TRAVEL ATTRACTIONS

హంపిలో చూడదగ్గ అందాలు

హంపిని చూడాలంటే రెండు కనులు సరిపోవు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హంపి మొత్తం చూడాల్సిందే అని హంపికి వెళ్లిన వారు అంటున్నారు. అక్కడ ఉన్న ప్రతి ప్రదేశం మరో ప్రదేశంపై ఆసక్తి పెంచుతుంది. ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా పురాతన నిర్మాణాలు అక్కడి ప్రత్యేకత. అలాంటి ప్రదేశానికి వెళ్లడానికి మీ నివాస స్థలం నుంచి హొసాపెట్ రైల్వే స్టేషన్‌‌కి చేరుకోవాలి. అక్కడి నుంచి హంపి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. డైరెక్ట్ హంపికి వెళ్లడానికి రైల్వే స్టేషన్ లేదు. హంపిలో చూడదక్క అందాలు చాలా ఉన్నాయి.

అందులో విరూపాక్ష దేవాలయం, కడలేకలు గణపతి, శశిరేకలు గణపతి, శ్రీ కృష్ణ దేవాలయం, బడవి లింగ, ఉగ్ర నరసింహ, లోటస్ మహల్, హజరా రామాలయం, మహానవమి దిబ్బ, కమలాపుర మ్యూజియం ప్రదేశాలు తప్పకుండా చూడాలి.

హంపిలో తిరగడానికి బస్సు, ఆటో లేదా ప్రైవేట్ బండి ఇలా మీ సౌకర్యాన్ని బట్టి రవాణాను ఎంచుకోవచ్చు. అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూడడానికి కనీసం 3 రోజుల సమయం పడుతుంది. కాబట్టి మీ ట్రిప్‌ని సమయానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ఇక ట్రిప్ ఖర్చుకు వచ్చేస్తే 3 రోజులకు గాను ఒక్కరికి రూ.3,500 నుంచి రూ.6000 వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు మీ బడ్జెట్‌ బట్టి రూం, రవాణాను ఎంచుకోండి.  

Show More
Back to top button