Telugu Special Stories

‘టెన్నిస్’ రారాణి… సానియామీర్జా!

భారత్ తరఫున డబ్ల్యూటీఏ టైటిల్‌ ను నెగ్గిన 

తొలి క్రీడాకారిణి.. ఆమె..

అత్యధిక ప్రైజ్‌మనీని గెలుచుకున్న టెన్నిస్ స్టార్..

డబుల్స్‌లో అత్యధిక ర్యాంకు..

అత్యధిక కెరీర్‌ టైటిళ్లు, అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌.. ఇలా అన్నిటిలో అత్త్యుతమ ప్రతిభను కనబరుస్తూ..

అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ప్లేయర్ గా కీర్తి సంపాదించింది మన హైదరాబాదీ సానియా..

‘అమ్మాయిలకు ఆటలెందుకు..’ అన్న వారి మధ్యే రాకెట్ పట్టి.. తన ఆటతీరుతో ఔరా అనిపించింది.

నేడు ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిమంత్రంగా నిలిచింది. భారత మహిళల టెన్నిస్‌కు పునాదిగా మారిన సానియా మీర్జా.. ఇటీవలే తన మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. 

ఆరేళ్ల వయసులో వింబుల్డన్‌ ఆడాలని కలలు కన్న చిన్నారి.. దేశ క్రీడా చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుని గొప్ప ఘనతను దక్కించుకుంది.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆమె కెరీర్, జీవిత విశేషాలను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:

బాల్యం, నేపథ్యం

1986 నవంబర్‌ 15న ఇమ్రాన్‌ మీర్జా, నసీమ దంపతులకు జన్మించింది సానియా మీర్జా. 

వీరిది సంప్రదాయ ముస్లిం కుటుంబం.

తండ్రి నాలుగేళ్ల వయసు నుంచే ఆటల్లో ఉన్నారట. ఇక బంధువుల్లో సైతం క్రికెట్‌లో రాణించినవారున్నారు. వీళ్లను చూస్తూ పెరిగిన సానియాకు క్రీడలపై ఇష్టం పెరిగింది.

ఓసారి వేసవి సెలవుల్లో సానియా తల్లి.. స్విమ్మింగ్‌ క్లాసులకు తీసుకెళ్లారు. సానియా వయసప్పుడు ఆరేళ్లు.. స్విమ్మింగ్ క్లాసులకు వెళ్ళాలంటే అటుగా టెన్నిస్‌ కోర్టుల్ని దాటుకుంటూ వెళ్ళాలి. అలా రోజు చూస్తూ వెళ్ళడం వల్ల టెన్నిస్ మీద ఫోకస్ పెరిగింది. అమ్మ కూడా ‘నువ్వు టెన్నిస్‌ ఎందుకు ఆడకూడదు?!’ అంటూ నాలో ఆసక్తిని మరింత పెంచింది. ఇంకేముంది.. నా దృష్టి ఈత నుంచి టెన్నిస్‌ పైకి మళ్లింది. ఆలస్యం చేయకుండా అమ్మతో కలిసి నిజాం క్లబ్‌ టెన్నిస్‌ కోర్టుకు వెళ్లాను. అక్కడ కోచ్‌ను కలిసి శిక్షణ ఇవ్వమని అడిగా. అప్పుడాయన.. ‘నువ్వు ఇంకా చాలా చిన్నదానివి!, ఆడలేవు…’ అంటూ వద్దని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నేనే గొడవపడి మరీ ఈ శిక్షణలో చేరాను. ఓసారి టీవీలో వింబుల్డన్‌ టోర్నీ చూసి, ఎప్పటికైనా వింబుల్డన్‌ ఆడాలని అనుకునేదాన్ని అని ఆమె స్వగతంలో చెప్పుకొచ్చారు..

ఆమె ఆరేళ్ల వయసులో.. అప్పటికీ టెన్నిస్‌ క్రీడకు సంబంధించిన కనీస సౌకర్యాలు కూడా లేవు. కోర్టు ఏమో.. ఆవు పేడతో చదునుగా అలికి, దానికి రంగులు పూసి ఉంచేవాళ్లట. అదే కోర్టు.. అలానే ఆడాల్సి వచ్చేది. ఎనిమిదేళ్ల వయసులో తనకంటే రెట్టింపు వయసున్న అమ్మాయితో పోటీపడింది.

అండర్‌-16 రాష్ట్ర ఛాంపియన్‌గా మారిన సమయంలో… సానియా ఆట చూసి.. ఒకప్పుడు విమర్శించినవారే తిరిగి ప్రశంసలు కురిపించారు. 

అప్పటినుంచే బలమైన ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవడం, కష్టతరమైన మ్యాచుల్లో ఏ విధంగా తలపడాలనే విషయాలను ఆకళింపు చేసుకుంది. 

కెరీర్, విజయాలు

2003లో ప్రొఫెషనల్‌ కెరీర్‌ ప్రారంభించింది.

43 డబ్ల్యూటీఏ డబుల్స్‌ టైటిల్స్‌ ను తన ఖాతాలో వేసుకుంది. రెండు దశాబ్దాల కాలంలో.. 6 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను చేజిక్కించుకుంది. ఇందులో మూడు మహిళల డబుల్స్‌ కాగా.. మరో మూడు మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్స్‌.

