TRAVEL ATTRACTIONS

పూరి చూసొద్దామా..?

వేసవికి, శీతాకాలానికి మధ్యలో ఉండే ఈ సమయంలో పర్యటించడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అయితే, ఈ సమయంలో ఏ ప్రదేశానికి వెళ్లాలి..? అని చాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి పూరి ఒక మంచి ప్రదేశంగా చెప్పవచ్చు. పూరి ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లడానికి తిరుపతి, విజయవాడ, వైజాగ్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. 

హైదరాబాద్ నుంచి పూరికి వెళ్లాలంటే మాత్రం ఖుర్దా రైల్వే స్టేషన్‌లో దిగాలి. ఈ స్టేషన్ నుండి పూరి 52 కి.మీ ఉంటుంది. ఇక్కడ నుండి బస్సు, ఆటో, క్యాబ్‌లో పూరి బస్‌ స్టాప్‌కు వెళ్లవచ్చు. పూరి బస్‌ స్టాప్ నుంచి పూరి జగన్నాథాలయం 3 కి.మీలు ఉంటుంది. పూరిలో ఉండడానికి మంచి ప్రదేశం బీచ్ రోడ్. ఇప్పుడు పూరిలో ఏ ఏ ప్రదేశాలు చూడవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం.

పూరిలో చూడవలసిన ప్రదేశాలు..

*పూరి జగన్నాథ్ ఆలయం

*శ్వేత గంగ తీర్థం

*పూరి బీచ్

*కోణార్క్ టెంపుల్

*చిల్కా లేక్

*విమల టెంపుల్

*బలిహరచండి బీచ్

పూరి టూర్ మొత్తానికి దాదాపు 3-4 రోజుల సమయం పడుతుంది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది..? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. 

*మీరు ఎంచుకునే రవాణా ప్రకారం ప్రయాణం ఖర్చు ఉంటుంది.

*రోజుకు రూంకి దాదాపు రూ.800 నుంచి రూ.1500 వరకు అవుతుంది.

*భోజనానికి రోజుకు దాదాపు రూ.500 వరకు ఖర్చవుతుంది.

*ఇతర ఖర్చులు రోజుకు రూ.500 అవ్వొచ్చు.

*ప్రవేశ టికెట్లకు రూ.1000

*పూరి మొత్తం టూర్‌కు దాదాపు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు అవుతుంది.

Show More
Back to top button