మైగ్రైన్ : ఈ నొప్పి వచ్చిందంటే కొన్ని రోజుల వరకూ వేధిస్తుంటుంది. ఈ నొప్పి ఎక్కువగా తలకు ఒక పక్కనే వస్తుంది. కొంతమందికి వికారం, వాంతి వచ్చినట్లుగా ఉంటుంది.
*టెన్షన్ : తీవ్రమైన తలనొప్పి ఉన్నప్పుడు ఈ నొప్పి తలచుట్టూ ఉంటుంది.
*సైనస్ : చెంపలు, కళ్లనొప్పి, ఒత్తిడికి గురైనట్లు అనిపిస్తుంది. కొంతమందిలో పంటినొప్పి, వాసన తీసుకొనే ఇబ్బంది ఉంటుంది.
*థండర్ క్లాప్ : అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడాన్ని థండర్ క్లాప్ తలనొప్పి అంటారు. ఇది 60 సెకన్ల నుంచి 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. దీన్ని చాలా ప్రమాదకరమైన నొప్పిగా భావించాలి. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం. ఈ తలనొప్పి వస్తుంటే.. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
*క్లస్టర్: ఏదైనా ఒక కంటికి ఏర్పడే తలనొప్పిని క్లస్టర్ తలనొప్పి అంటారు. దీని వల్ల కన్ను ఎర్రబడి వాపు వస్తుంది. ముక్కు దిబ్బడ, కళ్ల నుంచి నీరు కారడం దీని లక్షణం. ఈ నొప్పి 15 నిమిషాల నుంచి 3 గంటలు ఉంటుంది.
*అలర్జీ తలనొప్పి: అలర్జీ వల్ల జలుబు, ముక్కుకారడం, అతిగా తుమ్ములు ఈ తలనొప్పికి కారణం.