ఆసియా గేమ్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌, ఆఫ్రోఆసియా గేమ్స్‌ ఇలా అన్నింట్లోనూ కలిపి 14 మెడల్స్‌ చేజిక్కించుకున్న 36ఏళ్ల సానియా.. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ లో రన్నరప్‌గా నిలిచింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన మెల్‌బోర్న్‌లోనే.. గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌కు ముగింపు పలికింది. తాజా పరాజయంతో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు దూరమైంది. 

అత్యుత్తమంగా ప్రపంచ 27వ ర్యాంక్‌కు చేరింది. మణికట్టు గాయంతో సింగిల్స్‌కు దూరమైనప్పటికీ,

2013వరకు భారత్‌ తరఫున సింగిల్స్‌లో సానియానే నంబర్‌వన్‌గా కొనసాగిందంటే.. ఆమె ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు..

తన కెరీర్‌లో ప్రపంచ అగ్రశ్రేణి ప్లేయర్లు అయిన మార్టీనా హింగిస్‌, డినారా సఫీనా, విక్టోరియా అజరెంక వంటి వాళ్లపై విజయ పరంపర కొనసాగించింది.  

లెక్కకు మిక్కిలి అవార్డులు, రివార్డులు..

2015లో డబుల్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇయర్‌కు ఎంపికైంది. 

ఇతరాంశాలు

2005లో డబ్ల్యూటీఏ న్యూ కమర్‌(ఎమర్జింగ్‌ ప్లేయర్‌) అవార్డు అందుకున్న సానియా.. 

అందులో ఆరు స్వర్ణాలు ఉండటం విశేషం. 

ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు బంగారు, మూడు రజతం, మూడు కాంస్య పతకాల్ని సాధించింది. ఒక్క  ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం దక్కలేదు అంతే…

*2016 (రియో)లో తృటిలో ఒలింపిక్ చేజార్చుకుంది. మొత్తంగా భారత్‌ నుంచి ఒక మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ అందుకున్న తొలి క్రీడాకారిణిగా పేరు గాంచింది. 

*ఇకపై వ్యాఖ్యాతగా, కోచ్‌గా, మెంటార్‌గా.. ఇలా పలు కొత్త అవతారాల్లో కనిపించనున్నట్లు తెలిపింది. 

*2010–12లో జరిగిన మణికట్టు గాయం తీవ్రంగా వేధించింది. దాదాపు మూడు సర్జరీల వల్ల ఆటపై పట్టు కోల్పోయింది. అయినా ఆత్మవిశ్వాసంతో తిరిగి ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టింది.

2013–14లో కాస్త నెమ్మదించినా.. వరుసగా డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గి, ఐదో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. 2015లో మళ్లీ మునుపటి ఆటతో చెలరేగింది. 

*పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షోయబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాలిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెళ్లి చేసుకోవడం అంతకుమించిన విమర్శలను ఎదుర్కొంది. అయినా.. దేనికి భయపడని ఆమె మనస్తత్వం, వ్యక్తిత్వమే సానియాను ఈ స్థాయికి చేర్చాయి. 

*తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన సమయంలో.. బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ కొనసాగింది సానియా.

*స్వస్థలం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఫేర్‌వెల్ మ్యాచ్.. గత ఆదివారం(మార్చి 5)న ముగిసింది. 

తాను ఓనమాలు నేర్చుకొన్న ఎల్బీ స్టేడియంలోనే మ్యాచ్ ఆడటం విశేషం. స్థానిక అభిమానుల కేరింతలు, చప్పట్లు ఆటకు జోష్ నింపాయి.

తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను సైతం తాను అలరించింది. కాగా సానియాకు చివరి మ్యాచ్ కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో ఎల్బీ స్టేడియానికి తరలివచ్చారు.

స్ఫూర్తి మంత్రం

ఏ రంగంలోనైనా.. మహిళలు తమ కెరీర్‌.. పెళ్లి, అది అవ్వగానే పిల్లలతో ముగుస్తుందని అనుకుంటారు. కానీ సానియా కెరీర్‌పైనే పూర్తిగా దృష్టి సారించింది. బరువు తగ్గి, ఫిట్‌నెస్‌ మెయింటైన్ చేస్తూ వచ్చింది. తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను అంతే చురుకుగా చేరుకోగలిగింది. 

అటు ఇంటి బాధ్యతల్ని, ఇటు కెరీర్‌నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన తీరు నిజంగా ప్రశసనీయమే!

“మనలో ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే.. స్వీయ నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. నా ఈ మూడు దశాబ్దాల క్రీడాప్రయాణంలో టెన్నిస్‌ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా.. అలాగని టెన్నిసే నా జీవితం అవుతుందని చెప్పను.. నా జీవితంలో ఓ కీలక భాగం మాత్రమే! మనలోని ప్రత్యేకతలపై నమ్మకముంచితే జీవితంలో ఎప్పటికీ ఓడిపోం. అదే నేను నమ్మిన సూత్రమ”ని చెబుతోంది ఈ టెన్నిస్ స్టార్. 

సాహో.. సానియా..!

Show More
Back to top button