Telugu Special Stories

గిరిజనుల ఆరాధ్య దైవం.. బిర్సా ముండా!

భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో యోధులు తమ ప్రాణాలను బిర్సా ముండా సైతం తృణప్రాయంగా వదులుకున్నారు. 1947 ఆగస్టు నెల 15న స్వాతంత్య్రం సిద్దించిన నేపథ్యంలో ఆ యోధుల చరిత్రలను స్మరించుకోవాల్సిన ఆవశ్యం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా నేడు బిర్సా ముండా, ఖుదీరాం బోస్ ల గురుంచి తెలుసుకుందాం.
గిరిజనుల హక్కుల కోసం రక్తాన్ని చిందించిన గొప్ప విప్లవ కారుడు. ఆదివాసీల‌ను సైనికులుగా మార్చి, గిరిజ‌న నాయ‌కుడిగా గుర్తింపు పొందాడు. బ్రిటీష్ వారి నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా ధ్వజమెత్తాడు. ఆపై భారత స్వాతంత్య్ర ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించాడు.జాతీయ ఉద్య‌మంపై ఎన‌లేని ప్ర‌భావం చూపించాడు.. బిర్సా ముండా…
పెదవులపై చిరునవ్వుతో, చేతిలో భగవద్గీతనుంచుకొని ఉరికంబం ఎక్కిన ధీరుడు ఇతను. భారతీయ స్వాతంత్ర సమరవీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్న వయస్కుడుగా ప్రఖ్యాతి పొందాడు. భారతదేశాన్ని వేధిస్తున్న బ్రిటిష్ అధికారిపై బాంబువేసిన మొదటి సాహసవీరుడు ఈయనే.

నేపథ్యం…1875 సంవత్సరం నవంబరు 15న, జార్ఖండ్ లోని ఉలిహతు గ్రామంలో జన్మించారు బిర్సాముండా. తండ్రి సుగ్నా ముండా, తల్లి కర్మి. వీరిది నిరుపేద కుటుంబం. పేదరికం కారణంగా, బిర్సా కుటుంబం క్రైస్తవ మతాన్ని స్వీకరించవలసి వచ్చింది. తన ప్రారంభ విద్యను సల్గా పాఠశాలలో చదివాడు బిర్సా. ప్రాథమిక విద్య కోసం బిర్జు మిషన్ స్కూల్‌లో చేరాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానం గురుంచి ఆకళింపు చేసుకున్నాడు. 
తిరుగుబాటు…అనంతరం  బ్రిటీషర్లు భారత్ లో సాగిస్తున్న దురాక్రమణ, సామ్రాజ్యవాదపాలన గురుంచి విన్నారు. అప్పట్లో  బ్రిటిష్‌ పాలకులు ఆదివాసీల భూములపై అధిక పన్నులు వసూలు చేసేవారు. పన్ను చెల్లించని వారి ఆస్తులను లాక్కునేవారు. ఎదురుతిరిగిన వారిని సైతం నానాబాధలు పెట్టేవారు. వారి ఆగడాలు తాళలేక చాలామంది ఆదివాసీలు అస్సాంలోని తేయాకు తోటలలోకి కూలీలుగా చేరారు. తమ భూములను వారికి తిరిగిచ్చేయాలని ఒకరోజు ముండా తెగ పెద్దలతో కలిసి చర్చించి, తెల్ల దొరలపై ఒత్తిడి చేశాడు. దాంతో మిషనరీ పాఠశాల ఆయనను స్కూల్ నుంచి బహిష్కరించింది. దీన్ని సవాలుగా తీసుకున్న బిర్సా.. వారి ఎదుటనే నుదుటన నామం పెట్టుకొని, జంధ్యం ధరించి ఇలా పలికాడు.. ఇకపై క్రైస్తవంలోకి ఒక్క ఆదివాసీని కూడా మారకుండా చూస్తాననీ వారి ముందే ప్రతీన చేశాడు.

