Telugu Politics

పథకాలు అమలు తప్పక జరుగుతుంది..!

రాష్ట్రంలో భారీ మెజారిటీతో గెలుపు సాధించిన కూటమి ప్రభుత్వం పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రజలు సూపర్ సిక్స్ పట్ల ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వృద్ధుల పింఛన్ అనుకున్న విధంగానే ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదినే జీతాలు ఇవ్వడం, ఉచితంగా ఇసుక ఇవ్వడం ఇవన్నీ చంద్రబాబు గారి పరిపాలనకు మచ్చు తునక. అయితే, ఇన్ని చేస్తున్న కొన్ని పార్టీలు మాత్రం పాలక పక్షాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంది.

అయితే ఇది అంతా మాములే. కానీ పథకాల అమలుకు టీడీపీ ఏమి విస్మరించలేదు. ప్రస్తుతం దేనికి తొందర పడటం పథకాలు అమలుకు విధి విధానాలు రూపొందించటంలో నిమగ్నమైంది. దీనికి తగ్గట్టుగానే అన్న క్యాంటిన్స్ ఆగస్టు 15న ప్రారంభం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక అమ్మకు వందనం పేరుమీద చేపడుతున్న పథకాన్ని వైసీపీ నేతలు కొన్ని ఆరోపణలు చేస్తున్నా.. చెప్పినట్లుగానే ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు బడికి పోతున్నారో అందరికీ ఇవ్వాలనే తలంపుతో ఉన్నట్లు కూటమి చెబుతుంది. 

మరోపక్క పథకం RTCలలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇది కూడా త్వరలో అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ పథకాన్ని రాష్ట్రమంతా ఇవ్వాల లేక జిల్లా స్థాయిలో ఇవ్వాల అనే విషయంపై తర్జన భర్జన పడుతోంది. మొత్తానికి రాష్ట్రమంతా ఇవ్వాలి అనే దిశలో కసరత్తులు చేస్తుంది. మరోపక్క ముఖ్య పథకం అయిన నెలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రూ.1,500 ఇవ్వాలి. ఇది కూడ ఒక పండుగలా చేయాలి అనే ఉత్సహంతో ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్స్ కూడా త్వరలో ప్రతి లబ్ధిదారులకు అందుతుంది. వీటికి ప్రామాణికంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి అనే షరత్తు ఉండాలి.

అప్పుడే నిజమైన పేదవారికి వరాలు అందుతాయి. ఇకపోతే ఇప్పటికే అమరావతి అన్ని హంగులు సంతరించుకుంటోంది. పోలవరం అభివృద్ధి దిశలో సాగుతోంది. వీటన్నిటికి భారీ నిధులు కావాలి. కేంద్రంతో ఆచి, చూచి నడచుకుని సాధించుకోవాలి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. గత ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చింది అని చెప్పకూడదు. ఒకవేళ చెబితే విమర్శలు మీద విమర్శలు వస్తాయి. చేసి చూపించడమే పాలక పక్షం లక్ష్యం కావాలి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి బేషజాలకు పోకుండా, అధికార దర్పం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనే విధంగా నడచుకోవాలి. అప్పడే మళ్లీ మళ్లీ కూటమి అధికారంలోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న సీఎం చంద్రబాబు తర్వాత గద్దె నెక్కాలి అని నాయకులు పొట్లాడకుండా ఉండాలి. తదుపరి సీఎం లోకేష్, బాలకృష్ణ, పురందేశ్వరి, అచ్చేనాయుడు, పవన్ కళ్యాణ్ మొదలగు వారు పోటీ పడవచ్చు. అయితే, కూటమి ఏ మాత్రం విచ్చిన్నమై మూడు పార్టీలు తెగ తెంపులు చేసుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. అధికారం నాది, నాది అనే యావ నాయకులకు ఉండరాదు. అది ఉంటే మాత్రం అభివృద్ధి ఉండదు. కనుక ఒక బలమైన నాయకుడు, ప్రజా నాయకుడు ప్రజలకు అవసరం. అయితే భవిషత్తులో ఎలా పరిమాణాలు చోటు చేసుకుంటాయో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

Show More
Back to top button