TRAVEL ATTRACTIONS

బడ్జెట్‌లో ఇంటర్నేషనల్ టూర్‌‌కి వెళ్లొద్దామా..!

చాలామంది ఇంటర్నేషనల్ టూర్‌కి వెళ్లాలంటే లక్షల్లో ఖర్చవుతుందని భయపడతారు. కానీ రూ.20 వేలలోనే మంచి ఇంటర్నేషనల్ టూర్‌ వెళ్లవచ్చు. అదే భారత్‌కు అత్యంత సమీపంలో ఉన్న శ్రీలంక దీవి. భారత్ నుంచి శ్రీలంక చేరుకోవడానికి విమాన మార్గం లేదా నీటి మార్గాలు ఉన్నాయి. మీరు విమానం నుంచి వెళ్లాలనుకుంటే ముందుగా చెన్నై చేరుకుని, అక్కడి నుంచి విమానంలో శ్రీలంక చేరుకోవడం ఉత్తమ మార్గం.

ఎందుకంటే చెన్నై నుంచి శ్రీలంక విమాన టికెట్ ధర తక్కువగా ఉంటుంది. లేదనుకుంటే హైదరాబాద్ నుంచి కూడా మీరు విమానంలో వెళ్లవచ్చు. అక్కడకి వెళ్లడానికి మీరు ముందుగానే ఆన్‌లైన్‌లో ఈ-వీసా‌కు దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం https://eta.gov.lk/slvisa/ వెబ్‌సైట్‌కి వెళ్లి మీ పూర్తి వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీ రిజిస్టర్ మెయిల్‌ ఐడీకి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. మీరు ఈ-వీసా తీసుకున్న తర్వాత 6 నెలల వరకు మాత్రమే వాలిడిటీ ఉంటుంది. అలాగే నెల రోజులు మాత్రమే మీరు శ్రీలంకలో ఉండగలరు.

ఒక్కసారి శ్రీలంక విమానాశ్రయం చేరుకున్న తర్వాత భారత్ కరెన్సీని శ్రీలంక కరెన్సీతో మార్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే అక్కడ దిగిన తర్వాత అక్కడి సిమ్ తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీలంక చేరుకున్న తర్వాత అరైవల్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడి నుంచి మీ ప్రయాణం ప్రారంభం అవుతుంది. శ్రీలంకలో కొలంబో, కాండీ, గలంలు, నిగంబొ నగరాలు ఎంతో ఫేమస్. ఈ నగరాలను తప్పకుండా సందర్శించండి. వీటితో పాటు శ్రీలంకలో చేయవలసిన పనులు మరికొన్ని ఉన్నాయి. అవేంటంటే..

*కొలంబో ట్రెయిన్ ప్రయాణం తప్పకుండా చేయండి.

*అక్కడి కొట్టు రోటి స్ట్రీట్ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి.

*యాలా నేషనల్ పార్క్ సందర్శించడం అసలు మార్చిపోకండి

Show More
Back to top button