటారు. ఇది ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
18 ఏళ్ల వయసు నిండిన వారు ఓటరు గుర్తింపు కార్డు, ఫోటో గుర్తింపు కార్డును ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన అందజేస్తారు. ఇలా కార్డు అందజేయడం వల్ల వారును స్ఫూర్తి పొందుతారని వారికి సాధికారత ,ఓటు హక్కు వినియోగించుకునేలా ఇది ఉత్సాహం ఇస్తుందని అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు.
ఓటరుగా ఉన్నందుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను అనే ఆలోచన కూడా యువతలో ఆనందం కూడా కలుగుతుంది. వారు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా సంఘంలో గుర్తించబడతారు. తమకు కూడా ఒక గుర్తింపు అనేది లభించిందని యువత ఎంతో సంతోషంగా చెప్పడం మనం ప్రతి ఎన్నికలలో మొదటిసారి ఓటు వినియోగించుకున్న వారి మాటలు ఎన్నో విన్నాము.
నేను మొట్టమొదటి కి ఓటు వేశాను నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ చాలామంది చెప్పడం వారి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మనకు కూడా ఓటు వేయాలని అనిపించక మానదు.
అలాగే ఒక్క ఓటు ద్వారా ప్రభుత్వాలను మార్చగల శక్తి ప్రజలకు ఉంది అని చెప్పే ప్రయత్నం కూడా చేయడానికి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం పని చేస్తుంది.
అసలు ఓటు హక్కు ఎందుకు?
మనిషి బాల్యం నుంచి యవ్వనం వరకు తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతాడు అయితే ఒక వయసు వచ్చిన తర్వాత సమాజంలో తనకంటూ గుర్తింపు కావాలనే కోరుకుంటాడు. ఇది చాలా సహజం. దీనికి మనం విదేశాల్లో చూసినట్లయితే 14 ఏళ్ల పిల్లలను తల్లిదండ్రులు వదిలేసి, మీ బ్రతుకు మీరు బ్రతుకుతూ చదువుకోండి అనే విషయం అందరికీ తెలిసిందే.
కానీ మన భారతదేశంలో మాత్రం మన తల్లిదండ్రులు అలా చెప్పరు.వారిని బాధ్యతను తానే జీవితాంతం మోసిన ఆశ్చర్యపోనవసరం లేదు కానీ కనీస గుర్తింపు అనేది తమకు ఉండాలని యువత కూడా కోరుకోవడంలో తప్పులేదు కాబట్టి ఇవన్నీ ఆలోచించినా నాయకులు మనిషికి కనీస గుర్తింపు అనేది ఉండాలని నిర్ణయించారు.
అలాగే దేశ రాజకీయాలలో కూడా పురోగతిని సాధించడానికి యువత అవసరం ఎంతైనా ఉందని వారి ఆలోచన విధానం తమకన్నా ముందు తరం వరకు ఆలోచిస్తుందని యువతకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఒక స్పష్టమైన అవగాహన జీవితం మీద ఏర్పడుతుందనే ఆలోచనతో ఈ ఓటు హక్కు వినియోగాన్ని తెచ్చినట్లు భావించవచ్చు.
అయితే సంక్షేమ పథకాలు అంటే ప్రభుత్వం పేదలకు అందించే సంక్షేమ పథకాలలో లబ్ధిదారులకు చేకూరే విధంగా ఎంతమంది పేదలు ఉన్నారు అనేది తెలుసుకోవడానికి కూడా ఓటు హక్కు ఉపయోగపడుతుంది.
18 ఏళ్లు నిండిన తర్వాత తల్లిదండ్రులకు పోషించడానికి ఏదో ఒక పని చేసే విధంగా ఉపాధి కల్పన లోను ఈ ఓటు హక్కు నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందని భావించవచ్చు.
అందువల్ల ప్రభుత్వం జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుతూ ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలను కూడా చేపడుతూ వస్తోంది.
ఇప్పుడు మనం ఈ జనవరి 25న జరుపుకునే జాతీయ ఓటరు దినోత్సవం 14 వ జాతీయ ఓటరు దినోత్సవంగా పేర్కొనవచ్చు.
ఇప్పటి యువతలో ఇంకా ఆలోచనలు పెరిగి కచ్చితంగా తమ ఓటు హక్కును అందరూ వినియోగించుకుంటున్నారు. 18 ఏళ్ల పైబడిన నుంచి 100 ఏళ్ల వయసున్న వారి వరకు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఓటు యొక్క ప్రాధాన్యత అందరికీ చాటుతున్నారు. కాబట్టి మనం కూడా జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం. తెలియని వారికి తెలిసేలా చేద్దాం. మరి మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నారా?