అందుకే పండుగలు వచ్చినప్పుడు ఉపవాసం ఉండటం పూర్వం నుంచే ఓ ఆచారంగా వస్తోంది. శాస్త్రీయంగా కూడా ఉపవాసం ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాల్లో తేలింది. ఉపవాసం సమయంలో మన శరీరంలో ఉన్న చెడు కొవ్వు.. కరిగే అవకాశముంది. అయితే ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ ఐదు రకాల ఆహార పదార్థాలు తినకూడదు.
కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే పదార్థాలు
ఉపవాసం వల్ల మీ శరీరం కార్బోహైడ్రేట్ ఫుడ్‌ను జీర్ణం చేసుకోలేదు. అందువల్ల పూరీ, ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్, రైస్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
నిల్వ చేసిన ఆహారం
ఈ ఆహారంలో అనేక ప్రిజర్వేటివ్స్, షుగర్ అధికంగా ఉంటుంది. తక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయి.
కార్బోనేటెడ్ డ్రింక్స్
సోడా, సాఫ్ట్ డ్రింక్స్ వంటి కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ఖాళీ కడుపుతో ఇవి తీసుకుంటే కడుపులో ఒత్తిడి పెరుగుతుంది.
చక్కెర అధికంగా ఉండే ఆహారం
గులాబ్ జామ్, లడ్డు, ఖీర్ వంటి తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఫాస్టింగ్ తర్వాత వీటిని తీసుకుంటే రక్తంలో షుగర్ ఒకేసారి పెరిగిపోతుంది.
ఉప్పు అధికంగా ఉండే ఆహారం
ఉపవాసంతో ఉన్నప్పుడు తక్కువ ఉప్పు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. ఇది బీపీని తగ్గిస్తుంది.