
ఎల్లప్పుడూ హెల్తీగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, సరిపడా నిద్ర ఉంటే చాలదు.. కాస్తంత వ్యాయామం చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందుకు చక్కని సమయం.. మార్నింగ్.. అవును.. ఉదయం చేసే వ్యాయామం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చాలామందికి తెలియదు. అవేంటో ఇప్పుడు చూద్దామా…
రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల జీవక్రియల వేగం పెరుగుతుంది. ఇది నిత్యం మనల్ని హెల్తీగా, చురుకుగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.
అంతేకాదు అధిక బరువుతో బాధపడేవారు డైలీ ఎక్సర్ సైజ్ చేయడం అలవాటు చేసుకుంటే, క్యాలరీలు కరిగి, మీరు కోరుకున్న ఆకృతి మీ సొంతమవుతుంది.
అలసట, చిరాకు, ఒత్తిడి వంటి మానసిక ఇబ్బందులకు గురైనప్పుడు.. ఉదయం చేసే వ్యాయామం ఎంతో సాయపడుతుంది. శారీరకంగా కష్టపడటం వల్ల ఒత్తిడి తగ్గి, మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
ఎక్సర్ సైజ్ లో భాగంగా మీరు వాకింగ్, జాగింగ్… ఇలా ఏది చేసిన ఆ రోజంతా తాజాగా, రిఫ్రెష్ మెంట్ ఫీలవుతారు.
ఉదయం అరగంటసేపు చేసే వ్యాయామం వల్ల సహజంగా ఆకలి పెరుగుతుంది. దీంతో సమయానికి తినడం, ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఉదయం పూట చేసే కొద్దిపాటి వ్యాయామం వల్ల ప్రశాంతమైన నిద్రను పొందుతారు. ఈ విషయం పలు వ్యక్తుల మీద జరిపిన పరిశోధనల్లో తేలింది.
డిప్రెషన్, ఒంటరితనం.. వంటివి ఉన్నా.. క్రమంగా దూరమవుతాయి.
రెగ్యులర్ గా చేసే వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆపై అధిక రక్తపోటు సంబంధిత గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది.