Telugu Politics

టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలకై వరాలు జల్లు

మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాల్లో భాగంగా టీడీపీ బడుగు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించిందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛన్ అందిస్తామని వెల్లడించారు. రూ.1.50 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని పేర్కొన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. వృత్తిదారులకు ఆదరణ పథకం ద్వారా రూ.5 వేల కోట్ల విలువ చేసే పరికరాలను అందిస్తామని హామీ ఇచ్చారు. 

పెళ్లి కానుక రూ.లక్షకు పెంచి ఇస్తాం. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం అన్నారు. ముఖ్యంగా బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తాం అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆధునిక సమాజంలో ‘కుల నిర్మూలన’ ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫులే అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆ మహాశయుని స్ఫూర్తితోనే బడుగు బలహీన వర్గాలకు  రాజకీయాల్లోనూ, అధికారంలోనూ  ప్రాధాన్యం కల్పించి, బీసీల పార్టీగా  తెలుగుదేశం పేరుగాంచందని ఆయన అన్నారు.

Show More
Back to top button