అంతటితో ఆగిపోకుండా బ్రిటిషర్ల వల్ల సంథాల్, ఓరియన్, కోల్‌ జాతి తెగలకు చిక్కులు తప్పవని భావించిన బిర్సా ప్రత్యేకంగా ‘బిర్సాయిత్‌’ అనే మతాన్ని స్థాపించాడు. ఆయా తెగల వారికి ఆధ్యాత్మిక అంశాలను బోధించేవాడు. తెగలలోని వారంతా ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజెప్పాడు. ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి ప్రకృతి వైద్యంతో చికిత్స చేశాడు. ఆయన నిర్వహించిన సేవాకార్యక్రమాలు, బోధనలు విన్న ఆదివాసీలు బిర్సా ముండాను ధర్తీలబా(అంటే, దేవుడు)గా కొలిచేవారు. ఆదివాసీ, గిరిజనుల ఆత్మాభిమానం కోసం ఆయన గళమెత్తారు.కుంతి, తామర్, బసియా, రాంచీ, చోటా నాగపూర్ ప్రాంతాలు కేంద్రంగా ఆదివాసీల హక్కుల కోసం ఏకంగా మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపారు. తెల్లవారిని ఎదురించనిదే దేశానికి స్వాతంత్య్రం రాదని భావించారు. అతిచిన్న వయస్సులోనే(22 ఏళ్ళు) బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించాలనుకున్నారు. అనుకున్నట్లుగానే యుద్ధం ప్రకటించారు.

1899 డిసెంబర్‌లో, తెల్లదొరలకు వ్యతిరేకంగా ఉల్‌ గులాన్‌(తిరుగుబాటు) పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. అందులో దాదాపు ఏడువేల మంది పాల్గొన్నారు. దీంతో బ్రిటిషర్లు ఆందోళన చెంది, బిర్సా ఆచూకీ తెలపాలని ఆదివాసీలను నిర్బంధిస్తూ వారిపై దాడులకు దిగారు.వీటిని సహించని ఆయన అనుచరులు ఎట్కేడీ  ప్రాంతంలో ఇద్దరు పోలీసులను చంపేశారు. ఈ ఘటనతో రగిలిపోయిన పోలీసులు ఆయన కోసం అంతటా వెతకడం ప్రారంభించారు.

చివరికి 1900 ఫిబ్రవరిలో జంకోపాయి అటవీ ప్రాంతంలో బిర్సాను అరెస్టు చేసి, రాంచీ జైలుకు తరలించారు.

ఎప్పటికైనా తమకు ప్రమాదకారిగా మారతాడని భావించిన బ్రిటీష్ ప్రభుత్వం బిర్సా ముండాను అదే ఏడాది, జైలులో ఉన్నప్పుడే, జూన్ 9న విషప్రయోగం చేసి, చంపేసింది.

బయటకు మాత్రం మలేరియాతో మరణించాడంటూ ప్రచారం చేసింది.

వీర మరణం పొందే సమయానికి బిర్సా ముండా వయసు 25 ఏళ్లు మాత్రమే. అతి చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలర్పించిన బిర్సా ముండా యోధుడనే చెప్పాలి.

ఆయన చేపట్టిన ఉద్యమ ఫలితంగానే తదనంతర కాలం(1908)లో బ్రిటీష్ ప్రభుత్వం చోటా నాగ్ పూర్ కౌలు హక్కుదారుల చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, ఆ చట్టం ద్వారా పూర్తి న్యాయం జరిగిందని చెప్పలేం.

నేటికీ ఆయన్ని జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోనీ ఆదివాసీలు ‘భగవాన్‌ బిర్సా ముండా’గా పూజిస్తున్నారు.

ఆయ‌న పుట్టిన రోజుకు గుర్తుగా 2000వ సంవ‌త్స‌రంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్ప‌డింది.
ఆయన బోధనలలోనీ అంశాలు… “సాదాసీదా జీవితం గడపండి..మద్యం సేవించవద్దు..మాంసం, చేపలు తినవద్దు..పూజలో త్యాగం మానేయండి..ప్రేతాత్మలను నమ్మవద్దు..తులసిని ప్రతి ఇంట్లో పూజించండి..అబద్ధాలు చెప్పకండి..దొంగతనం చేయకండి.. ఐక్యతను కాపాడుకోండి”.

*భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఉరికంబం ఎక్కిన అమరవీరులలో మరో వీరుడే.. ఖుదీరాం బోస్‌. 
నేపథ్యం…1889 డిసెంబర్‌ 3న పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌ జిల్లాలో జన్మించారు ఖుదీరాం బోస్‌. తల్లిదండ్రులు లక్ష్మీప్రియదేవి, త్రైలోక్యనాథబోస్‌. 6 సంవత్సరాల వయస్సులోనే తల్లిని, ఏడాది తేడాతో  తండ్రిని కోల్పోయాడు. దీంతో ఖుదీరాం తన సోదరి వద్ద పెరిగాడు.

అయితే ఒకరోజు అరబిందో, సిస్టర్‌ నివేదితలు వచ్చి చేసిన ప్రసంగాలకు బోస్ ఆకర్శితుడై విప్లవకారుడిగా మారాడు. 15 ఏళ్ల వయసులోనే అనుశీలన్‌ సమితి వాలంటీర్‌గా చేరాడు. పనిలో భాగంగా బ్రిటీషర్లకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతూ అరెస్టయ్యాడు.

అంతేకాకుండా 18 ఏళ్ల వయసులో ఖుదీరాం బోస్‌, అతని స్నేహితుడైన ప్రఫుల్లా చాకీలు ఇద్దరు కలిసి చీఫ్‌ జడ్జీ డగ్లాస్‌ కింగ్‌ఫోర్డ్‌ను హత్య చేయటానికి యత్నించారు.

ఈ ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్‌ 30న ఇంటికి వస్తున్న కింగ్‌ఫోర్డ్‌పై దాడి చేయడానికి బదులుగా పొరపాటున న్యాయవాది కెన్నెడీపై బాంబులు విసిరారు.

ఈ ఘటనలో కెన్నెడీ తప్పించుకోగా.. అతని భార్య చనిపోయింది.దీంతో వీరిద్దరిని పట్టుకోవడానికి పోలీసులు భారీగా తరలి వచ్చారు.

తాము ఎలాగు వారికి చిక్కుతామని తెలిసి, ప్రపుల్లా చాకి తనను తాను కాల్చుకుని ప్రాణాలు వదిలాడు.

ఖుదీరాం బోస్ మాత్రం పట్టుబడ్డాడు. అతనిని విచారణకు తీసుకెళ్లడం జరిగింది. జడ్జీపై హత్యాయత్నానికిగానూ ఉరిశిక్ష విధించి, ముజఫర్‌పూర్ జైలుకు తరలించారు.

అనంతరం ముజఫర్ జైలులోనే 1908, ఆగస్టు 11న అతనిని ఉరితీశారు.

ఉరి వేసే సమయంలో ఖుదీరాం బోస్ చేతిలో భగవద్గీత ఉంది, ఏ మాత్రం అదరలేదు, బెదరలేదు..చేతిలో భగవద్గీతతోనే చిరునవ్వుతో ఉరికంభం ఎక్కిన ధీరుడుగా చరిత్రలో నిలిచాడు.

అతని మరణం తరువాత ముజఫర్ పూర్ జైలుకు ఖుదీరాం బోస్ పేరును పెట్టారు.

 అతడిని ఉరి తీసే సమయానికి ఖుదీరాం బోస్ వయస్సు 18 ఏళ్ల 8 నెలల 8 రోజులు.

దేశం కోసం అప్పటి అధికారులును ఎదిరించడం, ఏకంగా చీఫ్‌ జడ్జీనే హత్య చేసేందుకు బాంబు విసిరిన సాహసిగా చరిత్రలో నిలిచాడు ఖుదీరాం బోస్‌.
 

Show More
Back to top button