9 సార్లు ఎన్నికలు జరగ్గా.. 8 సార్లు టీడీపీదే అధికారం..! మరి ఈసారి ఎవరిదో..?

ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇచ్చాపురంలో బీసీ వర్గానికి చెందిన ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఈ కారణంగా ఇక్కడ రెండు ప్రధాన పార్టీలు బీసీలకు టికెట్లు కేటాయించాయి. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ బరిలో ఉండగా.. ఆయనపై మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ భార్య విజయ వైసీపీ తరపున పోటీకి దిగుతున్నారు.
రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ 9 సార్లు ఎన్నికలు జరగ్గా 8 సార్లు టీడీపీనే అధికారం దక్కించుకుంది. ఒక విధంగా ఇచ్చాపురం టీడీపీకి కంచుకోట అని చెప్పుకోవచ్చు. అయితే, రాబోయే ఎన్నికలలో ఇక్కడ టీడీపీ గెలవడం అంత సులభమేమి కాదని రాజకీయ ఉద్ధండులు చెబుతున్నారు. ఎందుకంటే..
వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ప్రధాన సమస్యైనా ఉద్దానం కిడ్నీ బాధితులకు చేసిన అభివృద్ధిని చూపిస్తూ ఈ ఎన్నికల బరిలో దిగుతుంది. కాబట్టి, ఈ సారి ఇరు పార్టీల మధ్య పోరు హోరాహోరీగా జరగనుంది. మరి నియోజకవర్గ ప్రజలు ఎప్పటిలాగే టీడీపీ వైపు మొగ్గు చూపుతారా?.. లేక వైసీపీకి అధికారాన్ని ఇస్తారా? అనేది చూడాల్సిందే.