ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటి వరకు ఏ ఒక్కరికి అర్థం కాని బ్రహ్మ పదార్ధంగా ఉండేవి. చంద్రబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక స్పష్టత చోటు చేసుకుంటున్నది. ముఖ్యంగా ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబును అరెస్టు చేసి జగన్ తప్పు చేశారని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ అరెస్టు జగన్ పతనానికి నాంది అని, చంద్రబాబుకు సింపతీ వచ్చి రాబోయే ఎన్నికల్లో తప్పక టీడీపీ విజయం సాధిస్తుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
దానికి తగ్గట్టుగానే తాజాగా సి-ఓటర్ అనే సంస్థ ఏపీ రాజకీయాలపై ఓ సంచలన సర్వే విడుదల చేసింది. ఈ సర్వేలో చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి విపరీతమైన సానుభూతి వచ్చిందని వెల్లడైంది. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగంగా ఏపీ ప్రజలు భావిస్తున్నారని, దీనిపై జగన్‌లో అభద్రతాభావం పెరిగిపోయిందని సర్వేలో పేర్కొంది.
అంతేకాదు ఇది వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపడం తథ్యమని వెల్లడించింది. ముఖ్యంగా జనసేన పొత్తుతో చంద్రబాబు సీఎం అవ్వడం ఖాయమని ఈ సర్వే చెబుతోంది. అయితే, ఈ సర్వేలో బీజేపీ, టీడీపీ, వైసీపీ సానుభూతి పరులతో పాటు ఇతరుల అభిప్రాయాన్ని కూడా తెలిపినట్లు సి-ఓటర్ సర్వే వెల్లడించింది.
సర్వేకు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
- ఈ సర్వేలో మొత్తం 1,809 మంది పాల్గొంటే.. 58% మంది సీఎం జగన్‌లో ఎన్నికలపట్ల భయాదోనళన, అభద్రతాభావం ఉన్నట్ల వెల్లడించారు.
- మొత్తం ఓటింగ్‌లో 86% మంది టీడీపీకి సపోర్లగా ఉన్నట్లు సి-ఓటర్ సంస్థ గుర్తించింది.
- ఈ ఓటింగ్‌లో 2/3% మంది (బీజేపీకి సంబంధించిన) టీడీపీకి సపోర్ట్‌గా ఉన్నట్లు తెలిపారు.
- ఇక సొంత YSRCP పార్టీ నుంచి 36% మంది సీఎం జగన్ అభద్రతాభావంతో ఉన్నట్లు తెలిపారు.
దీనికి సంబంధించిన సర్వే ఈ క్రింది విధంగా మనం చూడవచ్చు.