HEALTH & LIFESTYLE

ఊబకాయంతో పిల్లల్లో తగ్గుతున్న ఉత్సాహం

పిల్లలు వారి వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఉండాలి. కాస్త బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటారని తల్లిదండ్రులు భావిస్తారు. దీంతో అధిక బరువు ముదిరి ఊబకాయం బారిన పడతారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రస్తుతం చాలామంది ఒబెసిటితో భాదపడుతున్నారు. త్వరలో ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద ఒబెసిటి దేశంగా మారుతుందని WHO హెచ్చరించింది. చిన్న వయసులో ఊబకాయత్వం రావడం వల్ల శరీరంలో అవయవాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఉదాహరణకు ఎముకలు, కీళ్ల మధ్య ఒత్తిడి పడుతుంది. ఊపిరితిత్తుల మధ్య, ఆస్తమా, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్ వంటి వ్యాధుల బారిన పడతారు. చుట్టూ ఉన్న వారు హేళన చేయడం వల్ల మనోవేదనకు గురవుతుంటారు. ఇవన్నీ జరగకుండా తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చిన్న తనంలోనే వారి బాల్యం బరువై.. భవిష్యత్తులో వారి శరీరం రోగాల పుట్టగా మారుతుంది.

ఒబెసిటికి కారణాలు

ఒబెసిటి అనేది మనం తీసుకున్న క్యాలరీస్, వాటిని శరీర అవసరాలకు ఖర్చు చేయడంలో ఏర్పడే అసమతుల్యతల కారణంగా వస్తుంది. దీనికి పిల్లలు ఇంట్లోనే ఉండటం, అతిగా తినడం కూడా కారణాలే. ఒబెసిటిని పిల్లల బరువు, వయసు తీసుకుని చార్ట్  ఆధారంగా నిర్దారిస్తారు. సెంటైల్స్ లేదా BMI కాల్యుకులేషన్ (బాడీ మాస్ ఇండెక్స్) విధాలను వినియోగించి డాక్టర్లు నిర్ధారిస్తారు. ఒబెసిటీ రావడానికి కారణాలు.

* చాక్లెట్స్, చిప్స్, కుకీస్, కేక్‌లు, బిస్కెట్స్ మొదలైన జంక్ ఫుడ్ అతిగా తింటే శరీరంలో కార్బోహైడ్రేడ్స్, గ్లూకోజ్ ఎక్కువై అధిక బరువవుతారు.

* పిల్లలు ఆటలకు దూరమవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడం.

* వేళాపాల లేకుండా పిల్లలకు పేరెంట్స్ ఎప్పుడూ ఏదో ఒకటి తినిపిస్తూ ఉండటం.

* తక్కువ నిద్ర, ఒత్తిడి వల్ల కూడా ఒబెసిటి తీవ్రమవుతుంది.

* వంశపారపర్యంగా, కొన్ని రకాల మెడిసిన్ వాడటం ద్వారా వస్తుంది.

* తల్లిదండ్రులు పిల్లలపై ప్రేమ చూపించడంలో పోటీపడి ఎక్కువగా తినిపించడం.

* ఒబెసిటి తగ్గించండిలా

పిల్లల్లో శారీరక శ్రమ ఉండదు. కాబట్టి తక్కువ ఫుడ్ ఇవ్వాలి. అలా కాకుండా అతిగా ఆహారం ఇచ్చారో.. మీ పిల్లలను మీరే ప్రమాదంలోకి నెట్టినట్టే. ఎక్కువ సమయం పిల్లలు స్కూల్స్‌లోనే ఉంటారు. పాఠశాలల్లోనూ క్రీడలు, యోగా, ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒబెసిటికి టాబ్లెట్స్, డాక్టర్ ఏం చేయలేరు. తీవ్రమైతే సర్జరీ చేయాల్సిందే. డైట్ పాటించడమే దీన్ని నివారించడానికి ఉత్తమ మార్గం.. ఇవి పాటించండి.

* పిల్లలు ఇంట్లో ఉంటే స్నాక్స్, చాక్లేట్స్, కేక్స్ అని తింటూనే ఉంటారు. పిల్లల్ని మొబైల్స్, గాడ్జెట్స్, టీవీలకు దూరంగా ఉంచి వాళ్లని ఆటలు ఆడుకోనివ్వాలి.

* ఎక్కువ ఫైబర్స్ ఉండి తక్కువ కార్బోహైడ్రేడ్స్ ఉంటే ఆహార పదార్థాలు తినిపించాలి.

* ప్రాసెస్ చేసిన తినుబండారాలు ఇవ్వకండి. పండ్లు, కూరగాయలు తినిపించండి.

* మీ పిల్లల్ని యాక్టివ్‌గా ఉంచడానికి ప్రయత్నించండి.

* వంటల్లో నూనె తక్కువగా వాడాలి.

Show More
Back to top button