
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం వైఎస్ఆర్ ఫ్యామిలీకి అడ్డాగా మారింది. ఎందుకంటే 1978 నుంచి ఇక్కడ వరుసగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి చెందిన సభ్యులే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు.
1978, 1983, 1985లో వైఎస్ రాజశేఖర్రెడ్డి, 1989లో వైఎస్ వివేకానందరెడ్డి, 1991లో వైఎస్ పురుషోత్తమరెడ్డి, 1994లో వైఎస్ వివేకానందరెడ్డి, 1999, 2004, 2009లో వైఎస్ రాజశేఖర్రెడ్డి, 2010, 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ, 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఇప్పుడు 2024 ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్ బరిలో నిలిచారు. టీడీపీ నుంచి బీటెక్ రవి జగన్ను ఢీకొట్టబోతున్నారు. మరి 46 ఏళ్ల చరిత్రను టీడీపీ తిరగరాస్తుందా లేదా చతికిలపడుతుందా అన్నది మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది.