Telugu Politics

రాష్ట్ర అభివృద్ధి.. ‘టీడీపీ‘ని గెలిపించడం మీదనే ఆధారపడి ఉంది’

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలు తలమునకలుగా వున్నాయి. ఇందులో ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఓ కూటమిగా, వైసీపీ ఒంటరిగా పోటీపడుతున్నాయి. అయితే కూటమిలో మెజారిటీ స్థానాల్లో తెలుగుదేశమే పోటీ చేస్తోంది. జనసేన, బీజేపీ నామ మాత్రపు సీట్స్‌లోనే పోటీ చేస్తున్నాయి. అంటే వాటికి కూడా తెలుసు టీడీపీ అండ లేనిదే గెలుపు కష్టమని. అందుకే కొన్ని స్థానాలకే అవి మొగ్గు చూపాయి. తెలుగుదేశం ఖరాఖండిగా మెజారిటీ స్థానాలు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వైసీపీ 175 మావే అని చెప్పటం చూస్తుంటే ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయి అనిపిస్తోంది. పాలకపక్షం గెలుపు మాదే అనే ధీమాతో ఉంది. కూటమి కూడా మాదే అధికారం అనే ధోరణిలో ఉంది.

సాధారణంగా పార్టీలు ఓటరకు డబ్బును ఎరగా చూపుతారు. డబ్బు ఎవరు ఎక్కువగా ఇస్తే వారికే మా ఓటు అన్నట్లు కొంతమంది ఓటర్లు బహింరంగానే ప్రకటిస్తారు. అలాంటి ఓటర్లకు సీఎం జగన్ గత ఐదేళ్లుగా బటన్ నొక్కే కార్యక్రమాల్లో పాల్లొని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి దీటుగా కూటమి కూడా ఉచిత తాయిలాలు ప్రకటించింది. బస్సులలో స్త్రీలకు ఉచిత ప్రయాణం అటువంటిదే. ఇది బాగా పని చేయవచ్చు. గంపగుత్తుగా స్త్రీల ఓట్లు పడవచ్చేమోననిపిస్తోంది. అయితే, టీడీపీ విషయంలో ఓటరకు మంచి పాజిటివ్ అభిప్రాయమే ఉన్నట్లు అనేక సర్వేల ద్వారా కనిపిస్తోంది. 

సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనాలకు డబ్బులు పంచడంతోపాటు.. పరోక్షంగా అదే జనాలు నుంచి పన్నులు రూపంలోనో.. కరెంట్ బిల్లులు రూపంలోనే వసూలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతోపాటు రాష్ట్ర అభివృద్ధి కుంటి పరచడంలో సీఎం జగన్ ముందంజలో ఉన్నట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే ఆ అభివృద్దిని గట్టెక్కించడం కేవలం టీడీపీ వల్లే సాధ్యం అవుతుందని, ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారని అందుకే టీడీపీ గెలవడంలో ఈ అంశాలు ఎంతగానో దోహదపడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో DSC ప్రకటన ఎన్నికలకు ముందు ఏదో తొందరగా నెరవేర్చడానికి ప్రయత్నించారు. అయితే ఇలాంటివి వెంటనే అమలు చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఎన్నికల ముందు అమలు చేయటం మంచిది కాదు అని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఎవరు అధికారంలోకి వచ్చినా విమర్శలు తప్పవు. కూర్చి కాపాడుకోవటం తోనే సమయం వృధా అవుతుంది. ఇక నాయకుల అలకలు, బుజ్జగింపులు మాములే. అందరికీ పదవులు కావాలి. లేకపోతే తిరుగుబాటు, ఈ విధానము పోతారు. పాలకపక్షం అయినా, కూటమి అయినా లోలోపల వారి వారి అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేసే వారు ఉన్నారు. ఇది వారి విచక్షణకు వదలాలి. మనమంతా ఒకటే అనే భావన ప్రతి పార్టీకి ఉండాలి. లేకపోతే పార్టీలకు భవిష్యత్ ఉండదు. ఏది ఏమైనప్పటకీ జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్‌లో ఓటరు ఏ పార్టీకి అధికార పగ్గాలు చేపట్టిస్తాడో.. వేచి చూడాల్సిందే.

Show More
Back to top button