చాలామంది షాంపూ నేరుగా జుట్టుకు అప్లై చేసుకుంటారు. అది సరైనది కాదట. 3 స్పూన్ల గోరువెచ్చని నీటిలో షాంపూ కలిపి మీ జుట్టుకు అప్లై చేసుకుంటే మంచిది.
తలస్నానం తర్వాత తప్పనిసరిగా కండిషనర్ వాడాలి. అయితే జుట్టు మొదళ్లకు హెయిర్ కండీషనర్ అప్లై చేయకూడదు. జుట్టుకు కండీషనర్ అప్లై చేసిన 2 నిమిషాల తర్వాత నీళ్లతో జుట్టును శుభ్రంగా కడగాలి.
కొంతమంది రోజూ షాంపూతో తలస్నానం చేస్తారు. ఇది వెంట్రుకల్లో సహజ నూనెలను తీసి, జుట్టును పొడిగా చేస్తుంది. ప్రతిరోజు షాంపూతో తలస్నానం చేసే అలవాటు ఉన్నవారు రాత్రి పడుకునే ముందు జుట్టుకు నూనె రాసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు.
సల్ఫేట్ లేని షాంపూలు జుట్టుకు హాని కలిగించవు. ఈ షాంపూలు కెమికల్ ఫ్రీగా ఉండటమే కాకుండా వెంట్రుకలను మృదువుగా చేస్తాయి.
ఏదైనా హెర్బల్, ఆయుర్వేద షాంపూలో హానికరమైన రసాయనాలు ఉండవు. కాబట్టి, వీటిని వినియోగిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
షాంపూ చేసిన వెంటనే మీ జుట్టును ఆరబెట్టడానికి డ్రైయర్‌ను ఉపయోగించడం మంచిది కాదంటున్నారు నిపుణులు. జుట్టు త్వరగా ఆరబెట్టడానికి డ్రైయర్ హీట్ మోడ్‌లో వాడితే వెంట్రుకలు బలహీనమౌతుంది.